పార్లమెంటును నడపడంలో ప్రభుత్వం విఫలం: ఖర్గే
పార్లమెంటును నడపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. తాము పార్లమెంటులో పెద్దనోట్ల రద్దు, రైతుల సమస్యలు, చిన్న వ్యాపారుల సమస్యలపై చర్చిద్దామని అనుకున్నామని, కానీ అసలు అధికార పక్ష సభ్యులు సభను నడవనివ్వలేదని చెప్పారు.
ఇవే అంశాలను వివరించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని పలు పార్టీలకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు శుక్రవారం కలిశారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రణబ్ దృష్టికి తీసుకెళ్లారు. పెద్దనోట్ల రద్దుపై చర్చ నుంచి ప్రభుత్వం పారిపోయిందని, అసలు దానిపై సభలో మాట్లాడే అవకాశాన్ని తమకు ఇవ్వలేదని ఖర్గే అన్నారు.