![Storable Expands its Footprint in India - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/30/STORABLE-INC.jpg.webp?itok=n_i-KIj_)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెల్ఫ్–స్టోరేజ్ టెక్నాలజీ సొల్యూషన్స్ అందించే అమెరికన్ సంస్థ స్టోరబుల్ భారత్‌లో తమ కార్యకలాపాలు విస్తరిస్తోంది. హైదరాబాద్‌లో 15వేల చ.అ. విస్తీర్ణంలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది.
గతేడాదే హైదరాబాద్‌లో తమ ఏషియా జీసీసీని స్టోరబుల్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ 60 మంది ఉద్యోగులు ఉండగా, ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ సంఖ్యను 120కి పెంచుకోనున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ చార్లీ మారియట్ తెలిపారు. ఇంజనీరింగ్, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment