కరోనా సమయంలో భారీ నష్టాలను చవి చూసిన దిగ్గజ కంపెనీలు కోలుకుంటున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఐటీ కంపెనీ 'యూఎస్‌టీ' తన కార్యకలాపాలను విస్తరించడంతో భాగంగా.. బెంగళూరులో రెండవ ఆఫీస్ ప్రారంభించింది. సుమారు 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న యూఎస్‌టీ కొత్త కార్యలయం 300 మంది ఉద్యోగులు విధులు నిర్వహించడానికి అనుకూలంగా ఉంది.
కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడంలో భాగంగానే.. ఈ కొత్త ఆఫీస్ ప్రారంభించినట్లు సమాచారం. యూఎస్‌టీ తన కొచ్చి ప్రధాన కేంద్రంలో వచ్చే ఐదేళ్ల నాటికి సుమారు 6,000 మందికి పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఇక్కడ 2,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. కాగా కేరళలోని తిరువనంతపురం కేంద్రంలో సుమారు 7,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఇదీ చదవండి: రూ. 34కే బియ్యం.. మళ్ళీ భారత్ బ్రాండ్ సేల్స్
2012లో తన కార్యకలాపాలను ప్రారంభించిన యూఎస్‌టీ.. బెంగళూరులో ప్రస్తుతం 6000 కంటే ఎక్కువమంది ఉద్యోగులను కలిగి ఉంది. ఈ కంపెనీ సెమీకండక్టర్, హెల్త్‌కేర్, టెక్నాలజీ, లాజిస్టిక్స్, హైటెక్, రిటైల్, బీఎఫ్ఎస్ఐ రంగాల్లో సేవలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ భారతదేశం అంతటా 20000 మంది కంటే ఎక్కువ ఉద్యోగులను కలిగి ఉంది. కాగా ప్రపంచ వ్యాప్తంగా 30000 కంటే ఎక్కువ ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment