![We will regularize the contract employees says Komati Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/6/komati%20redddy.jpg.webp?itok=3D4u9d_I)
నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం నల్ల గొండ పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభు త్వం వస్తే ఇక కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉండరని, అందరూ ప్రభుత్వ ఉద్యోగులే అవుతారని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు.
ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉద్యోగ అర్హత పరీక్షలు నిర్వహించడంలో విఫలం కావడం వల్ల అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారని, నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొ న్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులన్నీ నాణ్యతలేక కూలిపోతున్నాయని, వాటి మీద విచారణ జరిపించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంద ని కోమటిరెడ్డి ఆరోపించారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద విచారణ జరిపిస్తామని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు మిత్రపక్షాలు అయినందునే విచారణ చేపట్టడంలేదని ఆరోపించారు. రూ.9 లక్షల కోట్ల అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే, దానిలో భాగమైన మేడిగడ్డ బ్యారేజి కుంగిపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment