విద్యుత్‌ ఉద్యోగుల ‘పీఆర్సీ’ గడువు పెంపు | Salaries and allowances of employees of power companies | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఉద్యోగుల ‘పీఆర్సీ’ గడువు పెంపు

Published Thu, Apr 14 2022 3:40 AM | Last Updated on Thu, Apr 14 2022 11:26 AM

Salaries and allowances of employees of power companies - Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ సంస్థల ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్సులు, ఇతర ప్రయోజనాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పడ్డ పే రివిజన్‌ కమిషన్‌(పీఆర్సీ) ఈ నెల 30 వరకూ వినతులు స్వీకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీసీపీడీసీఎల్‌) సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఆపరేషన్స్‌) సర్కిల్‌ కార్యాలయంలో ఫిబ్రవరి 15 నుంచి వినతులు స్వీకరించడం మొదలెట్టిన పీఆర్సీ.. తొలుత ఫిబ్రవరి నెలాఖరు వరకూ షెడ్యూల్‌ ఇవ్వగా, అనంతరం ఈ నెల 13 వరకూ గడువు పొడిగించుకుంటూ వచ్చింది.

అయినప్పటికీ ఇంకా వినతులు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించి ఈ నెలాఖరు వరకూ అవకాశం కల్పిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏపీ ట్రాన్స్‌ కో, ఏపీ జెన్‌ కో, మూడు డిస్కంల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వివిధ యూనియన్ల నుంచి మంగళవారం నుంచి శుక్రవారం వరకూ రోజూ ఉదయం 11 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు నేరుగా స్వీకరిస్తారు. అయితే స్వయంగా వెళ్లి వినతులిచ్చే అవకాశం లేనివారి కోసం ఈ–మెయిల్‌ prc2022 powerutilities@gmail.com, వాట్సప్‌ నంబర్‌ 8500676988 సదుపాయాలను కూడా ఈసారి పీఆర్సీ అందుబాటులోకి తెచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement