Live Updates..
► పోస్ట్ ఆఫీస్ సవరణ బిల్లు 2023ని రాజ్యసభ సోమవారం ఆమోదించింది. 125 ఏళ్ల నాటి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టాన్ని సవరణ చేస్తున్నట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
► ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు ప్రవేశపెట్టిన తీర్మాణంపై ధంఖర్ సానుకూలంగా స్పందించారు. ఎంపీ రాఘవ్ చద్దా ఇప్పటివరకు అనుభవించిన సస్పెన్షన్‌ను తగిన శిక్షగా పరిగణించాలని ఎంపీ జీవీఎల్ నరసింహరావు ప్రవేశపెట్టిన తీర్మాణంలో పేర్కొన్నారు. నేటి నుంచి రాఘవ్ చద్దా సస్పెన్షన్‌ను నిలిపివేయడాన్ని సభ పరిశీలించవచ్చని ధంఖర్‌ను కోరారు.
What for he is smiling & showing victory sign.. AAPtards are so shameless https://t.co/umCm6DyX5J
— mic---jey 👽 (@seasurfer99) December 4, 2023
రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా.
Winter Session of Parliament | Rajya Sabha adjourned till 2 pm pic.twitter.com/PkSg0oyj0F
— ANI (@ANI) December 4, 2023
లోక్‌సభలో ట్రైబల్ యూనివర్సిటీ బిల్లు..
►సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు బిల్లును లోక్‌సభను ప్రవేశపెట్టిన ప్రభుత్వం
►వరంగల్ జిల్లా ములుగులో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్న కేంద్ర ప్రభుత్వం
►ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం
►లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా
Winter Session of Parliament | Lok Sabha adjourned till 12 noon amid ruckus in the House. pic.twitter.com/DBAyWiNtMJ
— ANI (@ANI) December 4, 2023
►పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
►లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా సమావేశాలను ప్రారంభించారు.
►పార్లమెంట్ సమావేశాల సందర్బంగా లోక్‌సభలో బీజేపీ ఎంపీలు మోదీ అంటూ నినాదాలు చేశారు. మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని.. మోదీ అంటూ నినదించారు.
#WATCH | BJP MPs raise the slogan of "Teesri Baar Modi Sarkar" and "Baar Baar Modi Sarkar" in Lok Sabha in the presence of Prime Minister Narendra Modi, as the winter session of the Parliament commences. pic.twitter.com/nZp0YqkQMH
— ANI (@ANI) December 4, 2023
►పార్లమెంట్ సమావేశాల సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కొత్త పార్లమెంట్‌లో ఫలవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నాను. పార్లమెంట్‌లో చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలి. బీజేపీ సుపరిపాలనకు ప్రజలు ఓటు వేశారు. మూడు రాష్ట్రాల్లో విజయం బీజేపీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. విపక్షాలు నెగిటివ్‌గా ఆలోచించడం మానుకోవాలని సూచనలు చేశారు.
#WATCH | Winter Session of Parliament | PM Narendra Modi says, "...Rajnaitik garmi badi tezi se badh rahi hai. Yesterday, the results of the four-state elections came out. The results are very encouraging - encouraging for those who are committed to the welfare of the common… pic.twitter.com/CqzAk1AFHH
— ANI (@ANI) December 4, 2023
►పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆప్ పార్టీ మీటింగ్. రాజ్యసభలోని మల్లికార్జున్ ఖర్గే గదిలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది.
#WATCH | Delhi: All party meeting underway at the office of LoP in Rajya Sabha, Mallikarjun Kharge ahead of the commencement of the Winter Session of Parliament today. pic.twitter.com/uO6fVgyA9F
— ANI (@ANI) December 4, 2023
►పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి.
►బీజేపీ నేతల పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేస్తూ విక్టరీ గుర్తు చూపించారు.
BJP MPs, including JP Nadda, Pralhad Joshi and Gajendra Singh Shekhawat, show a victory sign at the Parliament. pic.twitter.com/AhwT4ju9d0
— ANI (@ANI) December 4, 2023
►నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 22 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజుల పాటు ఈ సెషన్ జరగనుండగా.. ఈ సెషన్‌లో మొత్తం 15 సమావేశాలు జరగనున్నాయి.
►అయితే ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సమావేశాలు ప్రారంభమయ్యే మొదటి రోజునే అంటే ఈ రోజే క్యాష్ ఫర్ క్వెరీ’ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు సంబంధించిన ఎథిక్స్ కమిటీ తన నివేదిక సమర్పించనుంది. ఈ నివేదికలో మహువాను సస్పెండ్ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది.
►ఈ నివేదికను లోక్‌సభ ఆమోదిస్తే మొయిత్రా పార్లమెంట్ సభ్యత్వం ముగుస్తుంది.
►అంతే కాకుండా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనేక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. శీతాకాల సమావేశాల్లో తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లు, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుతో సహా 7 కొత్త బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
►అంతేకాదు IPC, CRPC , క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ , ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ప్రతిపాదిత చట్టాలను కూడా ఈ సమావేశాలలో సమ్పర్పించనున్నారు. ఈ శీతాకాల సమావేశాల్లో ఇండియన్ జస్టిస్ కోడ్ బిల్లు-2023, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ బిల్లు-2023 , ఇండియన్ ఎవిడెన్స్ బిల్లు-2023తో సహా వివిధ బిల్లులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment