development scheme
-
నీలి విప్లవం
నల్లగొండ టూటౌన్: చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుంబిగించాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో ఉచితంగా చేపలు పోయగా కేంద్రప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా ప్రైవేట్ భూముల్లో చెరువుల తవ్వకానికి సబ్సిడీ అవకాశం కల్పిస్తూ మత్స్య పరిశ్రమ సమీకృత అభివృద్ధి పథకం (నీలి విప్లవం) ప్రవేశ పెట్టింది. దీనిని పకడ్బందీగా అమలు చేసి అర్హులైన వారికి ఈ పథకం వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. నీరు ఉన్న చోటనే చెరువుల నిర్మాణం.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నీలి విప్లవం పథకంలో చేపల చెరువుల నిర్మాణాలకు సమృద్ధిగా నీటి వసతి ఉండాల్సి ఉంటుంది. కేవలం బోరు, బావుల మీదే ఆధార పడకుండా ప్రవహించే వనరులు కలిగి ఉండాలి. రైతులు నిర్మించే చెరువుకు సమీపంలో ఏదైనా నది, పారే కాల్వ, వాగులు, ఏఎమ్మార్పీ కెనాల్,మూసీ లాంటి నదులు ఉండి నీటి వసతి పుషల్కంగా ఉండే ప్రాంతాల రైతులకే దీనిని వర్తింప జేస్తారు. చేపల చెరువు నిర్మాణాల్లో 50 శాతం ప్రభుత్వం ఇవ్వనుండగా రైతు 50 శాతం భరించాల్సి ఉంది. ఒక్కో లబ్థిదారుడికి రెండున్నర హెక్టార్లకు (5ఎకరాలు) మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. వీటికి సబ్సిడీ .. చేపల చెరువులు, ఉత్పాదకాలు, చేప పిల్లల హేచరీల నిర్మాణం, చేప పిల్లల పెంపక, చెరువుల నిర్మాణం, కేజ్ (పంజరాలు) లలో చేపల పెంపకం, మినీ దాణా ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు తదితర వాటికి సబ్సిడీ ఇవ్వనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపల పిల్లలను ఉచితంగా మత్స్యకారులకు సరఫరా చేయడానికి రాష్ట్రంలో ఎక్కడా లేకపోవడంతో ఆంధ్రాప్రాంతం నుంచి చేప పిల్లల విత్తనాలను తెప్పించింది. ఇక్కడ చేప పిల్లల పెంపకం చేపట్టే విధంగా ప్రభుత్వం సబ్సిడీ అవకాశం కల్పిం చింది. ఇక్కడే చేప పిల్లల విత్తనాలు లభించడం, ఉత్పత్తిని ప్రోత్సహిం చ డం ద్వారా లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశం లభించనుంది. కలెక్టర్ నేతృత్వంలో లబ్ధిదారుల ఎంపిక.. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకునే రైతులు జిల్లా స్థాయి కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. ఏ రైతు అయినా చేపల పెంపకానికి చెరువులు నిర్మాణాలు చేపట్టవచ్చు. భూమి పై పూర్తి హక్కు ఉండడంతో పాటు స్వదేశీ చేపలను మాత్రమే పెంచాల్సి ఉంటుంది. భూమి సారవంతమైనది కాకూడదు. ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా మత్స్యశాఖ అధికారి కన్వీనర్‌గా , జేడీఏ, ఐబీ అధికారులు సభ్యులుగా ఉన్న కమిటీ అన్ని దరఖాస్తులను పరిశీలించి అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తుంది. చెరువుల నిర్మాణాల వివరాలు పథకం పేరు యూనిట్ సబ్సిడీ లబ్ధిదారుడి విలువ వాటా చేపల చెరువుల నిర్మాణం 7.00 3.50 3.50 ఉత్పాదకాలు 1.50 0.75 0.75 చేపల హేచరీల నిర్మాణం 25.00 12.50 12.50 చేపల పిల్లల పెంపక 6.00 3.00 3.00 చెరువుల నిర్మాణం కేజ్‌లలో చేపల పెంపకం 25.00 20.00 5.00 మినీ దాణా ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు 10.00 5.00 5.00 -
18వేల కోట్లు.. అయిదేళ్లు!
ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఈనెల 20లోగా ప్రతిపాదనలు పంపండి రానున్న పదేళ్లను దృష్టిలో పెట్టుకుని నివేదికలు సిద్ధం చేయండి ఈఈలు, డీఈఈలు, ఏఈల సమీక్షలో పీఆర్ చీఫ్ ఇంజనీర్ రామ్మూర్తి చిత్తూరు (టౌన్): ప్రత్యేక అభివృద్ధి పథకం కింద జిల్లాకు కేంద్ర ప్రభుత్వం రూ.18 వేల కోట్లను రానున్న అయిదేళ్లపాటు విడుదల చేయనుందని పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ సీవీ.రామ్మూర్తి అన్నారు. ఈ ప్యాకేజీ అమలు, తీరుతెన్నులపై ఆయన, జిల్లా పరిషత్ సమావేశమందిరంలో బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్రం ప్రత్యేక అభివృద్ధి పథకం ద్వారా రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు కోస్తాలోని 40 మండలాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. జిల్లాలోని గ్రావెల్ రోడ్లు, బీటీ రోడ్ల అభివృద్ధి కోసం ఈ ప్యాకేజీ కింద ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. రానున్న పదేళ్లలో రోడ్ల వెడల్పు, పొడవును పెంచడం, కల్వర్టులు, బ్రిడ్జిల ఆధునికీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పల్లెల్లో రోడ్లు, కాలువలు, వీధుల్లో సిమెంటురోడ్లు, ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణాలను చేపట్టాలన్నారు. అసంపూర్తిగా వున్న భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. లింకు రోడ్లకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. జనావాసాలకు ఉపయోగపడే పనులకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ‘సీమ’లో చిత్తూరు జిల్లాలోనే ఎక్కువ పనులు చేపట్టాలన్నారు. సిద్ధం చేసిన ప్రతిపాదనలను ఈనెల 20లోగా తమకు పంపాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత పెంచండి జిల్లాలో చేపట్టే పనుల్లో నాణ్యత పెంచాలని అధికారులకు చీఫ్ ఇంజనీర్ సీవీ.రామ్మూర్తి సూచించారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల నాణ్యతపై అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఇకపై చేసే పనుల్లో నాణ్యత ప్రమాణాలు పెంచాలన్నారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో తమ పరిధికి చెందిన రోడ్లకు నిర్మించిన కల్వర్టుల తూములను శుభ్రం చేయించకపోతే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రోడ్లు దెబ్బతినే పరిస్థితి ఉంటుందన్నారు. బీటీ రోడ్ల నిర్మాణంలో హైషోల్డర్ పద్ధతి పాటించడం వల్ల రోడ్లు పాడవుతాయన్నారు. మధ్యలో పల్లం ఉండడంతో వర్షం నీరంతా అక్కడే ప్రవహించడంతో అవి తొందరగా పాడైపోతున్నాయన్నారు. దీనిపై జాగ్రత్త పడాలన్నారు. జిల్లాలో 70వేల కిలోమీటర్ల పొడవున్న రోడ్లుంటే, 50 వేల కిలోమీటర్లరోడ్ల నిర్వహణకే నిధులు మంజూరవుతున్నాయన్నారు. తక్కిన రోడ్ల నిర్వహణను పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. పనుల పర్యవేక్షణకు సైట్ ఇంజనీర్‌ను సంబంధిత కాంట్రాక్టరే నియమించుకోవాలన్నారు. ఒకవేళ కాంట్రాక్టరు ఏర్పాటు చేసుకోకపోతే మీరే ఏర్పాటు చేసి అతని జీతాన్ని పనికి చెల్లించే బిల్లులో కట్ చేయాలన్నారు. పనుల అంచనాల్లోనే క్వాలిటీ కంట్రోల్‌కు ప్రొవిజన్ కల్పించాలని కోరారు. సమీక్షలో పంచాయతీరాజ్ ఈఈలు, డీఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. మరిన్ని నిధులు మంజూరు చేయండి జిల్లాలో రోడ్ల అభివృద్ధి కోసం మరిన్ని నిధులు మం జూరు చేయాలని జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నం దున ఆ రాష్ట్రాలతో సమానంగా ఇక్కడ కూడా రోడ్లను అభివృద్ధి చేయాలని సూచించారు. జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించాలని సీఈని కోరారు. అలాగే కేంద్రం నుంచి పీఎంజీఎస్‌వై, నాబార్డు పథకాల ద్వారా అదనపు నిధులకు ప్రతిపాదనలు పంపాలని కోరారు. సెప్టెంబర్ 1 తర్వాత మంజూరైన పనులను ఆపేయండి 2013 సెప్టెంబర్ ఒకటి తర్వాత మంజూరైన పనులన్నింటినీ ఆపేయాలని పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ రామ్మూర్తి ఆ శాఖ ఈఈలు, డీఈఈలను ఆదేశించారు. నిధుల కొరత కారణంగా సెప్టెంబర్ నుంచి చేపట్టిన పనులను నిలిపేయాలని ప్రభుత్వం కోరినట్టు తెలిపారు. అయితే దానికి ముందు చేపట్టిన అన్ని పనులను పూర్తిచేయించి వాటికి సంబంధించిన బిల్లులను డీఏవో కార్యాలయాలకు పంపాలని ఆదేశించారు. ప్రభుత్వం నిధులను విడుదల చేస్తే వాటికి బిల్లులిస్తారు, లేదా పెండింగ్ పెట్టుకుంటారు, దాంతో మనకు పనిలేదన్నారు. అయితే మనపై నెపం లేకుండా మనపని మనం చేసుకుపోదామని కోరారు. గత ఏడాది పంచాయతీరాజ్‌కు రూ.125 కోట్లిచ్చి ఇంచుమించు రూ.900 కోట్ల పనులకు ప్రభుత్వం అనుమతిస్తే వాటిని ఎలా పూర్తి చేయాలో మీరే ఆలోచించండి అని అన్నారు. మన పరిధిలోని రోడ్ల నిర్వహణకు ఒక ఏడాదికి రూ.1,500 కోట్లు అవసరం కాగా కేవలం ఆరేడు వందల కోట్ల బడ్జెట్ మాత్రమే విడుదల చేస్తుండడంతో నిర్వహణ సాధ్యం కావడం లేదన్నారు. ఈ ఏడాదికి రూ.268 కోట్ల బడ్జెట్ అవసరమని ప్రతిపాదనలు పంపగా రూ.64 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని, ఇది చాలదని అడిగితే ఇతర శాఖలకు కేటాయించిన బడ్జెట్ ఖర్చు కాకపోతే దాన్ని మళ్లిస్తామని చెబుతోందని పేర్కొన్నారు. విశాఖ జిల్లా పాడేరు ప్రాజెక్టు పనిలో డీఈఈలు అవసరం ఉన్నందున ఇక్కడున్న వారెవరైనా పనిచేసేందుకు ముందుకొస్తే అక్కడకు పంపుతామన్నారు. ఆరు నెలలు మాత్రమే అక్కడ పనిచేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత యథాస్థానానికి వచ్చేయవచ్చని ఆయన తెలిపారు. -
పంచాయతీలను తీర్చిదిద్దాలి: నాగిరెడ్డి
ఇందూరు, న్యూస్‌లైన్: నిర్దిష్ట ప్రణాళికతో గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దాలని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించి, సమస్య అనేదే లేకుండా పద్ధతి ప్రకారం నిధులు ఖర్చు చేయాలన్నారు. బుధవారం నిజామాబాద్‌లో ‘మెరుగైన స దుపాయాల కల్పన దిశలో గ్రామ పంచాయతీలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, నల్లగొండ జిల్లాల డీపీఓలు, జడ్పీ సీఈఓలు, డీఎల్పీఓలు, ఈఓపీఆర్డీ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో నిర్దిష్ట ప్రణాళికలు లేకపోవడంతో సమస్యలను పరిష్కరించడం, సౌకర్యాలను కల్పించడం సాధ్యం కావడం లేదన్నారు. నిధులు ఎన్ని అవసరం అవుతున్నాయో కూడా తెలియడం లేదన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కావాలి? వాటికి ఎన్ని నిధులు ఖర్చవుతాయి? తెలిపే విధంగా సర్పంచుల సహాయంతో వార్షిక, పంచవర్ష ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను అదేశించారు. ఈ ప్రణాళికల ఆధారంగా పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. నిర్ణీత కాల వ్యవధిలో ప్రజలకు సౌకర్యాలు సమకూరుతాయన్నారు. 50 రకాల విధులు, అధికారాలు పం చాయతీలకు ఉన్నాయని, వాటిని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నా రు. ప్రతి పంచాయతీ పరిధిలో వ్యాపారాలు జరుగుతున్నా, ప్రకటనలు ఇస్తున్నా, వాటికి పన్నులు వసూలు చేయడం లేదని, ఇక పై అన్ని పన్నులు పక్కాగా వసూలు చేయించాల ని సూచించారు. విద్య, ఆరోగ్యం, ఇతర పనులన్నీ గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉంటాయని, చేసే ప్రతి పనికి తీర్మానం తప్పని సరిగా ఉండాలన్నారు. మున్సిపల్ శాఖలాగే, పంచాయతీరాజ్ శాఖ పని చేస్తుందన్నారు. పౌర సేవలు మెరుగుపడతాయి గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయడం ద్వారా పౌర సేవలు మెరుగు పడతాయని పంచాయతీరాజ్ కమిషనర్ వరప్రసాద్ అన్నారు. పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, రహదారులు, మురుగు కాలువలు, ఇతర సౌకర్యాలు కల్పించడంతో పాటు, వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోవడానికి ప్రతి జిల్లాలో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.ఇందుకు ఒక మండలాన్ని పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, మండలంలోని పలు గ్రామాలను గుర్తించి సందర్శిస్తున్నామని తెలి పారు. నిజామాబాద్ జిల్లాలో జక్రాన్‌పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామాన్ని ఎంపిక చేశామన్నారు. గ్రామంలోని ప్రజలకు ఎలాం టి సౌకర్యాలు కావాలో అడిగి తెలుసుకుంటామని, అలాగే ఆదాయ వనరులను సమకూర్చుకోవడం ఎలాగో కూడా తెలియజేస్తామన్నారు. 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్, బీఆర్జీఎఫ్ ద్వారా పంచాయతీలకు మం జూరవుతున్న నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. గుర్తించిన పనులకు అయ్యే ఖర్చుకు ప్రతి పైసా లెక్క ఉంటుందన్నారు. పంచాయ తీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి క్లస్టర్‌కు, పంచాయతీకి కార్యదర్శి ఉం టాడని తెలిపారు. కొందరికి పదోన్నతులు కూడా ఇవ్వనున్నామని వెల్లడించారు. సదస్సులో నిజామాబాద్ కలెక్టర్ ప్రద్యుమ్న తది తరులు పాల్గొన్నారు. -
రెండున్నర కోట్లతో అభివృద్ధి
జక్రాన్‌పల్లి, న్యూస్‌లైన్: ప్రభుత్వ నిధులు, గ్రామ పంచాయతీ భాగస్వామ్యంలో రూ. రెండున్నర కోట్ల రూపాయల నిధులతో జక్రాన్‌పల్లి మండలంలోని బ్రా హ్మణ్పల్లి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చే స్తామని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యద ర్శి నాగిరెడ్డి తెలిపారు. పెలైట్ ప్రాజెక్టుగా ఎంపికైన ఈ గ్రామాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రా మసభలో ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ముందుగా ఐదేళ్ల ప్ర ణాళిక తయారు చేసుకోవాలన్నారు. 22 రకాల ఆదాయ వనరులను సమకూర్చుకోవచ్చన్నా రు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలన్నా రు. పంచాయతీరాజ్ కమిషనర్ డి వరప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అమలు చేస్తామన్నారు. గ్రామానికి అవసరాలు ఏమిటి, నిధు లు ఎలా సమకూర్చుకోవాలి, ప్రభుత్వ నిధు లు, వివిధ శాఖల ద్వారా ఏ మేరకు నిధుల వ స్తాయి, పన్నుల ద్వారా ఎంత ఆదాయం ఉం టుంది? అనే అంశాలను అధ్యయనం చేశారు. రూపేణ ఎన్ని నిధుల వస్తాయి అనే అంశాలపై అధికారులు అధ్యయనం చేశారు. ఐదేళ్లలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దవచ్చు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ ప్రభుత్వ గ్రాంట్లతోపాటు, పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో ఐదేళ్లలో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దవచ్చన్నారు. ఈ ప్రాజెక్టును అధికారులు, గ్రామస్తులు సమన్వయంతో కృషి చేసి విజయవంతం చేయాలన్నారు. గ్రామంలో సమస్యలన్నింటిని పరిష్కరించి, అభివృద్ధి పనులు చేపట్టా లంటే రూ.2కోట్ల 51లక్షల 25వేల నిధులు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. వివిధ శాఖల ద్వారా రూ. ఒక కోటి 51 లక్షల 55వేలు నిధులు వస్తాయన్నారు. రూ.32.75లక్షలు ప్రభుత్వం నుంచి వస్తాయన్నారు. ఇంకా రూ.24.95లక్షలు గ్రామ పంచాయతీయే సమకూర్చుకోవాలన్నారు. సుమారు రెండున్నర కోట్ల నిధులతో విడత లవారీగా అభివృద్ధి పనులు చేపట్టడానికి ఐదేళ్ల ప్రణాళికను తయారు చేశారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పది శాతం నిధులు సమకూర్చడానికి తమకు అభ్యంతరం లేదని గ్రామస్థులు అధికారులకు విన్నవించారు. సర్పంచ్ గాండ్ల భూమిక అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఉపసర్పంచ్ గాండ్ల శేఖర్, జడ్పీ సీఈఓ రాజారాం, డీపీఓ సురేష్‌బాబు, ఎంపీడీఓ పీవీ శ్రీనివాస్, తహశీల్దార్ అనిల్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.