కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.47,000 కోట్ల సమీకరణ లక్ష్యాన్ని ప్రతిపాదించింది. అయితే డిజిన్వెస్ట్‌మెంట్, ఆస్తుల మానిటైజేషన్ తదితర మూలధన వసూళ్లకింద ఈ మొత్తాన్ని అంచనా వేసింది. వెరసి రూ.47,000 కోట్ల మిస్‌లేనియస్ క్యాపిటల్ రిసీప్ట్స్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. వెరసి పీఎస్‌యూలలో వాటాల విక్రయం ద్వారా నిధుల సమీకరణ(డిజిన్వెస్ట్‌మెంట్)ను ప్రత్యేకంగా ప్రస్తావించకుండా ఏడాది మూలధన సమీకరణగా పేర్కొంది.
2024–25లో ప్రభుత్వం వార్షిక డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాల నుంచి దూరం జరిగింది. పీఎస్‌యూలలో వాటాల విక్రయం, ఆస్తుల మానిటైజేషన్ తదితర మిస్‌లేనియస్ క్యాపిటల్ రిసీప్ట్స్ ద్వారా రూ.50,000 కోట్ల లక్ష్యాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా ఎంఎస్‌టీసీ సహా పలు ప్రభుత్వ రంగ సంస్థల ఐపీవోలకు దీపమ్ ప్రణాళికలు వేసింది. పీఎస్‌యూ దిగ్గజాలు హెచ్‌ఏఎల్, కోల్ ఇండియా, ఆర్‌వీఎన్‌ఎల్, ఎస్‌జేవీఎన్, హడ్కోలలో మైనారిటీ వాటాల విక్రయం(ఓఎఫ్‌ఎస్)ను సైతం చేపట్టింది. తద్వారా రూ. 13,728 కోట్లు సమకూర్చుకుంది. అయితే ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్‌సహా వ్యూహాత్మక వాటాల విక్రయం పట్టాలెక్కలేదు. 2021 అక్టోబర్‌లో టాటా గ్రూప్‌నకు విమానయాన దిగ్గజం ఎయిరిండియా విక్రయం తదుపరి ప్రధాన డీల్స్‌కు చెక్‌పడింది.
ఇదీ చదవండి: డివిడెండ్@రూ.2.56లక్షల కోట్లు
ద్రవ్యలోటు@రూ.15,68,936కోట్లు
ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం..ద్రవ్యలోటును 2024–25లో అనుకున్న ప్రకారం 4.8% వద్ద (జీడీపీ విలువలో) కేంద్రం కట్టడి చేయగలిగింది. విలువల్లో ఇది రూ.15,68,936 కోట్లు. 2025–26లో 4.4%కి తీసుకురావాలని నిర్దేశించుకుంది. గణాంకాల్లో చూస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.15.70 లక్షల కోట్ల ద్రవ్యలోటు అంచనా వేయగా, అంతకన్నా తక్కువగా రూ.15.69 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. తాజా ద్రవ్యలోటును పూడ్చుకోడానికి రూ.11.54 లక్షల కోట్ల మార్కెట్ రుణాన్ని సమీకరించాలని కొత్త బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది. మిగిలిన మొత్తాలను చిన్న తరహా పొదుపు మార్గాల ద్వారా సమీకరించాలని బడ్జెట్ నిర్దేశించింది. స్థూలంగా రూ.14.82 లక్షల కోట్ల మార్కెట్ రుణాలను స్వీకరించాలన్నది లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment