semifianl
-
కివీస్‌తో సెమీస్ పోరు.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?
వన్డే ప్రపంచకప్-2023 లీగ్ స్టేజీలో తొమ్మిది విజయాలతో ఆజేయంగా నిలిచిన ఇప్పుడు సెమీఫైనల్స్ సమరానికి సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా నవంబర్ 15న తొలి సెమీఫైనల్లో ముంబై వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. లీగ్ దశలో ఇప్పటికే న్యూజిలాండ్‌పై విజయం సాధించిన టీమిండియా.. అదే జోరును సెమీస్‌లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో కివీస్‌ను చిత్తు చేసి 2019 వరల్డ్‌కప్ సెమీస్‌లో ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. 2019 వరల్డ్‌కప్‌లో కూడా.. కాగా వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడడం ఇది రెండో సారి. 2019లో వరల్డ్‌కప్‌లో తొలిసారి సెమీస్‌లో టీమిండియా, కివీస్ జట్లు తలపడ్డాయి. 2019 వరల్డ్‌కప్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత్.. టైటిల్ కచ్చితంగా సాధిస్తుందని అంతా భావించారు. కానీ సెమీఫైనల్లో కివీస్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలై టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. అప్పటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ను భారత బౌలర్లు కేవలం 239 పరుగులకే కట్టడి చేశారు. అయితే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 211/5 వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ను రిజర్వ్‌డేకు వాయిదా వేశారు. రిజర్వ్‌డే రోజు 211/5 వద్ద ఆటను ప్రారంభించిన అదనంగా మూడు వికెట్లు 28 పరుగులు చేసింది. దీంతో 240 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు న్యూజిలాండ్ ఉంచింది. అయితే. కోహ్లి, రోహిత్, పంత్ ఫామ్ చూసి విజయం లాంఛనమే అనుకున్నారు. కానీ 240 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా టాపర్డర్ బ్యాటర్లు రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు. అనంతరం దినేష్ కార్తీక్ కూడా సింగిల్ డిజిట్‌కే ఔట్ కావడంతో 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇటువంటి క్లిష్ట సమయంలో రిషభ్ పంత్(32), హార్దిక్ పాండ్యా(32) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరూ వరుస క్రమంలో ఔటయ్యారు. దీంతో స్కోర్ బోర్డు 100 పరుగులు దాటకముందే టీమిండియా 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. ఏడో వికెట్‌కు వీరిద్దరూ 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విజయానికి 32 పరుగుల అవసరమైన సమయంలో జడేజా(77) ఔటయ్యాడు. అయినప్పటికీ ఫినిషర్ ధోని క్రీజులో ఉన్నాడనే నమ్మకం అభిమానులలో ఉంది. కానీ విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు అవసరమైన సమయంలో ధోనీ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. రెండో పరుగు తీసే క్రమంలో కివీస్ ప్లేయర్ మార్టిన్ గప్తిల్ వేసిన డైరెక్ట్ త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత అభిమానలంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ధోని రనౌట్ అనంతరం టీమండియా వరుసగా రెండు వికెట్లు కోల్పోయి 221 పరుగులకు ఆలౌటైంది. దీంతో 18 పరుగుల తేడాతో కివీస్ చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. వన్డేల్లో హెడ్ టూ రికార్డులు ఎలా ఉన్నాయంటే? భారత్, న్యూజిలాండ్ మధ్య ఇప్పటి వరకు 117 వన్డేల్లొ ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో భారత్ 59 సార్లు విజయం సాధించగా.. కివీస్ 50 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఒక్క మ్యాచ్ డ్రా ముగియగా.. మరో 7 మ్యాచ్‌లు ఎటువంటి ఫలితం తేలకుండా రద్దు అయ్యాయి. 59 విజయాల్లో 24 సార్లు తొలుత బ్యాటింగ్ చేసి గెలుపొందగా.. 25 సార్లు ఛేజింగ్‌లో భారత్ విజయఢంకా మోగించింది. -
సెమీస్ రేసు నుంచి పాక్ అవుట్! ఒకవేళ పోటీలో ఉండాలంటే?
వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. ఈ మెగా టోర్నీలో భాగంగా శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్.. పాక్ సెమీస్ ఆశలపై నీళ్లు జల్లింది. ఈ విజయంతో న్యూజిలాండ్ తమ సెమీఫైనల్ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరాలంటే అద్బుతాలే జరగాలి. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. నాలుగో స్ధానం కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. అయితే లంకపై విజయంతో పాయింట్ల పట్టికలో కివీస్ నాలుగో స్ధానానికి చేరుకుంది. న్యూజిలాండ్ రన్‌రేట్ (+743), పాక్(+0.036), అఫ్గానిస్తాన్(-0.338) కంటే మెరుగ్గా ఉంది. ఒకవేళ పాక్, అఫ్గాన్ తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిచి మూడు జట్ల పాయింట్లు సమమైనా.. రన్‌రేట్ పరంగా కివీస్‌కే సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే పాకిస్తాన్‌కు టెక్నికల్‌గా సెమీస్ దారులు ఇంకా మూసుకుపోలేదు. పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే? పాకిస్తాన్‌కు ఈ టోర్నీలో ఇంకా ఒకే మ్యాచ్ మిగిలి ఉంది. నవంబర్ 11న ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 287 పరుగుల తేడాతో ఓడిస్తేనే పాకిస్తాన్ రన్‌రేట్ పరంగా కివీస్‌ను అధిగమిస్తుంది. తద్వారా సెమీఫైనల్‌కు నాలుగో జట్టుగా అర్హత సాధిస్తుంది. మరోవైపు ప్రత్యర్ధి విధించిన టార్గెట్‌ను పాక్ కేవలం 2.2 ఓవర్లలోనే ఛేదించాలి. ఒకవేళ ఇంగ్లండ్ 50 పరుగులకు ఆలౌటైతే.. పాక్ టార్గెట్‌ను 2. 2 ఓవర్లోనే ఛేజ్ చేయాలి. ఇది జరగడం ఆసాధ్యం. కాబట్టి ఇంగ్లండ్ మొదటి బ్యాటింగ్ చేస్తే పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. చదవండి: World Cup 2023: చరిత్ర సృష్టించిన రచిన్ రవీంద్ర.. సచిన్ రికార్డు బద్దలు -
సెమీస్‌లో సౌరాష్ట్ర, సర్వీసెస్
జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మాజీ చాంపియన్ సౌరాష్ట్ర సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర 7 వికెట్ల తేడాతో విదర్భపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విదర్భ 40.3 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. అపూర్వ్ వాంఖడే (69 బంతుల్లో 72; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. కెప్టెన్ ఉనాద్కట్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీశాడు. అనంతరం సౌరాష్ట్ర 29.5 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు సాధించింది. సౌరాష్ట్ర 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోగా... ప్రేరక్ మన్కడ్ (72 బంతుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), అర్పిత్ వాసవదా (41 నాటౌట్) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 116 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. గెలిపించిన రవి చౌహాన్... కేరళతో జరిగిన మరో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన సర్వీసెస్ సెమీస్‌లోకి అడుగు పెట్టింది. ముందుగా కేరళ 40.4 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. రోహన్ కన్నుమ్మల్ (106 బంతుల్లో 85; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం సర్వీసెస్ 30.5 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసింది. రవి చౌహాన్ (90 బంతుల్లో 95; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా, రజత్ పలివాల్ (86 బంతుల్లో 65 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. చదవండి: భారత బౌలర్‌పై సచిన్ ప్రశంసల జల్లు.. -
మిచెల్ వీరోచిత ఇన్నింగ్స్.. తొలి సారి టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు..
2016 టి20 ప్రపంచకప్ సెమీస్‌లో... 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి బాధ ఎలా ఉంటుందో చూపించిన ఇంగ్లండ్‌కు ఈసారి న్యూజిలాండ్ కిర్రాక్ ఆటతీరుతో కలలో కూడా వెంటాడే రీతిలో షాక్ ఇచ్చింది. ఒకదశలో ఇంగ్లండ్ చేతిలో మూడోసారి ఐసీసీ ఈవెంట్ నాకౌట్ పోరులో న్యూజిలాండ్‌కు భంగపాటు తప్పదేమోననిపించింది. అయితే రేసుగుర్రంలా కనిపించిన ఇంగ్లండ్‌కు జేమ్స్ నీషమ్ తన మెరుపు ఇన్నింగ్స్‌తో నిద్రలేని రాత్రి గడిచేలా చేశాడు. నీషమ్ 11 బంతుల సూపర్ ఇన్నింగ్స్ ఇంగ్లండ్‌కు దిమ్మదిరిగేలా చేసింది. ఓపెనర్‌గా వచ్చి ఆఖరి దాకా నిలిచిన డారిల్ మిచెల్ ఇన్నింగ్స్ న్యూజిలాండ్ తొలిసారి టి20 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరేందుకు దోహదపడింది. New Zealand beat England by 5 wickets enter final of T20 World Cup: ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. తర్వాత న్యూజిలాండ్‌ను తిప్పలు పెట్టింది. కివీస్ లక్ష్యఛేదనలో 16 ఓవర్ల దాకా ఇంగ్లండ్‌దే పైచేయి. తర్వాత మూడు ఓవర్లు, నీషమ్ మెరుపులు మోర్గాన్ బృందం ఆశలను తలకిందులు చేశాయి. దీంతో ఇంకో ఓవర్ మిగిలుండగానే న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తమకు ఐసీసీ ప్రపంచకప్‌లను దూరం చేస్తున్న ఇంగ్లండ్‌ను ఈ మెగా ఈవెంట్ సెమీఫైనల్లో కివీస్ కసిదీరా ఓడించి మరీ ఫైనల్ చేరింది. తొలుత ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మొయిన్ అలీ (37 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్ మలాన్ (30 బంతుల్లో 41; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. కివీస్ బౌలర్లలో సౌతీ, మిల్నే, సోధి, నీషమ్ తలా ఒక వికెట్ తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డారిల్ మిచెల్ (47 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) జట్టు గెలిచేదాకా నిలిచాడు. కాన్వే (38 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్), నీషమ్ (11 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు) అదరగొట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్‌స్టోన్, వోక్స్ చెరో 2 వికెట్లు తీశారు. మొయిన్ అలీ ఫిఫ్టీ టాస్ నెగ్గిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనింగ్ జేసన్ రాయ్ లేని లోటు కనిపించింది. రాయ్ లేని ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్లో మెరుపులు కరువయ్యాయి. అయితే రన్‌రేట్ 6, 7 పరుగులకు పైనే సాగిపోయింది. బట్లర్‌కు జతగా ఓపెనింగ్‌లో వచ్చిన బెయిర్‌స్టో (13) విఫలమయ్యాడు. మరోవైపు కివీస్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బట్లర్ కూడా ధాటిగా ఆడలేకపోయాడు. దీంతో పవర్ ప్లే (6 ఓవర్లు)లో ఇంగ్లండ్ 40/1 స్కోరు చేయగలిగింది. 9వ ఓవర్లో బట్లర్ (24 బంతుల్లో 29; 4 ఫోర్లు)ను సోధి బోల్తా కొట్టించాడు. 10 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు 67/2. మలాన్, మొయిన్ అలీ పరుగు పెట్టించే బాధ్యత తీసుకున్నారు. భారీషాట్లు కొట్టకపోయినా అడపాదడపా బౌండరీలతో జట్టు స్కోరును 14వ ఓవర్లో 100 పరుగులకు చేర్చారు. చేతిలో వికెట్లున్నా... ఇద్దరిలో ఏ ఒక్కరూ ఎదురుదాడి చేయలేకపోయారు. ఎట్టకేలకు 16వ ఓవర్ తొలి బంతికి మలాన్ సిక్స్ కొట్టాడు. ఇన్నింగ్స్‌లో ఇదే తొలి సిక్స్. కానీ మరుసటి బంతికే అతను ఔటయ్యాడు. ఆఖరి ఓవర్లలో వేగంగా ఆడే క్రమంలో లివింగ్‌స్టోన్ (17; ఫోర్, సిక్స్) వికెట్ సమర్పించుకున్నాడు. మొయిన్ అలీ 36 బంతుల్లో (3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసిన అర్ధసెంచరీతో ఇంగ్లండ్ 150 పైచిలుకు స్కోరు చేయగల్గింది. లక్ష్యం కఠినమైంది... లక్ష్యఛేదనలో కివీస్ తడబడింది. పవర్ ప్లేలో ప్రత్యర్థి బంతులతో పాటు కష్టాలను ఎదుర్కొంది. ఇన్నింగ్స్ తొలి బంతినే బౌండరీకి తరలించిన గప్టిల్ (4) మూడో బంతికి పెవిలియన్ చేరాడు. జట్టును నడిపిస్తాడనుకున్న నాయకుడు విలియమ్సన్ (5) విఫలమయ్యాడు. ఓపెనర్ మిచెల్, కాన్వే చూసుకొని ఆడారు. దీంతో కివీస్ పవర్‌ప్లేలో 2 వికెట్లకు 36 పరుగులు చేసింది. ఆ తర్వాత 10 ఓవర్ల దాకా కివీస్ స్కోరు (58/2) అదే తీరుగా సాగింది. మిగిలున్న 10 ఓవర్లలో 109 పరుగులు చేయాల్సిన కొండంత లక్ష్యమైంది. అయితే 11వ ఓవర్ నుంచి మిచెల్, కాన్వే బ్యాట్‌కు పనిచెప్పడంతో ఐదు ఓవర్లలో 49 పరుగులు వచ్చాయి. 14వ ఓవర్లో కాన్వే అవుటయ్యాడు. నీషమ్ ధనాధన్... ఆఖరి 30 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన దశలో 16వ ఓవర్ తొలి బంతికే ఫిలిప్స్ (2)ను లివింగ్‌స్టోన్ బోల్తా కొట్టించాడు. ఈ ఓవర్లో కేవలం 3 పరుగులే ఇవ్వడంతో కివీస్ విజయసమీకరణం 24 బంతుల్లో 57 పరుగులుగా మారింది. అయితే జోర్డాన్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో నీషమ్ ఓ ఆట ఆడుకున్నాడు. 6, 2, 1, 4, 1, 6, 2, 1లతో ఏకంగా 23 పరుగులు రావడంతో కివీస్ లక్ష్యానికి ఊపిరిపోసింది. వెంటనే స్పిన్నర్ రషీద్‌కు బంతి అప్పగించాడు. నీషమ్, మిచెల్ చెరో సిక్సర్ బాదారు. 14 పరుగులొచ్చాయి... కానీ ఆఖరి బంతికి నీషమ్ మెరుపులకు రషీద్ అడ్డుకట్ట వేశాడు. ఇక 12 బంతులు 20 పరుగుల సమీకరణం మ్యాచ్‌లో ఉత్కంఠ పెంచింది. కానీ వోక్స్ వేసిన 19వ ఓవర్లో ఓపెనర్ మిచెల్ వరుసగా రెండు సిక్సర్లు, ఆఖరి బంతికి ఫోర్ కొట్టడంతో న్యూజిలాండ్ విజయం ఖాయమైంది. ఇంగ్లండ్‌కు చివరి ఓవర్ వేయాల్సిన అవసరమే రాలేదు. చదవండి: Keshav Maharaj: దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా కేశవ్ మహారాజ్ -
'సెమిఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించడం అంత సులభం కాదు'
Sunil Gavaskar Comments on New Zealand vs England T20 World Cup 2021 Semi-Final: టీ20 ప్రపంచకప్-2021 చివరి అంకానికి చేరుకుంది. తొలి సెమిఫైనల్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు హమీ తుమీ తేల్చుకోవడానికి సిద్దం అవుతున్నాయి. అబుదాబి వేదికగా బుధవారం(నవంబర్10)న ఇరు జట్లు మధ్య ఈ కీలక పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌పై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ పోరులో ఇంగ్లండ్‌పై విజయం సాధించడం న్యూజిలాండ్‌కు అంత సులభం కాదు అని అతడు అభిప్రాయపడ్డాడు. "టీ20 ప్రపంచకప్‌లో తొలి సెమిఫైనల్ పోరు ఆసక్తికరంగా ఉండనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించడం అంత సులభం కాదు. ఎందుకంటే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్ అద్బుతమైన జట్టు. 2015లో ఆస్ట్రేలియాలో జరిగిన వన్టే ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన ఇంగ్లండ్ జట్టు తర్వాత వైట్-బాల్ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తుంది. జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్ హిట్టర్లు ఇంగ్లండ్ జట్టులో ఉన్నారు. ఇయాన్ మోర్గాన్ మాదిరిగానే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ప్రశాంతంగా ఉండి ప్రత్యర్థులను కట్టడం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడు" అని గవాస్కర్ పేర్కొన్నాడు. అయితే అంతక ముందు 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఇరు జట్లు సమానంగా స్కోర్లు చేయడంతో మ్యాచ్ టై అయింది. అలా సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో కూడా ఇరు జట్లు 15 పరుగులే చేయడంతో మరోసారి టై అయింది. దీంతో ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ను ఐసీసీ విజేతగా ప్రకటించింది. టి20 ప్రపంచకప్ 2021లో సెమీస్‌లో మరోసారి ఈ ఇద్దరు తలపడుతుండడంతో కివీస్ ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది వేచి చూడాలి. చదవండి: న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు భారత అభిమానులకు గుడ్ న్యూస్. -
శ్రీలంక టార్గెట్ 268
మిర్పూర్: అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ సెమీఫైనల్లో శ్రీలంకకు భారత్ 268 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన యువభారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. అనమోల్ ప్రీత్ సింగ్(72), సర్ఫరాజ్ ఖాన్(59) అర్ధసెంచరీలతో రాణించారు. 27 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన జట్టును వీరిద్దరూ ఆదుకున్నారు. మూడో వికెట్ కు 96 పరుగులు జోడించారు. వాషింగ్టన్ సుందర్(43)తో కలిసి నాలుగో వికెట్ కు అనమోల్ ప్రీత్ 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అర్మాన్ జాఫర్ 29, లోమరొర్ 11, దాగర్ 17, ఆర్ పంత్ 14 పరుగులు చేశారు. లంక బౌలర్లలో ఫెర్నాండొ 4 వికెట్లు పడగొట్టాడు. కుమార, నిమేశ్ రెండేసి వికెట్లు తీశారు. -
శ్రీలంక ఫీల్డింగ్.. భారత్ బ్యాటింగ్
మిర్పూర్: అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ లో భాగంగా టు స్థానిక షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో మంగళవారం జరుగుతున్న సెమీఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో యువభారత్ ముందుగా బ్యాటింగ్ కు దిగనుంది. సిరీస్ ఆరంభం నుంచి జోరుమీదున్న భారత్ శ్రీలంకను ఓడించి ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉన్నారు. ప్రపంచకప్ కల సాకారం చేసుకునేందుకు లంకను కచ్చితంగా జయించాలనే ధ్యేయంతో బరిలోకి దిగుతున్నారు. అత్యుత్తమ ఆటతీరు చూపి శ్రీలంకను ఓడించాలని ఉత్సాహంగా ఉన్నారు. క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌పై స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకుని మంచి ఊపు మీదున్న యువశ్రీలంక కూడా సత్తా చాటాలని భావిస్తోంది.