services team
-
‘అప్పీలు చేయడానికైనా కాస్త సిగ్గుండాలి’.. మండిపడ్డ రుతురాజ్ గైక్వాడ్
టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ సహనం కోల్పోయాడు. అంపైర్ల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థి బ్యాటర్‌ను అవుట్ చేసేందుకు మరీ ఇంత దిగజారాలా అంటూ సర్వీసెస్ జట్టు తీరును విమర్శించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? రుతురాజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా పేలవ ప్రదర్శనభారత్-‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. ఆస్ట్రేలియా-‘ఎ’తో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్నాడు. అక్కడ రుతు స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలబడ్డాడు. ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా పేలవ ప్రదర్శనతో విమర్శల పాలయ్యాడు. ఆసీస్-‘ఎ’ జట్టుతో నాలుగు ఇన్నింగ్స్‌లో రుతురాజ్ చేసిన పరుగులు వరుసగా 0, 5, 4 ,11.దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్ర కెప్టెన్గాఇక రుతురాజ్ సారథ్యంలో భారత్-‘ఎ’ జట్టు ఇప్పటికే తొలి టెస్టులో ఓడి.. రెండో మ్యాచ్‌లోనూ పరాజయం దిశగా పయనిస్తోంది. ఇదిలా ఉంటే.. భారత్‌లో ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024-25 సీజన్ నడుస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర జట్టు తమ నాలుగో మ్యాచ్‌లో సర్వీసెస్‌తో తలపడుతోంది. పుణె వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సర్వీసెస్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌట్ అయింది. 185 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర 185 పరుగులకే కుప్పకూలింది. నిజానికి మహారాష్ట్ర ఈ మేర కాస్త చెప్పుకోదగ్గ స్కోరు చేయడానికి కారణం ఆ జట్టు కెప్టెన్ అంకిత్ బావ్నే. రుతురాజ్ గైక్వాడ్ గైర్హాజరీలో మహారాష్ట్ర టీమ్‌ను ముందుకు నడిపిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అర్ధ శతకంతో మెరిశాడు.సర్వీసెస్‌తో మ్యాచ్‌లో తమ మొదటి ఇన్నింగ్స్‌లో 104 బంతులు ఎదుర్కొన్న అంకిత్.. 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 73 పరుగులు చేశాడు. అయితే, అతడు అవుటైన తీరు వివాదాస్పదంగా మారింది. వివాదాస్పద రీతిలో అంకిత్ అవుట్క్రీజులో పాతుకుపోయిన అంకిత్ వికెట్ తీయాలన్న పట్టుదలతో ఉన్న సర్వీసెస్.. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న తమ పేసర్ అమిత్ శుక్లాను రంగంలోకి దించింది.అతడి బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన అంకిత్ విఫలమయ్యాడు. అంకిత్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభం రోహిలా చేతిలో పడ్డట్లు కనిపించింది. దీంతో సర్వీసెస్ అప్పీలు చేయగా అంపైర్ అవుట్ ఇచ్చాడు. అయితే, రీప్లేలో మాత్రం.. ఫీల్డర్ చేతిలో పడే కంటే ముందే బాల్ నేలను తాకినట్లు స్పష్టంగా కనిపించింది.అయినప్పటికీ అంకిత్ బావ్నేను అవుట్‌గా ప్రకటించడంతో మహారాష్ట్ర కీలక వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో అంకిత్ అవుటైన తీరుపై రుతురాజ్ ఘాటుగా స్పందించాడు. ‘అప్పీలు చేయడానికైనా కాస్త సిగ్గుండాలి’ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ‘‘లైవ్ మ్యాచ్‌లో.. దీనిని ఎలా అవుట్‌గా ప్రకటిస్తారు? అసలు అది క్యాచ్ అవుట్ అని అప్పీలు చేయడం కూడా నిజంగా సిగ్గుచేటు’’ అని మహారాష్ట్ర రెగుల్యర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మండిపడ్డాడు.ఇక రంజీ తాజా సీజన్లో ఎలైట్ గ్రూప్-ఎ మ్యాచ్‌లలో భాగంగా తొలుత కశ్మీర్‌తో మ్యాచ్ డ్రా చేసుకున్న మహారాష్ట్ర.. ఆ తర్వాత ముంబై చేతిలో 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం.. మేఘాలయపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించి గెలుపుబాట పట్టింది.చదవండి: అతడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు?.. కుండబద్దలు కొట్టిన సూర్య Ruturaj Gaikwad was fuming with Ankit Bawne's controversial dismissal against Services #RanjiTrophy2024 Source: Gaikwad's Instagram story pic.twitter.com/HParORg3YQ— Vijeet Rathi (@vijeet_rathi) November 7, 2024 -
ఒకే ఒక్క పరుగు.. 80 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి
రంజీ ట్రోఫీలో సర్వీసెస్ జట్టు సరి కొత్త చరిత్ర సృష్టించింది. 80 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన తొలి జట్టుగా సర్వీసెస్ రికార్డులకెక్కింది. రంజీ ట్రోఫీ 2023-2024లో భాగంగా హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం నమోదు చేసిన సర్వీసెస్.. ఈ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హర్యానా 144 పరుగుల వద్దే ఆలౌట్ అయింది. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సర్వీసెస్.. తొలి ఇన్నింగ్స్‌లో 108 పరుగులకే ఆలౌటైంది. సర్వీసెస్ అర్జున్ శర్మ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సర్వీసెస్ జట్టులో ఎనిమిది బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. అనంతరం హర్యానా కూడా దారుణ ప్రదర్శన కనబరిచింది. ఆ జట్టు 103 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన సర్వీసెస్ మరోసారి అదే ఆటతీరును కనబరిచింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 5 పరుగుల ఆధిక్యాన్ని జోడించి 146 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి ముందు సర్వీసెస్ ఉంచింది. అయితే లక్ష్య ఛేదనలో హర్యానా 144 పరుగులకే కుప్పకూలింది. రంజీ ట్రోఫీలో స్వల్ప తేడాతో విజయాలు.. 1. ఒక్క పరుగు తేడాతో సర్వీసెస్ (హర్యానాపై) – 2024 2. రెండు పరుగుల తేడాతో జార్ఖండ్ (ఒడిషాపై) – 2018 3.నాలుగు పరుగుల తేడాతో బెంగాల్ (తమిళనాడుపై) – 2013 4. నాలుగు పరుగుల తేడాతో సౌరాష్ట్ర (ఢిల్లీపై)- 2016 5. ఐదు పరగుల తేడాతో విదర్భ (కర్నాటకపై) – 2017 -
సెమీస్‌లో సౌరాష్ట్ర, సర్వీసెస్
జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మాజీ చాంపియన్ సౌరాష్ట్ర సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర 7 వికెట్ల తేడాతో విదర్భపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విదర్భ 40.3 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. అపూర్వ్ వాంఖడే (69 బంతుల్లో 72; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. కెప్టెన్ ఉనాద్కట్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీశాడు. అనంతరం సౌరాష్ట్ర 29.5 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు సాధించింది. సౌరాష్ట్ర 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోగా... ప్రేరక్ మన్కడ్ (72 బంతుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), అర్పిత్ వాసవదా (41 నాటౌట్) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 116 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. గెలిపించిన రవి చౌహాన్... కేరళతో జరిగిన మరో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన సర్వీసెస్ సెమీస్‌లోకి అడుగు పెట్టింది. ముందుగా కేరళ 40.4 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. రోహన్ కన్నుమ్మల్ (106 బంతుల్లో 85; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం సర్వీసెస్ 30.5 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసింది. రవి చౌహాన్ (90 బంతుల్లో 95; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా, రజత్ పలివాల్ (86 బంతుల్లో 65 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. చదవండి: భారత బౌలర్‌పై సచిన్ ప్రశంసల జల్లు.. -
సర్వీసెస్ 170/3
ఆంధ్రతో రంజీ మ్యాచ్ ఇండోర్: ఆంధ్ర జట్టుతో ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో సర్వీసెస్ జట్టు బ్యాటింగ్ తొలిరోజు నత్తనడకన సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సర్వీసెస్ జట్టు శనివారం ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 170 పరుగులే చేసింది. అన్షుల్ గుప్తా (72), శంషేర్ యాదవ్ (60 బ్యాటింగ్) అర్ధసెంచరీలతో రాణించారు. వికాస్ యాదవ్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. హైదరాబాద్ మ్యాచ్‌కు అడ్డంకి ఢిల్లీలోని కర్నాలి సింగ్ స్టేడియంలో త్రిపుర, హైదరాబాద్ జట్ల మధ్య శనివారం జరగాల్సిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌కు పొగమంచు అడ్డంకిగా మారింది. వెలుతురు లేమి కారణంగా తొలిరోజు ఆటను నిలిపివేశారు.