విభజన హామీలు అమలు చేయాలంటూ రాజ్యసభలో బుధవారం ఉదయం జీరో అవర్ నడుస్తున్న సమయంలో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు.
న్యూఢిల్లీ: విభజన హామీలు అమలు చేయాలంటూ రాజ్యసభలో బుధవారం ఉదయం జీరో అవర్ నడుస్తున్న సమయంలో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు. ఏపీకి చెందిన జేడీ శీలం, కేవీపీ రామచంద్రరావు, తెలంగాణ సభ్యులు వి.హనుమంతరావు, ఎం.ఎ.ఖాన్ తమ స్థానాల నుంచి లేచి నినాదాలు చేశారు. ఈ అంశాలపై చర్చించేందుకు నోటీసులు ఇచ్చానని, చర్చకు అవకాశం ఇవ్వాలని జేడీ శీలం పట్టుబట్టారు.