VHT 2023: రాణా అజేయ శతకం.. ఫైనల్లో హర్యానా | Sakshi
Sakshi News home page

VHT 2023: రాణా అజేయ శతకం.. ఫైనల్లో హర్యానా

Published Wed, Dec 13 2023 9:25 PM

 VHT 2023: Himanshu Rana Slams Hundred, As Haryana Beat Tamil Nadu And Enters Finals - Sakshi

విజయ్‌ హజారే ట్రోఫీ 2023లో హర్యానా ఫైనల్స్‌కు చేరింది. తమిళనాడుతో ఇవాళ (డిసెంబర్‌ 13) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆ జట్టు 63 పరుగుల తేడాతో గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది. హిమాన్షు రాణా (118 బంతుల్లో 116 నాటౌట్‌; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), అన్షుల్‌ కంబోజ్‌ (9-0-30-4) హర్యానా గెలుపులో కీలకపాత్ర పోషించారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన హర్యానా.. హిమాన్షు అజేయ శతకంతో మెరవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 293 పరుగుల చేసింది. హర్యానా ఇన్నింగ్స్‌లో హిమాన్షుతో పాటు యువరాజ్‌ సింగ్‌ (65), సుమిత్‌ కుమార్‌ (48) ఓ మోస్తరుగా రాణించారు. తమిళనాడు బౌలర్లలో టి నటరాజన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ​్‌ చక్రవర్తి, సాయికిషోర్‌ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన తమిళనాడు.. మీడియం పేసర్‌  అన్షుల్‌ కంబోజ్‌ చెలరేగడంతో 47.1 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటై, ఓటమిపాలైంది. హర్యానా బౌలర్లలో రాహుల్‌ తెవాటియా 2, సుమిత​ కుమార్‌, నిషాంత్‌ సింధు, హర్షల్‌ పటేల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో బాబా ఇంద్రజిత్‌ (64) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. మిగతా బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు.

టోర్నీలో భాగంగా కర్ణాటక, రాజస్థాన్‌ జట్ల మధ్య రేపు (డిసెంబర్‌ 14) రెండో సెమీఫైనల్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో హర్యానా ఈనెల 16న ఫైనల్‌ మ్యాచ్‌ ఆడుతుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement