మంత్రి పల్లెకు ఎన్‌జీవో నాయకుల అభినందన
విజయవాడ (భవానీపురం) :
సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని ఎన్‌జీవో నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. నూతన రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో శనివారం ఆయన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా నాయకులు ఆయనను కలిసి సాయిబాబా చిత్రపటాన్ని బహూకరించారు. మంత్రిని కలిసి అభినందనలు తెలిపిన వారిలో ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు, జిల్లా నాయకుడు ఎ. విద్యాసాగర్ తదితరులు ఉన్నారు.