వాషింగ్టన్: యుగాలుగా అన్ని పరమత సహనం పాటిస్తూ వచ్చిన భారతదేశంలో మతస్వేచ్ఛ విషయంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నట్లు అమెరికా దౌత్యవేత్త సామ్యూల్ బ్రౌన్‌బాక్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మతస్వేచ్ఛకు సంబంధించిన ఉల్లంఘనలను రికార్డు చేసి తయారు చేసిన ‘2019 అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదిక’ను అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మైక్ పాంపియో బుధవారం విడుదల చేశారు. (అలసిపోయాం.. ఇక ఆపండి: జార్జ్ సోదరుడి ఆవేదన)
ఆ తరువాత కొన్ని గంటల వ్యవధిలోనే ‘ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్’ సంస్థకు అంబాసిడర్ అట్‌లార్జ్‌గా వ్యవహరిస్తున్న సామ్యూల్ బ్రౌన్‌బాక్ కొంతమంది విదేశీ విలేకరులతో ఫోన్‌లో మాట్లాడుతూ భారత్‌పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘భారత్‌లో పరిణామాలు జీర్ణించుకోవడానికి కష్టంగా ఉన్నాయి. మేము ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులను చక్కదిద్దడానికి ఉన్నత స్థాయిలో భారత్ అంతర్గత చర్చలు ప్రారంభించాలి. మత స్వేచ్ఛపై భారత్ ప్రధానంగా దృష్టి సారించకపోతే హింస మరింతగా పెరిగి విపరిణామాలకు దారితీస్తుంద’ని సామ్యూల్ బ్రౌన్‌బాక్ అన్నారు. గతంలోనూ అమెరికా ఇదే తరహా ఆరోపణ చేయగా భారత్ దాన్ని తిరస్కరించింది. (అమెరికా ఆత్మను తట్టిలేపిన జార్జ్)
Comments
Please login to add a commentAdd a comment