‘హెచ్‌–1బీ’ ప్రతిపాదన సరికాదు: యూఎస్‌సీసీ | Proposed tweak in H-1B visa rules may deport thousands of Indian workers | Sakshi
Sakshi News home page

‘హెచ్‌–1బీ’ ప్రతిపాదన సరికాదు: యూఎస్‌సీసీ

Published Sun, Jan 7 2018 4:03 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

Proposed tweak in H-1B visa rules may deport thousands of Indian workers - Sakshi

వాషింగ్టన్‌: హెచ్‌–1బీ వీసాల గడువును పొడిగించకూడదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతిపాదిస్తుండటం సరైనది కాదని యూఎస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (యూఎస్‌సీసీ) శనివారం పేర్కొంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రతిభాధారిత వలస వ్యవస్థ లక్ష్యాన్ని నీరుగారుస్తుందని యూఎస్‌సీసీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఎన్నో ఏళ్లుగా అమెరికాలో పనిచేస్తూ, ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలనుకునే ప్రతిభావంతులకు తమ దేశంలో స్థానం లేదనడం ఏ మాత్రం సరైనది కాదు’ అని యూఎస్‌సీసీ అధికార ప్రతినిధి అన్నారు. హెచ్‌–1బీ వీసాల గడువు పొడిగించకుండా, ఆ వీసాదారులను తిరిగి స్వదేశాలకు పంపేయడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు, వ్యాపారానికి, మొత్తంగా దేశానికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆయన అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement