మెదక్ టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా విద్యాధికారి నిర్లక్ష్యంతో తమ పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు డిగ్రీ కళాశాల విద్యార్థినిలు సంఘీభావం తెలిపారు. ఈ సం దర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ మెదక్ మండల విద్యాశాఖ కార్యాలయంలో నవోదయ ఎంట్రెన్స్ పరీక్ష నిమిత్తం సుమారు 400 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 74 దరఖాస్తులు ఎంఈఓ కార్యాలయంలోనే మూలన పడేశారని ఆరోపించారు. గడువు ముగిసిన నెల రోజుల తరువాత దరఖాస్తులు వర్గల్ నవోదయ విద్యాలయానికి పంపడం తో తమ పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు.
మెదక్ ఎంఈఓ కార్యాలయంలో నిర్ణీత గడువులోనే అందజేసినప్పటికీ.. అప్పట్లో ఇన్‌చార్జ్ ఎంఈఓ సాయిబాబా అనారోగ్య పరిస్థితి వల్ల సెలవులో ఉన్నారన్నారు. దీంతో గడువు ముగిసే వరకు కూడా మెదక్ ఎంఈఓ కార్యాలయంలోనే దరఖాస్తులు పడేశారని ఆరోపించారు. కానీ ఉపాధ్యాయుల జీతాలు, మధ్యా హ్న భోజన బిల్లులు ఎలా వచ్చాయంటూ వారు ప్రశ్నించారు. ఈ విషయమై డీఈఓ రమేష్‌కు ఫోన్‌లో తమ గోడును విన్నవించు కోగా తాను షటిల్ ఆడుతున్నానంటూ ఫోన్ పెట్టేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిం చారు. అనారోగ్య కారణంగా ఎంఈఓ సాయిబాబా సెలవు పెట్టిన వెంటనే మరొకరికి బాధ్యతలు అప్పగిస్తే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదన్నారు. ఇందుకు ప్రధాన కారకుడు డీఈఓనేనని వారు ఆరోపించారు.
తమ పిల్లల భవిష్యత్‌తో ఆడుకున్న డీఈఓను వెంటనే సస్పెండ్ చే యాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓకు వి నతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు శ్రీనివాస్‌గౌడ్, యాదగిరి, నాగరాజు, బంగారయ్య, సిద్దిరాంలు, అప్పారావు, కిష్టయ్య, శ్రీధర్, నర్సింలు, మల్లేశం, పోచయ్య, రాంచందర్, రమేష్, కొండల్‌రెడ్డి, భూపాల్, లక్ష్మణ్‌గౌడ్, ైశె లేంద్ర, విద్యార్థి నాయకుడు దత్తు ఉన్నారు.
మా పిల్లల భవిష్యత్తు బలిచేస్తారా?
Published Thu, Jan 9 2014 11:52 PM | Last Updated on Fri, Sep 28 2018 4:43 PM
Advertisement
Advertisement