Storage solutions
-
హైరింగ్ ప్రణాళికల్లో స్టోరబుల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెల్ఫ్–స్టోరేజ్ టెక్నాలజీ సొల్యూషన్స్ అందించే అమెరికన్ సంస్థ స్టోరబుల్ భారత్‌లో తమ కార్యకలాపాలు విస్తరిస్తోంది. హైదరాబాద్‌లో 15వేల చ.అ. విస్తీర్ణంలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. గతేడాదే హైదరాబాద్‌లో తమ ఏషియా జీసీసీని స్టోరబుల్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ 60 మంది ఉద్యోగులు ఉండగా, ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ సంఖ్యను 120కి పెంచుకోనున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ చార్లీ మారియట్ తెలిపారు. ఇంజనీరింగ్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నట్లు వివరించారు. -
మీ ఇ-మెయిల్ బాక్స్ నిండిపోయిందా, సింగిల్ క్లిక్‌తో ఇలా చేయండి!
బొత్తిగా అక్కర్లేని ఇ–మెయిల్స్ వస్తూనే ఉంటాయి. వాటి మానాన అవి పడి ఉంటాయిలే...అనుకోవడానికి లేదు. ఫ్రీ స్టోరేజ్ స్పేస్ నిండిపోతే సమస్య! ఈ నేపథ్యంలో వాటిని డిలీట్ చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. మాన్యువల్‌గా పాత ఇ–మెయిల్స్‌ను వన్–బై వన్ సెలెక్ట్ చేసుకొని, డిలీట్ చేయడం కష్టం అనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఒకే టైమ్‌లో ఎక్కువ మొత్తంలో ఇ–మెయిల్స్‌ను డిలీట్ చేయడానికి ఒక ఫిల్టర్‌ను సెట్ చేసుకోవాలి. సెర్చ్బార్లో ఇ–మెయిల్ అడ్రస్ ఎంటర్ చేశాక ‘ఆల్’ ట్యాబ్‌ను సెలెక్ట్ చేసుకొని ‘డిలీట్’ ఐకాన్‌ను నొక్కాలి. ఇక లార్జ్ ఇ –మెయిల్స్ డిలీట్ చేయడానికి... ►జీమెయిల్ ఓపెన్ చేసి ‘ఎటాచ్మెంట్ లార్జర్: 10ఎమ్’ అని టైప్ చేయాలి. ►లార్జ్ ఇ– మెయిల్ ‘మెయిల్ బాక్స్’లో కనిపిస్తాయి. ►వీటిని సెలెక్ట్ చేసుకొని, ముఖ్యమైనవి, డిలీట్ వద్దనుకుంటున్నవి ‘అన్మార్క్’ చేయాలి ►డిలీట్ బటన్ నొక్కాలి. ►‘ఎంప్టీ ట్రాష్’ బటన్ నొక్కాలి.