
మాధవ రెడ్డి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి) : బతికుండగానే ఆ వృద్ధుడిని రికార్డుల్లో చంపేశారు. రూ.ఐదువేలు లంచం ఇవ్వనందు కే అధికారులు ఇంతపని చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లికి చెందిన జంగ మాధవరెడ్డి(80) వృద్ధుడు కొంతకాలంగా ఆసరా పెన్షన్ తీసుకుంటున్నాడు. అక్టోబర్ నుంచి పెన్షన్ జాబితాలో మాధవరెడ్డి పేరు తొలగించారు. ఎందుకు తొలగించారని అడిగితే బతి కున్నవారి జాబితాలో తనపేరు లేదని అం దుకే తొలగించారని అధికారులు సెలవిచ్చారని, పైఅ ధికారులకు రూ. ఐదువేలు లంచం ఇస్తే తిరిగి పెన్షన్ కొనసాగుతుందని అధికారులు కరాఖండిగా తేల్చారని బాదితుడు వాపోయాడు. తనకు భార్య పిల్లలు లేరని ప్రభుత్వం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో రూ.200 ఇచ్చారని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రూ. వెయ్యి ఇచ్చారని ఇప్పుడు లంచం ఇస్తేనే తిరిగి పింఛన్ ఇస్తామనడంతో ఆ వృద్ధుడు మండల పరిషత్ కార్యాలయానికి వచ్చాడు.
లంచం అడగలేదు..
పింఛన్ విషయమై ఎంపీడీవో సురేశ్‌ను ‘సాక్షి’ వి వరణ కోరగా గ్రామ పంచాయతీ వారు పంపిన జాబితాలో చనిపోయినట్లు పేర్కొనడంతో పింఛన్ నిలిపి వేశామని తానెవరిని లంచం అడగలేదన్నారు. కావాలనే నాపై ఆరోపణలు చేస్తున్నారని మాధవరెడ్డికి తిరిగి పింఛన్ కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment