జక్రాన్‌పల్లి, న్యూస్‌లైన్: ప్రభుత్వ నిధులు, గ్రామ పంచాయతీ భాగస్వామ్యంలో రూ. రెండున్నర కోట్ల రూపాయల నిధులతో జక్రాన్‌పల్లి మండలంలోని బ్రా హ్మణ్‌పల్లి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చే స్తామని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యద ర్శి నాగిరెడ్డి తెలిపారు. పెలైట్ ప్రాజెక్టుగా ఎంపికైన ఈ గ్రామాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రా మసభలో ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ముందుగా ఐదేళ్ల ప్ర ణాళిక తయారు చేసుకోవాలన్నారు. 22 రకాల ఆదాయ వనరులను సమకూర్చుకోవచ్చన్నా రు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలన్నా రు. పంచాయతీరాజ్ కమిషనర్ డి వరప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అమలు చేస్తామన్నారు. గ్రామానికి అవసరాలు ఏమిటి, నిధు లు ఎలా సమకూర్చుకోవాలి, ప్రభుత్వ నిధు లు, వివిధ శాఖల ద్వారా ఏ మేరకు నిధుల వ స్తాయి, పన్నుల ద్వారా ఎంత ఆదాయం ఉం టుంది? అనే అంశాలను అధ్యయనం చేశారు. రూపేణ ఎన్ని నిధుల వస్తాయి అనే అంశాలపై అధికారులు అధ్యయనం చేశారు.
ఐదేళ్లలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దవచ్చు
జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ ప్రభుత్వ గ్రాంట్లతోపాటు, పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో ఐదేళ్లలో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దవచ్చన్నారు. ఈ ప్రాజెక్టును అధికారులు, గ్రామస్తులు సమన్వయంతో కృషి చేసి విజయవంతం చేయాలన్నారు. గ్రామంలో సమస్యలన్నింటిని పరిష్కరించి, అభివృద్ధి పనులు చేపట్టా లంటే రూ.2కోట్ల 51లక్షల 25వేల నిధులు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. వివిధ శాఖల ద్వారా రూ. ఒక కోటి 51 లక్షల 55వేలు నిధులు వస్తాయన్నారు. రూ.32.75లక్షలు ప్రభుత్వం నుంచి వస్తాయన్నారు. ఇంకా రూ.24.95లక్షలు గ్రామ పంచాయతీయే సమకూర్చుకోవాలన్నారు. సుమారు రెండున్నర కోట్ల నిధులతో విడత లవారీగా అభివృద్ధి పనులు చేపట్టడానికి ఐదేళ్ల ప్రణాళికను తయారు చేశారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పది శాతం నిధులు సమకూర్చడానికి తమకు అభ్యంతరం లేదని గ్రామస్థులు అధికారులకు విన్నవించారు. సర్పంచ్ గాండ్ల భూమిక అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఉపసర్పంచ్ గాండ్ల శేఖర్, జడ్‌పీ సీఈఓ రాజారాం, డీపీఓ సురేష్‌బాబు, ఎంపీడీఓ పీవీ శ్రీనివాస్, తహశీల్దార్ అనిల్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రెండున్నర కోట్లతో అభివృద్ధి
Published Thu, Nov 7 2013 4:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
Advertisement