విజయనగరం క్రైం: జిల్లా గృహనిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఊరట లభించింది. ఆరు నెలలుగా వీరి కొనసాగింపు విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. ఉద్యోగం ఉంటుందో? ఊడుతుందో తెలియక ఆ ఉద్యోగులు ప్రతిరోజూ బితుకుబితుకు మంటూ విధులు నిర్వహించారు. అయితే వీరిని జియోట్యాగ్ రూపంలో అదృష్టం వరించింది. గృహ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు జూన్ నెలలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు జూలై నెలాఖరువరకు జీతం లేకుండా విధులునిర్వహించారు.
అనంతరం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలు చేపట్టడంతో ప్రభుత్వం పునరాలోచించి వారిని కొనసాగించింది. ఈలోగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన గృహాలపై సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వీరి సేవలు అవసరమయ్యాయి. మళ్లీ మండలానికి ఇద్దరుచొప్పున వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఉండాలని నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ వర్క్ ఇన్‌స్పెక్టర్లు 17మంది మాత్రమే ఉండగా మిగతా 51మందిని అవుట్ సోర్సింగ్ ఇన్‌స్పెక్టర్లను విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది. జిల్లావ్యాప్తంగా 89మంది ఔట్‌సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఉండగా వారిలో ఎటువంటి రిమార్కులు లేనివారిని, సీనియార్టీ ఉన్నవారిని తీసుకోవాలని మిగతా 2వపేజీలో ఠ
ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
రాజకీయ ఒత్తిళ్లు..
సిన్సియార్టీ, సీనియార్టీ ప్రకారం కొంతమందిఉద్యోగులను విధుల్లోకితీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో రాజకీయ నాయకుల ఒత్తిళ్లుఅధికారులపై వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యేలు,ముఖ్యనాయకులవద్దకు వెళ్లి ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి కొంతమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు డబ్బులు సమర్పించుకున్నట్లు ప్రచారం జరిగింది.
జియోట్యాగ్ అంటే..
ఇందిరమ్మపథకంలో నిర్మాణం జరిగిన ఇళ్లకు ఫొటోలను తీయాలి. గతంలో ఇంటి ఫొటోను మాత్రమే తీశారు. అలాకాకుండా నిర్మాణం జరిగినప్రతి ఇంటితోపాటు ఎవరిపేరున మంజూరైతే వారి ఫొటోను చిత్రీకరించాలి. జిల్లావ్యాప్తంగా జియో ట్యాగ్ చేయడానికి 87టీంలను నియమించారు. టీంకు ఇద్దరుచొప్పున ఉంటారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 20,000ఇళ్లకు జియో ట్యాగ్ చేస్తారు.నిర్మా ణంలో ఉన్నవి పూర్తయినతర్వాత గతంలో నిర్మాణమైనవాటికి జియోట్యాగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఐదుగురు తప్ప..
‘జిల్లాలో జియోట్యాగ్ విధానం డిసెంబర్ 8నుంచి అమలుచేస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆరోపణలు, కేసులు ఉన్న ఐదుగురిని విధుల్లోంచి తొలగిస్తాం. మిగతావారిని కొనసాగిస్తాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధ్యతను మెగ్మా ఏజెన్సీకి ప్రభుత్వం అప్పగించింది’.
సీహెచ్‌యుకె.కుమార్, జిల్లా గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్