![Degree Students Concern Over The Negligence Of SV University Officials - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/16/students.jpg.webp?itok=cB1ikehM)
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా పీలేరులో అధికారుల నిర్లక్ష్యంతో డిగ్రీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాల్ టికెట్ల జారీ విషయంలో సాంకేతిక సమస్యలు రావడంతో తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షల్లో గందరగోళం తలెత్తింది. హాల్ టికెట్లలో పరీక్షా కేంద్రాల చిరునామాలు తప్పుగా ముద్రించటం వల్ల తాము సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతో ఈ నెల 14, 15 వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. శనివారం నుంచి యధావిథిగా పరీక్షలు జరగాల్సి ఉండగా, ఇప్పుడు కూడా పరీక్ష కేంద్రాల చిరునామాలు తప్పుగా ముద్రించడంతో 399 మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ జీవితాలతో ఆటలాడుకుంటున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment