LIVE UPDATES
Time 04:02 PM
►దేశంలో యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేసేందుకు త్వరలో చట్టాన్ని తీసుకురావాలని బీజేపీ మంత్రి నిషికాంత్ దూబే బుధవారం లోక్‌సభలో కేంద్రాన్ని కోరారు.
Time 03:11 PM
►పార్లమెంట్‌లో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది
Time 02:36 PM
► సాగు చట్టాలకు వ్యతిర్కేంగా దేశ రాజధానిలో నిర్వహించిన ఆందోళనలో ఎంత మంది రైతులు మృతి చెందారనే దానికి సంబంధించి కేంద్రం దగ్గర రికార్డులు లేకపోవడం సిగ్గుచేటని విపక్ష మంత్రి మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో వ్యాఖ్యానించారు.
Time 12:15 PM
► 12 మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలన్న అంశాన్ని మరో సారి మల్లిఖార్జున ఖర్గే లేవనెత్తడంతో సభ రసాభసగా మారింది. దీంతో సభ సజావుగా సాగని పరిస్థతి ఏర్పడేసరికి మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.
Time 11:25 AM
► లోక్‌సభలో ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలపై లోక్‌సభ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా మర్యాదలు పాటించాలని హితవు పలికారు. సభ్యులు మాట్లాడుతుంటే నినాదాలు చేయడం సరికాదని, సభ ప్రజల గొంతు వినిపించడం కోసం ఉందని సూచించారు. సభలో గందరగోళం కొనసాగడంతో మధ్యాహ్నం గం. 12.00 వరకు స్పీకర్ వాయిదా వేశారు.
Time 11:15 AM
► సభ వెల్‌లోకి విపక్ష ఎంపీలు వెళ్లడంతో సభ గందరగోళంగా మారింది. దీంతో పాటు ధాన్యం కొనుగోళ్ల అంశం పై కేంద్రం స్పష్టత ఇవ్వాలంటూ టిఆర్ఎస్ రాజ్య సభ ఎంపీలు కూడా వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. గందరగోళం నడుమ రాజ్యసభను 12 గంటలకు వాయిదా వేశారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా 3 రోజు సభ ప్రారంభమైంది. మొదటి రోజు నుంచి రాజ్యసభలో సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక 3 రోజైన బుధవారం 12 మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలనే అంశం సభను రసాభసగా మార్చింది.
Comments
Please login to add a commentAdd a comment