ఇందూరు, న్యూస్‌లైన్: నిర్దిష్ట ప్రణాళికతో గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దాలని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించి, సమస్య అనేదే లేకుండా పద్ధతి ప్రకారం నిధులు ఖర్చు చేయాలన్నారు. బుధవారం నిజామాబాద్‌లో ‘మెరుగైన స దుపాయాల కల్పన దిశలో గ్రామ పంచాయతీలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, నల్లగొండ జిల్లాల డీపీఓలు, జడ్‌పీ సీఈఓలు, డీఎల్‌పీఓలు, ఈఓపీఆర్‌డీ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో నిర్దిష్ట ప్రణాళికలు లేకపోవడంతో సమస్యలను పరిష్కరించడం, సౌకర్యాలను కల్పించడం సాధ్యం కావడం లేదన్నారు. నిధులు ఎన్ని అవసరం అవుతున్నాయో కూడా తెలియడం లేదన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కావాలి? వాటికి ఎన్ని నిధులు ఖర్చవుతాయి? తెలిపే విధంగా సర్పంచుల సహాయంతో వార్షిక, పంచవర్ష ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను అదేశించారు. ఈ ప్రణాళికల ఆధారంగా పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు.
నిర్ణీత కాల వ్యవధిలో ప్రజలకు సౌకర్యాలు సమకూరుతాయన్నారు. 50 రకాల విధులు, అధికారాలు పం చాయతీలకు ఉన్నాయని, వాటిని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నా రు. ప్రతి పంచాయతీ పరిధిలో వ్యాపారాలు జరుగుతున్నా, ప్రకటనలు ఇస్తున్నా, వాటికి పన్నులు వసూలు చేయడం లేదని, ఇక పై అన్ని పన్నులు పక్కాగా వసూలు చేయించాల ని సూచించారు. విద్య, ఆరోగ్యం, ఇతర పనులన్నీ గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉంటాయని, చేసే ప్రతి పనికి తీర్మానం తప్పని సరిగా ఉండాలన్నారు. మున్సిపల్ శాఖలాగే, పంచాయతీరాజ్ శాఖ పని చేస్తుందన్నారు.
పౌర సేవలు మెరుగుపడతాయి
గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయడం ద్వారా పౌర సేవలు మెరుగు పడతాయని పంచాయతీరాజ్ కమిషనర్ వరప్రసాద్ అన్నారు. పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, రహదారులు, మురుగు కాలువలు, ఇతర సౌకర్యాలు కల్పించడంతో పాటు, వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోవడానికి ప్రతి జిల్లాలో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.ఇందుకు ఒక మండలాన్ని పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, మండలంలోని పలు గ్రామాలను గుర్తించి సందర్శిస్తున్నామని తెలి పారు.
నిజామాబాద్ జిల్లాలో జక్రాన్‌పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామాన్ని ఎంపిక చేశామన్నారు. గ్రామంలోని ప్రజలకు ఎలాం టి సౌకర్యాలు కావాలో అడిగి తెలుసుకుంటామని, అలాగే ఆదాయ వనరులను సమకూర్చుకోవడం ఎలాగో కూడా తెలియజేస్తామన్నారు. 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్, బీఆర్‌జీఎఫ్ ద్వారా పంచాయతీలకు మం జూరవుతున్న నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. గుర్తించిన పనులకు అయ్యే ఖర్చుకు ప్రతి పైసా లెక్క ఉంటుందన్నారు. పంచాయ తీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి క్లస్టర్‌కు, పంచాయతీకి కార్యదర్శి ఉం టాడని తెలిపారు. కొందరికి పదోన్నతులు కూడా ఇవ్వనున్నామని వెల్లడించారు. సదస్సులో నిజామాబాద్ కలెక్టర్ ప్రద్యుమ్న తది తరులు పాల్గొన్నారు.