
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఉనికిలోకి వచ్చిన 12 సంవత్సరాల తర్వాత మంగళవారం సొంత భవనంలోకి మారనుంది. అత్యాధునిక హంగులతో కూడిన సీఐఐ నూతన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభిస్తారు. ఇప్పటివరకూ ఆగస్ట్ క్రాంతిభవన్, పాత జేఎన్‌యూ బిల్డింగ్‌ల నుంచి సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి. సువిశాల ప్రాంగణంలో నూతన భవనాన్ని నిర్మించారు. త
మ కేసుల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా పెద్దసంఖ్యలో పిటిషనర్లు తరలివస్తున్న క్రమంలో పాత కార్యాలయం రద్దీని అధిగమించకపోవడంతో నూతన భవనాన్ని నిర్మించారు. మునిర్కాలో కొలువుతీరిన సీఐసీ భవనంలో అత్యాధునిక సాంకేతక సదుపాయాలున్నాయని..దీని నిర్మాణాన్ని నేషనల్ బిల్డింగ్ కన్‌స్ర్టక్షన్ కార్పొరేషన్ రికార్డు సమయంలో పూర్తిచేసిందని సీఐసీ వర్గాలు పేర్కొన్నాయి. ఐదంతస్తులతో కూడిన ఈ భవనంలో ఐటీ, వీడియో కాన్ఫరెన్స్ వంటి సదుపాయాలున్న హియరింగ్ రూమ్‌లు అందుబాటులోకి రానున్నాయి.