అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన
విజయనగరం క్రైం : గృహ నిర్మాణ శాఖలో అవుట్ సోర్సింగ్ పద్ధతిపై పని చేస్తున్న ఉద్యోగులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఆ ఉద్యోగులు గురువారం ధర్నా చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వారు నినాదాలు చేశారు. చంద్రబాబు వస్తే ఇంటికొక ఉద్యోగమని చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ఉద్యోగులను తొలగిస్తోందని ప్రభుత్వ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు జి.అప్పలసూరి విమర్శించారు. గృహ నిర్మాణ సంస్థలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్‌లను కొనసాగించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
దర్నానుద్దేశించి మాట్లాడిన ఆయన బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో విస్తృత ప్రచారం చేసి నేడు ఉన్న ఉద్యోగులను తొలగించడం సరికాదని విమర్శించారు. ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని ఆశించిన వారికి నిరాశే మిగిలిందన్నారు. 146 జీఓ ప్రకారం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను డిసెంబరు నెలాఖరు వరకు కొనసాగింపు ఉత్తర్వులు విడుదల చేసి ఒక్క గృహ నిర్మాణ శాఖలోనే ఉద్యోగులను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. గృహ నిర్మాణ సంస్థలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించాలని ఈ నెల 20 నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తామన్నారు.
జిల్లా గృహ నిర్మాణ సంస్థ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు పి.సురేష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో అవుట్ సోర్సింగ్ విభాగంలో 2007 నుంచి ఐటీ మేనేజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, వర్కు ఇన్ స్పెక్టర్లు, అకౌంట్స్ అసిస్టెంట్లు, అటెం డర్లు పని చేస్తున్నారని చెప్పారు. గత ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని చెప్పి ఇప్పుడు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇతర శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్‌ఉద్యోగుల వలె కొనసాగిం పు ఉత్వర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఆ సంఘం అసోసియేట్ అధ్యక్షుడు వై.శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.విష్ణువర్ధన్, కోశాధికారి జి. రాంబాబు, పి.శ్రీహరినాయుడు, జారుుంట్ సెక్రటరీలు ఎస్.రాధాకృష్ణ, ఎస్.వెంకటలక్ష్మి పాల్గొన్నారు.