ఎక్సలెంట్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీస్ | Excellent Insurance Broking Service | Sakshi
Sakshi News home page

ఎక్సలెంట్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీస్

Published Tue, Jan 19 2016 2:33 AM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM

ఎక్సలెంట్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీస్

ఎక్సలెంట్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీస్

నూతన కార్యాలయం ప్రారంభం
 సాక్షి, హైదరాబాద్: అన్ని బీమా కంపెనీల సేవలనూ... అన్ని రకాల బీమాలనూ ఒకేచోట అందిస్తూ రైతులు, ఉద్యోగులకు బీమాను మరింత చేరువ చేసిందంటూ ఎక్సలెంట్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీస్‌ను (ఈఐబీఎస్‌ఎల్) ప్రముఖ న్యాయవాది వి.సురేందర్‌రావు కొనియాడారు. సోమవారం బంజారాహిల్స్‌లోని లుంబినీ మాల్‌లో ఈఐబీఎస్‌ఎల్ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వినియోగదారులకు అవసరమైన బీమా కంపెనీలు, పాలసీల వివరాలను అందించడంతో పాటు కస్టమర్ల అవసరాలకు తగ్గ బీమా సేవలందించటం ఈఐబీఎస్‌ఎల్ ప్రత్యేకతన్నారు.

ప్రమాద, జీవిత, సాధారణ, వాహన బీమాకు సంబంధించి కస్టమర్లకు క్లెయిములు అందేలానూ సంస్థ చూస్తుందని ఈఐబీఎస్‌ఎల్ చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్ వి.సుధాకర్ చెప్పారు.ఇప్పటికే ప్రభుత్వ సహకారంతో 6 లక్షల మంది రైతులకు ఓరియంటల్, ఇతర సంస్థల ద్వారా బీమా సౌకర్యం కల్పించడంలో ఈఐబీఎస్‌ఎల్ కీలకంగా వ్యవహరించిందన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ జన్నత్ హుస్సేన్, బజాజ్ అలయంజ్ వైస్ ప్రెసిడెంట్ సీఆర్ మోహన్, ఈఐబీఎస్‌ఎల్ చీఫ్ కో ఆర్డినేటింగ్ అధికారి డాక్టర్ వెంకట్‌రెడ్డి, కన్సల్టెంట్  గజ్జల అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement