
కటక్: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో సర్వీసెస్ జట్టు విజేతగా అవతరించింది. ఆదివారం జరిగిన తుదిపోరులో సర్వీసెస్ జట్టు టైబ్రేక్‌లో 6–4 పాయింట్ల తేడాతో రైల్వేస్‌పై విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరు నిర్ణీత సమయంలో 30–30 పాయింట్లతో సమం అయింది. దాంతో విజేతను తేల్చేందుకు టైబ్రేక్ నిర్వహించగా సర్వీసెస్ రెండు పాయింట్లతో పైచేయి సాధించింది.
ప్రొ కబడ్డీ లీగ్ స్టార్ నవీన్ కుమార్ సారథ్యంలో బరిలోకి దిగిన సర్వీసెస్ జట్టు టోర్నీ ఆసాంతం కనబర్చిన నిలకడనే ఫైనల్లోనూ కొనసాగించింది. పీకేఎల్ 11వ సీజన్ విజేతలైన జైదీప్ దహియా, రాహుల్ సర్వీసెస్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు సెమీఫైనల్లో సర్వీసెస్ 43–35 పాయింట్ల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించగా... మరో సెమీస్‌లో రైల్వేస్ 42–34 పాయింట్ల తేడాతో ఉత్తరప్రదేశ్‌పై గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment