సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యేవాడా? అని అన్నారు. ఇదే సమయంలో ఒకవేళ భవిష్యత్‌లో కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా.. మేము విలువ ఇవ్వమంటూ ఘాటు విమర్శలు చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్‌లో భట్టి, మంత్రి కోమటిరెడ్డి మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా భట్టి మాట్లాడుతూ.. బ్రమ్మనవెల్లి ప్రాజెక్టు వల్ల వచ్చే ఐదేళ్లలో నల్గొండ జిల్లా స్వరూపం మారబోతుంది. నల్గొండ జిల్లాలో కూడా గోదావరి తరహాలో నీళ్లు పారబోతున్నాయి. భూమి ధరలు భారీగా పెరగబోతున్నాయి. నాకు, తలా ఒక ఎకరం ఇవ్వాలని కోమటిరెడ్డిని అడుగుతున్నా. రాష్ట్రంలో డైట్ చార్జీలు పెంచడం వల్ల మంచి జరిగింది . ఈ నెల 15, 16వ తేదీల్లో అన్ని హాస్టల్స్‌లో జిల్లా కలెక్టర్లు లంచ్ కార్యక్రమం ఉంటుంది. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యార్థుల డైట్ చార్జీలు పెంచలేదు. రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టి విద్యార్థులకు అందిస్తే చరిత్రలో నిల్చిపోతామన్నారు.
అనంతరం, మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. భట్టి విక్రమార్క జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు ఏం అడిగినా ఒకే అంటున్నారు. సచివాలయానికి పని కోసం వస్తే పైసలు లేవు అంటున్నారు. వైఎస్సార్ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ ఉండేది.. మళ్ళీ ఇప్పుడు భట్టి దగ్గర కనిపిస్తోందన్నారు.
అనంతరం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ లేకుండా కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యేవాడా?. కేటీఆర్ మాకు పోలిక ఏంటి?. కేటీఆర్ భవిషత్‌లో ఒకవేళ ముఖ్యమంత్రి అయినా మేము ఆయనకు విలువ ఇవ్వం అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment