Vijay Hazare 2021: Tamil Nadu Beats Saurashtra To Enters Final - Sakshi
Sakshi News home page

Vijay Hazare Trophy 2021: 'సూపర్‌' వాషింగ్టన్‌ సుందర్‌.. ఫైనల్‌కు తమిళనాడు

Published Fri, Dec 24 2021 7:04 PM | Last Updated on Fri, Dec 24 2021 7:56 PM

Vijay Hazare 2021: Tamil Nadu Enters Final Beat Saurashtra 2 Wickets - Sakshi

Tamil Nadu Enters Final Beating  Saurashtra In Semi Final-2.. విజయ్‌ హజారే ట్రోఫీ 2021లో తమిళనాడు ఫైనల్‌కు చేరింది. సౌరాష్ట్రతో జరిగిన సెమీఫైనల్‌-2 మ్యాచ్‌లో తమిళనాడు 2 వికెట్లతో విజయాన్ని అందుకుంది. 314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు ఇన్నింగ్‌ ఆఖరి బంతికి 8 వికెట్లు కోల్పోయి చేధించింది. తమిళనాడు బ్యాటింగ్‌లో ఓపెనర్‌ బాబా అపరాజిత్‌(122 పరుగులు) సెంచరీతో మెరవగా.. ఆఖర్లో వాషింగ్టన్‌ సుందర్‌ (61 బంతుల్లో 70, 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్‌ సకారియా 5 వికెట్లు తీశాడు.

చదవండి: ఆరోన్‌ ఫించ్ సరికొత్త రికార్డు‌.. టి20 చరిత్రలో ఆరో బ్యాటర్‌గా

ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. వికెట్‌ కీపన్‌ షెల్డన్‌ జాక్సన్‌(125 బంతుల్లో 134 పరుగులు, 11 ఫోర్లు,  సిక్సర్లు) చెలరేగగా.. వసవదా 57, ప్రేరక్‌ మన్కడ్‌ 37 పరుగులు చేశారు. తమిళనాడు బౌలర్లలో విజయ్‌ శంకర్‌ 4, సిలింబరాసన్‌ 3 వికెట్లు తీశారు. ఇక హిమాచల్‌ ప్రదేశ్‌, సర్వీసెస్‌ మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ 77 పరుగులతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. డిసెంబర్‌ 26న జరగనున్న ఫైనల్లో హిమాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

చదవండి: Harbhajan Singh Retirement: రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement