ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
నిర్మల్‌టౌన్ : గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో షెడ్యూల్ ప్రకారం నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కాంగ్రెస్ జిల్లా నాయకుడు వినాయక్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట మంగళవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడారు. తండాలను పంచాయతీలుగా చేసి, కొత్త పంచాయతీలకు రూ.50లక్షల ప్రత్యేక నిధులివ్వాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లుగా పంచాయతీలకు నిధులు, విధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. మన ఊరు–మన ప్రణాళిక, గ్రామజ్యోతి లాంటి పథకాలు ఆర్భాటంగా ప్రకటించినా వాటికి ఒక్క పైసా కూడా కేటాయించలేదన్నారు. నాయకులు సత్యం చంద్రకాంత్, అయిర నారాయణరెడ్డి, హైదర్, సంతోష్, పద్మాకర్, కూన శివకుమార్, జుట్టు దినేశ్, అజర్, జమాల్, నిర్మల, పోశెట్టి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment