న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీలో వాటా విక్రయానికి (డిజిన్వెస్ట్‌మెంట్) రంగం సిద్ధమైంది. తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఏర్పాటుకానున్న కమిటీ ఎంత వాటాను విక్రయించేదీ, షేరు విక్రయ ధరను నిర్ణయించనున్నట్లు ఈ సందర్భంగా అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్) జనవరిలోనే ఎల్‌ఐసీ విలువ మదింపునకు మిల్లీమన్ అడ్వయిజర్స్‌ను నియమించింది.
ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఎల్‌ఐసీని లిస్టింగ్ చేసే అంశానికి గత వారమే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాగా.. ఎల్‌ఐసీ డిజిన్వెస్ట్‌మెంట్‌తో దేశంలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి తెరలేవనుంది. ఎల్‌ఐసీ చట్టానికి బడ్జెట్‌లో చేపట్టిన సవరణలతో కంపెనీ అంతర్గత విలువను మిల్లీమన్ మదింపు చేయనుంది. ఈ ఏడాది (2021–22) ముగిసేలోగా ప్రభుత్వం ఎల్‌ఐసీ ఐపీవోను చేపట్టగలదని అంచనా.
చదవండి: Ola Electric Vehicles : ఏడాది కోటి ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ
Comments
Please login to add a commentAdd a comment