న్యూఢిల్లీ: ఐటీ సేవల సంస్థ విప్రో తాజాగా నూతన కార్యాలయాన్నిదక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో ప్రారంభించింది. 2007 నుంచి దక్షిణాఫ్రికాలో విప్రో కార్యకలాపాలు సాగిస్తోంది. డిజిటల్ పరివర్తనలో ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా ఈ ప్రాంత కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు మద్దతు ఇస్తోంది.
విప్రో ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్ , ఆఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిస్ చెంచహ్ మాట్లాడుతూ, "సెంచరీ సిటీ, కేప్ టౌన్లో కార్యాలయం ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. ఇది దక్షిణాఫ్రికా అంతటా పెట్టుబడులకు, తమ ఉనికిని విస్తరించేలా తమ నిబద్ధతను నొక్కి చెబుతుందన్నారు..అ లాగే ఈ ప్రాంతంలో పెరుగుతున్న క్లయింట్ బేస్ అవసరాలను మరింత మెరుగ్గా పరిష్కరించడానికి, స్థానిక ప్రతిభకు ఆసక్తికరమైన అవకాశాలను అందించడంలో సహాయపడుతుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment