జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మాజీ చాంపియన్ సౌరాష్ట్ర సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర 7 వికెట్ల తేడాతో విదర్భపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విదర్భ 40.3 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. అపూర్వ్ వాంఖడే (69 బంతుల్లో 72; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. కెప్టెన్ ఉనాద్కట్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీశాడు. అనంతరం సౌరాష్ట్ర 29.5 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు సాధించింది. సౌరాష్ట్ర 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోగా... ప్రేరక్ మన్కడ్ (72 బంతుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), అర్పిత్ వాసవదా (41 నాటౌట్) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 116 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.
గెలిపించిన రవి చౌహాన్...
కేరళతో జరిగిన మరో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన సర్వీసెస్ సెమీస్‌లోకి అడుగు పెట్టింది. ముందుగా కేరళ 40.4 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. రోహన్ కన్నుమ్మల్ (106 బంతుల్లో 85; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం సర్వీసెస్ 30.5 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసింది. రవి చౌహాన్ (90 బంతుల్లో 95; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా, రజత్ పలివాల్ (86 బంతుల్లో 65 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు.
Vijay Hazare Trophy 2021: సెమీస్‌లో సౌరాష్ట్ర, సర్వీసెస్
Published Thu, Dec 23 2021 9:01 AM | Last Updated on Thu, Dec 23 2021 9:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment