పేజీ జిరాక్స్‌కు రూ.750! | Stop Rs 750 as photo copy charges under RTI: CIC to Railways | Sakshi
Sakshi News home page

పేజీ జిరాక్స్‌కు రూ.750!

Published Sun, Dec 11 2016 11:35 AM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM

పేజీ జిరాక్స్‌కు రూ.750!

పేజీ జిరాక్స్‌కు రూ.750!

న్యూఢిల్లీ: సమాచార హక్కు(ఆర్‌టీఐ) చట్టం కింద రైల్వేను వివరాలు కోరే వారి వద్ద నుంచి ఒక్క పేజీ జిరాక్స్‌ కోసం ఏకంగా రూ.750లను వసూలు చేయడాన్ని ఆపేయాలని కేంద్ర సమాచార కమిషన్‌ ఆదేశించింది.

ఆర్‌టీఐ నిబంధనలకు లోబడి పేజీకి రూ.2 మాత్రమే తీసుకోవాలంది. రాయ్‌పూర్‌వాసి ప్రశాంత్‌ కాటెల ఫిర్యాదును విచారిస్తూ ముఖ్య సమాచార కమిషనర్‌ రాధాకృష్ణ మాథుర్‌ ఈ ఆదేశాలిచ్చారు.  టిక్కెట్టుతో ప్రయాణించిన వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికుల ట్రావల్ సర్టిఫికెట్‌ ఇవ్వాలని ఆర్టీఐ ద్వారా రైల్వేను ప్రశాంత్‌ కోరాడు. అయితే పేజీకి రూ. 750 చెల్లించాలని కోరడంతో అప్పీలెట్‌ అథారిటీని ఆశ్రయించాడు. దీంతో కేంద్ర సమాచార కమిషన్‌ కు వెళ్లాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement