new office
-
బెంగళూరులో మరో ఆఫీస్: 300 మంది ఉద్యోగులకు అవకాశం
కరోనా సమయంలో భారీ నష్టాలను చవి చూసిన దిగ్గజ కంపెనీలు కోలుకుంటున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఐటీ కంపెనీ 'యూఎస్టీ' తన కార్యకలాపాలను విస్తరించడంతో భాగంగా.. బెంగళూరులో రెండవ ఆఫీస్ ప్రారంభించింది. సుమారు 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న యూఎస్టీ కొత్త కార్యలయం 300 మంది ఉద్యోగులు విధులు నిర్వహించడానికి అనుకూలంగా ఉంది.కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడంలో భాగంగానే.. ఈ కొత్త ఆఫీస్ ప్రారంభించినట్లు సమాచారం. యూఎస్టీ తన కొచ్చి ప్రధాన కేంద్రంలో వచ్చే ఐదేళ్ల నాటికి సుమారు 6,000 మందికి పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఇక్కడ 2,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. కాగా కేరళలోని తిరువనంతపురం కేంద్రంలో సుమారు 7,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: రూ. 34కే బియ్యం.. మళ్ళీ భారత్ బ్రాండ్ సేల్స్2012లో తన కార్యకలాపాలను ప్రారంభించిన యూఎస్టీ.. బెంగళూరులో ప్రస్తుతం 6000 కంటే ఎక్కువమంది ఉద్యోగులను కలిగి ఉంది. ఈ కంపెనీ సెమీకండక్టర్, హెల్త్‌కేర్, టెక్నాలజీ, లాజిస్టిక్స్, హైటెక్, రిటైల్, బీఎఫ్ఎస్ఐ రంగాల్లో సేవలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ భారతదేశం అంతటా 20000 మంది కంటే ఎక్కువ ఉద్యోగులను కలిగి ఉంది. కాగా ప్రపంచ వ్యాప్తంగా 30000 కంటే ఎక్కువ ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. -
లూటెన్స్‌లో ఆప్ నూతన కార్యాలయం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని లూటెన్స్ ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి కొత్త కార్యాలయాన్ని కేటాయించినట్లు అధికారవర్గాలు గురువారం తెలిపాయి. పండిట్ రవి శంకర్ శుక్లా లేన్‌లోని ఒకటో నంబర్ బంగ్లాను ఆప్‌కు ఇచ్చినట్లు చెప్పాయి. గతంలో రౌజ్ అవెన్యూ ప్రాంతంలో ఆప్ కార్యాలయం ఉండేది. జాతీయ గుర్తింపు కోల్పోవడంతో ఆ కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది జాతీయ పార్టీగా తిరిగి గుర్తింపు సాధించిన ఆప్‌కు హోదాకు తగ్గట్టుగా మరో చోట కార్యాలయం కేటాయించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. ఈ విషయాన్ని జూలై 25వ తేదీలోగా తేల్చాలంటూ ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. -
హైరింగ్ ప్రణాళికల్లో స్టోరబుల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెల్ఫ్–స్టోరేజ్ టెక్నాలజీ సొల్యూషన్స్ అందించే అమెరికన్ సంస్థ స్టోరబుల్ భారత్‌లో తమ కార్యకలాపాలు విస్తరిస్తోంది. హైదరాబాద్‌లో 15వేల చ.అ. విస్తీర్ణంలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. గతేడాదే హైదరాబాద్‌లో తమ ఏషియా జీసీసీని స్టోరబుల్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ 60 మంది ఉద్యోగులు ఉండగా, ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ సంఖ్యను 120కి పెంచుకోనున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ చార్లీ మారియట్ తెలిపారు. ఇంజనీరింగ్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నట్లు వివరించారు. -
పుణెలో గూగుల్ కొత్త ఆఫీస్.. ఎలా ఉందో చూడండి..
Google New Office In Pune : భారత్‌లో విస్తరణను కొనసాగిస్తున్న టెక్ దిగ్గజం గూగుల్ ( Google ) ఇటీవల పుణెలోని కోరేగావ్ పార్క్ అనెక్స్‌లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యాలయం ద్వారా గ్లోబల్ ఇంజినీరింగ్ బృందాల సహకారంతో అధునాతన ఎంటర్ప్రైజ్ క్లౌడ్ టెక్నాలజీల రూపకల్పన, రియల్ టైమ్‌లో సాంకేతిక సలహాలను అందించడం, ప్రొడక్ట్ ఇంప్లిమెంటేషన్ నైపుణ్యాలను అందిస్తారు. ఇక్కడ 1,300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తారని అంచనా. పుణెలోని గూగుల్ కొత్త ఆఫీస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అర్ష్ గోయల్.. అక్కడ ఉద్యోగుల కోసం అందుబాటులో ఉన్న పలు సౌకర్యాల గురించి తెలియజేశారు. దీనికి సంబంధించి తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. విశాలమైన ఆఫీస్‌లో అందమైన ఇంటీరియర్స్ తోపాటు నోరూరించే ఆహారంతో కేఫ్, గేమ్ జోన్, రిక్రియేషన్ రూమ్ వంటి ఆకట్టుకునే సౌకర్యాలు ఉన్నాయి. ''పుణెలో కొత్తగా ప్రారంభించిన గూగుల్ ఆఫీస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల రోజు ఎలా ఉంటుందో చూడండి'' అంటూ తన ఫోలోవర్లతో వీడియోను పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి 4,70,000 కుపైగా వీవ్స్, 18,000 కుపైగా లైక్‌లను పొందింది. చాలా మంది ఇంటర్నెట్ యూజర్లు గూగుల్ కొత్త ఆఫీస్ ఇష్టపడ్డారు.అక్కడ పని చేయడానికి తాము ఇష్టపడుతున్నట్లు కామెంట్లు పెట్టారు. పుణెలో ఏర్పాటైన ఈ కొత్త ఆఫీస్‌తో గూగుల్‌కి ఇప్పుడు భారత్‌లో హైదరాబాద్‌లోని తన దేశ ప్రధాన కార్యాలయంతో సహా ఐదు కార్యాలయాలు ఉన్నాయి. View this post on Instagram A post shared by Arsh Goyal (@arshgoyalyt) -
హైదరాబాద్‌లో మారుత్ డ్రోన్స్
హైదరాబాద్: డ్రోన్ల తయారీ, సేవలను అందించే మారుత్‌డ్రోన్స్ విస్తరణపై దృష్టి సారించింది. 2026 నాటికి దేశ డ్రోన్ల రంగం టర్నోవర్ రూ.12,000–15,000 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో, తన సిబ్బందిని, మార్కెట్ వాటాను పెంచుకోనున్నట్టు ప్రకటించింది. విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో 9,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించింది. తన డీలర్ల నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్టు, 2024 మార్చి నాటికి డీలర్ల సంఖ్యను 100కు పెంచుకోవాలని, 2028 నాటికి 500కు పెంచుకోనున్నట్టు ప్రకటించింది. కస్టమర్లకు అత్యుత్తమ సేవలు, సహకారం అందించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో సరీ్వస్ సెంటర్లను ఏర్పా టు చేస్తున్నట్టు తెలిపింది. ఐదేళ్లలో 30,000 డ్రోన్ల విక్రయాల లక్ష్యాన్ని చేరుకోనున్నట్టు ప్రకటించింది. -
దక్షిణాఫ్రికాలో విప్రో కొత్త సెంటర్
న్యూఢిల్లీ: ఐటీ సేవల సంస్థ విప్రో తాజాగా నూతన కార్యాలయాన్నిదక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో ప్రారంభించింది. 2007 నుంచి దక్షిణాఫ్రికాలో విప్రో కార్యకలాపాలు సాగిస్తోంది. డిజిటల్ పరివర్తనలో ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా ఈ ప్రాంత కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు మద్దతు ఇస్తోంది. విప్రో ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్ , ఆఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిస్ చెంచహ్ మాట్లాడుతూ, "సెంచరీ సిటీ, కేప్ టౌన్లో కార్యాలయం ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. ఇది దక్షిణాఫ్రికా అంతటా పెట్టుబడులకు, తమ ఉనికిని విస్తరించేలా తమ నిబద్ధతను నొక్కి చెబుతుందన్నారు..అ లాగే ఈ ప్రాంతంలో పెరుగుతున్న క్లయింట్ బేస్ అవసరాలను మరింత మెరుగ్గా పరిష్కరించడానికి, స్థానిక ప్రతిభకు ఆసక్తికరమైన అవకాశాలను అందించడంలో సహాయపడుతుందని వెల్లడించారు. -
ఢిల్లీలో బిఆర్ఎస్ ఆఫీస్ నేడే ప్రారంభం
-
భారత్‌లో ట్రూకాలర్ కార్యాలయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాలర్ ఐడీ వెరిఫికేషన్ ప్లాట్‌ఫామ్ ట్రూకాలర్ బెంగళూరులో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. స్వీడన్‌కు వెలుపల ప్రత్యేకంగా కేంద్రాన్ని నెలకొల్పడం ఇదే తొలిసారి అని కంపెనీ ప్రకటించింది. అలాగే సంస్థకు ఇది రెండవ అతిపెద్ద సెంటర్ కూడా. 30,443 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆఫీసులో 250 మంది సిబ్బంది వరకు పనిచేయడానికి ఏర్పాట్లు ఉన్నాయి. కొన్ని ఫీచర్లను తొలిసారిగా ఇక్కడి కస్టమర్లకు అందించడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సేవలను విస్తరించడానికి ట్రూకాలర్ ఈ సౌకర్యాన్ని ప్రాథమిక కేంద్రంగా ఉపయోగించాలని యోచిస్తోంది. ట్రూకాలర్‌కు 33.8 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీరిలో భారత్ నుంచి 24.6 కోట్ల మంది ఉండడం విశేషం. -
మధురవాడ: వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి నూతన కార్యాలయం ప్రారంభం
-
Hyderabad: కలెక్టరేట్‌కు వీడని గ్రహణం.. శిథిలావస్ధలో పాత భవనం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కలెక్టరేట్‌కు గ్రహణం వీడటంలేదు. కొత్త భవన నిర్మాణానికే కాదు.. కనీసం తరలింపునకు కూడా అడ్డగింపులు తప్పడం లేదు. తాజాగా కొంగరకలాన్‌లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనం పూర్తయ్యింది. కొత్త భవన సముదాయంలోకి మారనుంది. ఇంతకుముందు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఉన్న లక్డీకాపూల్‌లోని కాంప్లెక్స్‌లోకి హైదరాబాద్ కలెక్టరేట్ తరలించాలనే పాత ప్రతిపాదనపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు కొత్తగా నిర్మిస్తున్న సచివాలయంలో అన్ని విభాగాల హెచ్ఓడీ ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుత కలెక్టరేట్ పక్కనే ఉన్న భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయంలోకి కలెక్టరేట్‌ను షిఫ్ట్ చేసే ఆలోచనను కూడా ప్రభుత్వం చేస్తోంది. తరలించాలని ఉన్నా.. హైదరాబాద్ కలెక్టరేట్‌ను లక్డీకాపూల్‌కు తరలించాలనే ప్రతిపాదన 2016లోనే వచ్చింది. కొంగరకలాన్‌కు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ తరలింపుతో ఖాళీ అయ్యే భవనాన్ని హైదరాబాద్ కలెక్టరేట్‌కు ఉయోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్త కాంప్లెక్స్‌లోకి షిఫ్ట్ అయ్యేందుకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. లక్డీకాపూల్ మార్గం నిత్యం వాహనాలతో కిక్కిరిసి ఉండడం.. ధర్నాలు, ఆందోళనలతో ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ఇక్కడికి హైదరాబాద్ కలెక్టరేట్‌ను తరలించేందుకు పోలీసుశాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. చదవండి: బండి సంజయ్ పాదయాత్రపై సస్పెన్స్.. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ.. పదహారేళ్ల క్రితం.. పదహారేళ్ల క్రితం నగరంలోని మాసాబ్ ట్యాంక్ వద్ద ఎకరం ప్రభుత్వ స్థలంలో నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదించారు. నాంపల్లి– అబిడ్స్ రోడ్డులోని కలెక్టరేట్లో పాత భవన సముదాయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో 1990లో నిర్మించిన నాలుగు అంతస్తులతో ఒకే ఒక కొత్త భవనంలో కలెక్టరేట్ విభాగాలు కొనసాగుతున్నాయి. వివిథ శాఖల ఆఫీసులు వేర్వేరుగా దూరంగా ఉండటం.. మొత్తం 32 విభాగాలను నిర్వహించడానికి స్థలం లేకపోవడంతో ఇతర ప్రాంతంలో నిర్మాణం చేపట్టాలని అప్పట్లో భావించారు. చదవండి: కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ.. ఇక్కడి నుంచే కవిత పోటీ చేసే ఛాన్స్? కొత్త కాంప్లెక్స్ కోసం ఏప్రిల్ 2007 లో రూ.10 కోట్లు మంజూరు చేసింది. సుమారు 10 అంతస్తులతో కాంప్లెక్స్‌కు ఆర్అండ్బీ శాఖ, ప్రైవేట్ కన్సల్టెంట్‌తో కలిసి డిజైన్లు సిద్ధం చేసింది. కాంప్లెక్స్ అంచనా వ్యయం రూ.46 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఏ మూలకు సరిపోని పరిస్థితి నెలకొంది. అంతలోనే 2008 మార్చిలో బడ్జెట్ గడువు ముగియడంతో ప్రతిపాదన పెండింగ్‌లో పడింది. ఆ తర్వాత కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నవీన్ మిట్టల్ మరో ఆర్కిటెక్ట్ ద్వారా ఆరు అంతస్తులకు తగ్గించి రూ.22 కోట్ల అంచనా వ్యయంతో 1.80.000 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో సవరించి డిజైన్ చేశారు. సవరించిన ప్రణాళికలు, అంచనాలను తిరిగి ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపించారు. కలెక్టరేట్ కాంప్లెక్స్ భూవేలంతో వచ్చిన మొత్తాన్ని కొత్త కాంప్లెక్స్‌కు ఉపయోగించాలని ప్రభుత్వం సూచించడంతో నిర్మాణం పెండింగ్‌లో పడింది. -
గుడ్‌న్యూస్: త్వరలో ఇండియాలో కాయిన్‌బేస్ ఆఫీస్
వెస్ట్రన్ కంట్రీస్‌లో పెట్టుబడికి న్యూ అడ్రెస్‌గా మారిన క్రిప్టోకరెన్సీ ఇకపై భారత్‌లోనూ తన ప్రభావాన్ని గణనీయంగా పెంచుకోనుంది. ఇందుకు కారణం క్రిప్టోకరెన్సీ లావాదేవీలు నిర్వహించే కాయిన్‌బేస్ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీంతో క్రిప్టోకరెన్సీకి ఇండియాలో రెడ్‌కార్పెట్ పరుచుకోనుంది. ఈ మేరకు కాయిన్ బేస్ సహా వ్యవస్థాపకుడు, సీఈవో బ్రియాన్ ఆర్మ్‌స్ట్రాంగ్ కీలక ప్రకటన చేశారు. ఇండియా కేంద్రంగా అమెరికాలో సంచనలంగా మారిన క్రిప్టో కరెన్సీని ఆసియా మార్కెట్‌కి విస్తరించే పనిలో భాగంగా కాయిన్‌బేస్ సంస్థ ఆసియాలో కార్యాలయం ఏర్పాటు చేయనుంది. ఇందుకు భారత్‌ని ప్రధాన కేంద్రంగా చేసుకోనుంది. అందులో భాగంగా ఇండియాలో కార్యాలయ నిర్మాణ పనులు వేగంగా చేపడుతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆర్మ్‌స్ట్రాంగ్ ప్రకటించారు. అంతేకాదు వచ్చి మాతో చేతులు కలపండి అంటూ ఆహ్వానం పలికారు. క్రిప్టోకి డిమాండ్ అమెరికాకు చెందిన కాయిన్‌బేస్ గ్లోబల్ ఇంటర్నేషనల్ కంపెనీని 2012లో స్థాపించారు. క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేయడం, విక్రయించడం వంటి పనులు ఈ కంపెనీ చేపడుతోంది. కంపెనీ ప్రారంభించిన తర్వాత పదేళ్లకు ఇండియాలోకి కాయిన్‌బేస్ వస్తోంది. కాయిన్‌బేస్ రాకతో క్రిప్టోకరెన్సీ లావదేవీలు ఇండియాలో పెరగవచ్చని, కాయిన్‌బేస్ కంపెనీకి మంచి స్పందనే రావొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే విధంగా డిజిటల్ కాయిన్ మార్కెట్‌కు సంబంధించిన రంగంలో కొత్తగా ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. Coinbase is building out an office in India! 🇮🇳 Amazing team already in place - come join us.https://t.co/yCaJk681pZ — Brian Armstrong (@brian_armstrong) July 2, 2021 -
భవిష్యత్తులోనూ అంతర్జాతీయ పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న అవకాశాల దృష్ట్యా భవిష్యత్తులోనూ అంతర్జాతీయ పెట్టుబడిదారులు తెలంగాణకు వస్తారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఆరేళ్లలో భారతదేశానికి హైదరాబాద్ నూతన టెక్‌హబ్‌గా మారిందని, ఐటీ కార్యకలాపాల తీరుతెన్నులు కూడా మారిపోయాయని చెప్పారు. హైదరాబాద్ ప్రీమియర్ ఐటీ హబ్‌లోని నాలెడ్జ్ సిటీ డల్లాస్ సెంటర్లో నైట్ ఫ్రాంక్ ఇండియా నూతన కార్యాలయాన్ని కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. నగరంలో ఇటీవల మౌలిక వసతులు గణనీయంగా వృద్ధి చెందాయని అన్నారు. కరోనా వల్ల అనిశ్చితి ఏర్పడినా ఐటీ రంగ కార్యకలాపాలతో ముడిపడిన హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ మార్కెటింగ్‌కు డిమాండ్ కొనసాగుతోందని పేర్కొన్నారు. కరోనా సమయంలోనూ రియల్ ఎస్టేట్ రంగం పూర్వ వైభవం సాధించేందుకు ప్రయత్నిస్తుండగా, డేటా సెంటర్స్, వేర్ హౌసెస్ రంగాలు ఊపందుకుంటున్నాయని చెప్పారు. కొన్నేళ్లుగా హైదరాబాద్ దేశంలోనే ముఖ్యమైన బిజినెస్ హబ్‌గా అవతరించిందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ శిశిర్ బైజల్ అన్నారు. ఐటీ రంగంతోపాటు ఇతర రంగాల ఆర్థిక వ్యవస్థలకు హైదరాబాద్ ఆధునిక బిజినెస్ క్లస్టర్‌గా రూపుదిద్దుకుంటోందని నైట్ ఫ్రాంక్ హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో కలసి ఫ్లాగ్షిప్ అధ్యయన నివేదిక ‘డబ్ల్యూఎఫ్‌హెచ్– వర్క్ ఫ్రమ్ హైదరాబాద్’ నివేదికను కేటీఆర్ ఆవిష్కరించారు. డబ్ల్యూఎఫ్‌హెచ్ నివేదికలోని ముఖ్యాంశాలు హైదరాబాద్ వాణిజ్య, రియల్ ఎస్టేట్ మార్కెట్ 2014–2019 మధ్యకాలంలో లావాదేవీలపరంగా 172 శాతం వృద్ధిరేటు సాధించింది. వాణిజ్య మార్కెట్పరంగా 2020 మూడో త్రైమాసికానికి 2 శాతం సానుకూల వృద్ధిని నమోదు చేసింది. పదేళ్లలో నివాసధరలు 5.3 శాతం వృద్ధిరేటుతో పెరుగుతూ కోవిడ్ సమయంలోనూ అద్దెలు స్థిరంగా ఉన్నాయి. అనిశ్చిత మార్కెట్, అమ్మకాలు తక్కువగా ఉన్నా నివాసధరలు తగ్గని రెండు నగరాల్లో బెంగళూరు సరసన హైదరాబాద్ నిలిచింది. గత ఐదేళ్లలో కార్పొరేట్ కార్యకలాపాల వృద్ధితోపాటు వార్షిక ఆఫీస్ స్పేస్ డిమాండ్ పరంగా 2014లో 6వ స్థానంలో ఉండగా, 2019లో 2వ స్థానానికి చేరింది. దేశీయ విమాన ప్రయాణాల వృద్ధిరేటు 2014–15లో 5.5 శాతం కాగా 2019–20 నాటికి 6.4 శాతానికి పెరిగింది. -
హైదరాబాద్‌లో సీజీఎస్ నూతన కార్యాలయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన సాంకేతిక రంగ కంపెనీ కంప్యూటర్ జనరేటెడ్ సొల్యూషన్స్ (సీజీఎస్) హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం 500 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిన్నరలో 800 మందికి, ఐదేళ్లలో 2 వేల మంది ఉద్యోగులను నియమించుకుంటామని ప్రెసిడెంట్ అండ్ సీఈఓ ఫిలిప్ ఫ్రైడ్మన్ తెలిపారు. త్వరలోనే ఈ సెంటర్లో సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ (సీఎస్‌ఓఎస్)ను కూడా నెలకొల్పుతామని.. ఇందులో ఆగ్యుమేటెడ్ రియాలిటీ (ఏఐ) ఆధారిత సేవలందిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సైయంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి, యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయిల్ రీఫ్‌మన్, సీజీఎస్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ ఫిలిప్ ఫ్రైడ్మన్, సీజీఎస్ ఇండియా ఎండీ జీతు భట్టు గురువారం సీజీఎస్ హైదరాబాద్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ సెంటర్ నుంచి మా కస్టమర్లకు ఆర్ అండ్ డీ, అప్లికేషన్ డెవలప్మెంట్, కస్టమర్‌కేర్ సెంటర్ సేవలను అందిస్తున్నామని, మైక్రో సాఫ్ట్, ఐబీఎం, డెల్, ఏటీఅండ్‌టీ, అవయ, తోషిబా, రెమాండ్స్ వంటి కంపెనీలు మా కస్టమర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. దేశంలోని టాప్ టెక్నాలజీ కంపెనీ కాల్‌సెంటర్‌ను ఈ సెంటర్ నుంచే నిర్వహిస్తున్నామని చెప్పారు. సీజీఎస్ గ్లోబల్‌కు యూఎ స్, యూకే, కెనడా, ఇజ్రాయిల్, రొమానియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో కార్యాలయాలున్నాయి. 45 దేశాల్లో ఫ్యాషన్, అపెరల్, ఈ– కామర్స్, హెల్త్‌కేర్, రిటైల్ వంటి పరిశ్రమలకు ఎంటర్ప్రైజెస్ సొల్యూ షన్స్‌ను అందిస్తుంది. ప్రస్తు తం 8 వేల మంది ఉద్యోగులన్నారని.. ఈ ఏడాది ముగింపు నాటికి 10 వేల మందికి చేరుకుంటామని తెలిపారు. -
హైదరాబాద్‌లో క్లీన్ హార్బర్స్ కొత్త కార్యాలయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్విరాన్మెంటల్ సేవల్లో ఉన్న యూఎస్ కంపెనీ క్లీన్ హార్బర్స్ హైదరాబాద్‌లో నూతన కార్యాలయం ఏర్పాటు చేసింది. 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హైటెక్ సిటీలో ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను (జీసీసీ) నెలకొల్పారు. ఉత్తర అమెరికా తర్వాత సంస్థకు ఇదే అతిపెద్ద జీసీసీ. 650 మంది కూర్చునే వీలుగా ఏర్పాటు ఉంది. ప్రస్తుతం ఇక్కడ 300 మంది ఉద్యోగులు ఉన్నారు. 12–18 నెలల్లో ఈ సంఖ్యను రెట్టింపు చేస్తామని క్లీన్ హార్బర్స్ చైర్మన్ అలెన్ మెక్‌కిమ్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఐటీ, హెచ్ఆర్, ఫైనాన్స్, లీగల్ విభాగాల్లో ఈ నియామకాలు ఉంటాయని వివరించారు. క్లీన్ హార్బర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా 7,000 కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. హైదరాబాద్ సెంటర్ ఈ క్లయింట్లకు సేవలు అందిస్తుందన్నారు. కంపెనీ ఉత్పత్తులు, సేవలను భారత్‌లో పరిచయం చేసే విషయమై అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. నూతన కార్యాలయం కోసం రూ.30 కోట్లు వెచ్చించామని కంపెనీ కంట్రీ మేనేజర్ అవినాశ్ సామృత్ తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకు క్లీన్ హార్బర్స్ రూ.50 కోట్లు ఖర్చు చేసిందన్నారు. -
ఫ్లిప్‌కార్ట్ అతిపెద్ద కార్యాలయం ఇదే!
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బెంగళూరు అతిపెద్ద కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. బెంగళూరులోని ఎంబసీ టెక్ విలేజ్‌లో అధునాతన వసతులతో తమ కొత్త క్యాంపస్‌ను తీర్చిదిద్దామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ నిర్మాణంతో బెంగళూరులో వేర్వేరు ప్రాంతాల్లోని తమ కార్యాలయాలను ఎంబసీ టెక్ విలేజ్ ప్రాంగణానికి తరలించామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ‘బెటర్.టుగెదర్’ థీమ్ కింద ఫ్లిప్‌కార్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ‘బెంగళూరు వ్యాప్తంగా ఉన్న ఆపీసులన్నింటిన్నీ ఒకే ప్రాంగణానికి చేర్చాలని మేము నిర్ణయించాం. దీనివల్ల నిర్వాహక సామర్థ్యం మెరుగు పడుతుంది. సిబ్బంది-బృందాల మధ్య సమన్వయం అధికమవుతుంది’ అని ఫ్లిప్‌కార్ట్ మార్కెట్‌ప్లేస్ అధినేత అనిల్ గోటేటి పేర్కొన్నారు. ప్రస్తుతం ఏర్పాటుచేసిన కొత్త ప్రాంగణానికి తమ టీమ్‌ను తరలించామని, కొత్త క్యాంపస్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యామని కూడా తెలిపారు. 7,387 మంది పనిచేసేందుకు వీలుగా 8.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కొత్త కార్యాలయం ఉంది. మొత్తం 30 ఫ్లోర్లతో ఈ ఆఫీసు ఉంది. ఈ కార్యాలయాన్ని రూపొందించే సమయంలో ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు, ఐడియాలను స్వీకరించామని గోటేటి తెలిపారు. -
12 ఏళ్ల తర్వాత నూతన భవనంలోకి..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఉనికిలోకి వచ్చిన 12 సంవత్సరాల తర్వాత మంగళవారం సొంత భవనంలోకి మారనుంది. అత్యాధునిక హంగులతో కూడిన సీఐఐ నూతన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభిస్తారు. ఇప్పటివరకూ ఆగస్ట్ క్రాంతిభవన్, పాత జేఎన్‌యూ బిల్డింగ్‌ల నుంచి సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి. సువిశాల ప్రాంగణంలో నూతన భవనాన్ని నిర్మించారు. త మ కేసుల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా పెద్దసంఖ్యలో పిటిషనర్లు తరలివస్తున్న క్రమంలో పాత కార్యాలయం రద్దీని అధిగమించకపోవడంతో నూతన భవనాన్ని నిర్మించారు. మునిర్కాలో కొలువుతీరిన సీఐసీ భవనంలో అత్యాధునిక సాంకేతక సదుపాయాలున్నాయని..దీని నిర్మాణాన్ని నేషనల్ బిల్డింగ్ కన్స్ర్టక్షన్ కార్పొరేషన్ రికార్డు సమయంలో పూర్తిచేసిందని సీఐసీ వర్గాలు పేర్కొన్నాయి. ఐదంతస్తులతో కూడిన ఈ భవనంలో ఐటీ, వీడియో కాన్ఫరెన్స్ వంటి సదుపాయాలున్న హియరింగ్ రూమ్‌లు అందుబాటులోకి రానున్నాయి. -
ప్రజాస్వామ్యమే బీజేపీ ఆయుధం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీతోపాటు మాతృసంస్థ జనసంఘ్ ఎల్లప్పుడూ జాతి హితమే లక్ష్యంగా ఉద్యమాలు సాగించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పార్టీ విజయానికి ప్రజాస్వామ్య విలువలే కారణమన్నారు. ఆదివారం ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లో నిర్మించిన పార్టీ నూతన కేంద్ర కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. 1951లో భారతీయ జనసంఘ్ స్థాపించిన నాటి నుంచి ఆశయ సాధనే లక్ష్యంగా సాగుతోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని అటల్ బిహారీ వాజ్‌పేయి విజయవంతంగా నడిపారన్నారు. ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటూ, దేశ ప్రజల్లో కొత్త ఆశలను ఆయన నింపారని కొనియాడారు. ప్రజాస్వామ్యం మన రక్తంలోనే ఉందన్నారు. కార్యకర్తలే పార్టీ కి ఆత్మవంటి వారని పేర్కొన్నారు. ఏడాదిన్నరలోనే మూడంతస్తుల పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు కృషి చేసిన అమిత్‌షాను, ఆయన బృందాన్ని ప్రధాని మెచ్చుకున్నారు. అతి పెద్ద కార్యాలయం: అమిత్‌షా దాదాపు 1.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న పార్టీ కొత్త కార్యాలయం ప్రపంచంలోనే అతి పెద్దది అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలిపారు. కొత్త కార్యాలయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విశాలమైన సోషల్ మీడియా ఆఫీసు, అన్ని రాష్ట్రాల పార్టీ కార్యాలయాలతో ఆన్లైన్ అనుసంధానత ఉందన్నారు. దేశంలోని మొత్తం 694 జిల్లాలకు గాను 635 జిల్లాల్లో ఏడాదిలోగా పార్టీ సొంత కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీతోపాటు కేంద్ర మంత్రులు, నేతలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజధానిలోని ల్యూటెన్స్ ప్రాంతం నుంచి పార్టీ కార్యాలయాన్ని బయటకు తరలించిన మొదటి జాతీయ పార్టీ బీజేపీయే. దీంతో ల్యూటెన్స్ జోన్‌లోని నివాస ప్రాంతాల్లో దశాబ్దాలుగా కార్యకలాపాలు నెరుపుతున్న పార్టీలపై ఒత్తిడి పెరిగినట్లయింది. -
ఉద్యోగులను పెంచుతున్న ఫేస్బుక్
లండన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యాజమాన్యం బ్రిటన్‌లో సేవల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తోంది. లండన్‌లో కొత్తగా హెడ్ ఆఫీసును ప్రారంభించబోతోంది. అదనంగా మరో 500 మంది ఉద్యోగులను నియమించనుంది. ఫేస్బుక్ యూరప్ చీఫ్ నికోలా మెండెల్సోన్ ఈ విషయం చెప్పారు. ‘2007లో లండన్‌లో అందుబాటులో ఉన్న సిబ్బందితో కార్యకలాపాలను ప్రారంభించాం. రానురాను ఉద్యోగులను పెంచుతూ సేవలను విస్తృతం చేశాం. వచ్చే ఏడాది చివరి నాటికి కొత్తగా హెడ్ క్వార్టర్స్‌ను ప్రారంభిస్తాం. ఉద్యోగులను పెంచుతాం’ అని మెండెల్సోన్ చెప్పారు. యూరప్ నుంచి బ్రిటన్ వైదొలగాలంటూ ఆ దేశ ప్రజలు (బ్రెగ్జిట్) తీర్పుచెప్పిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు, ఇతర సంస్థలు కొత్తగా కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఫేస్బుక్ కు బ్రిటన్ ముఖ్యమైన దేశమని మెండెల్సోన్ చెప్పారు. -
మంత్రి పల్లెకు ఎన్జీవో నాయకుల అభినందన
విజయవాడ (భవానీపురం) : సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని ఎన్జీవో నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. నూతన రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో శనివారం ఆయన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా నాయకులు ఆయనను కలిసి సాయిబాబా చిత్రపటాన్ని బహూకరించారు. మంత్రిని కలిసి అభినందనలు తెలిపిన వారిలో ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు, జిల్లా నాయకుడు ఎ. విద్యాసాగర్ తదితరులు ఉన్నారు. -
ఎక్సలెంట్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీస్
నూతన కార్యాలయం ప్రారంభం సాక్షి, హైదరాబాద్: అన్ని బీమా కంపెనీల సేవలనూ... అన్ని రకాల బీమాలనూ ఒకేచోట అందిస్తూ రైతులు, ఉద్యోగులకు బీమాను మరింత చేరువ చేసిందంటూ ఎక్సలెంట్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీస్‌ను (ఈఐబీఎస్‌ఎల్) ప్రముఖ న్యాయవాది వి.సురేందర్‌రావు కొనియాడారు. సోమవారం బంజారాహిల్స్‌లోని లుంబినీ మాల్లో ఈఐబీఎస్‌ఎల్ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వినియోగదారులకు అవసరమైన బీమా కంపెనీలు, పాలసీల వివరాలను అందించడంతో పాటు కస్టమర్ల అవసరాలకు తగ్గ బీమా సేవలందించటం ఈఐబీఎస్‌ఎల్ ప్రత్యేకతన్నారు. ప్రమాద, జీవిత, సాధారణ, వాహన బీమాకు సంబంధించి కస్టమర్లకు క్లెయిములు అందేలానూ సంస్థ చూస్తుందని ఈఐబీఎస్‌ఎల్ చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్ వి.సుధాకర్ చెప్పారు.ఇప్పటికే ప్రభుత్వ సహకారంతో 6 లక్షల మంది రైతులకు ఓరియంటల్, ఇతర సంస్థల ద్వారా బీమా సౌకర్యం కల్పించడంలో ఈఐబీఎస్‌ఎల్ కీలకంగా వ్యవహరించిందన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ జన్నత్ హుస్సేన్, బజాజ్ అలయంజ్ వైస్ ప్రెసిడెంట్ సీఆర్ మోహన్, ఈఐబీఎస్‌ఎల్ చీఫ్ కో ఆర్డినేటింగ్ అధికారి డాక్టర్ వెంకట్‌రెడ్డి, కన్సల్టెంట్ గజ్జల అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తన కేబిన్‌లోకి సీఎం
సాక్షి, ముంబై: సుదీర్ఘ కాలం తర్వాత ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మంత్రాయలోని ఆరో అంతస్తులోగల తన కేబిన్‌లోకి మారారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సాదాసీదాగా మారిపోయారు. కేవలం గుమ్మానికి పూలదండవేశారు. 2012 జూన్ 21న మంత్రాయల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నాలుగు, ఐదు, ఆరో అంతస్తులు పూర్తిగా కాలిబూడిదైన విషయం తెలిసిందే. దీంతో మంత్రుల కేబిన్లన్నీ ఇతర అంతస్తుల్లోకి మార్చారు. అక్కడి నుంచే కార్యకలాపాలను కొనసాగించారు. ఆధునిక హంగులతో ఈ అంతస్తులన్నింటినీ కొత్తగా తీర్చిదిద్దారు. ఆరో అంతస్తులోని 21,200 చదరపుటడుగుల స్థలంలో కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. ఇందులో 40 మంది ఉన్నతాధికారులు, 100 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల్లో ప్రధాన కార్యదర్శి స్థాయి మొదలుకుని ప్రధాన కార్యదర్శి, అసిస్టెంట్ కార్యదర్శి, డిప్యూటీ కార్యదర్శి, ప్రత్యేక కార్యనిర్వాహక అధికారులు, వ్యక్తిగత కార్యదర్శులు, ప్రజా సంబంధాల అధికారులున్నారు. వీరితోపాటు ఇంటర్వ్యూలు నిర్వహణ, సమావేశాలు, ఫైళ్లను భద్రపరిచేందుకు కేబిన్లు ఉన్నాయి. సందర్శకుల కోసం ప్రత్యేకంగా కేబిన్లను నిర్మించారు.