హైదరాబాద్: డ్రోన్ల తయారీ, సేవలను అందించే మారుత్‌డ్రోన్స్ విస్తరణపై దృష్టి సారించింది. 2026 నాటికి దేశ డ్రోన్ల రంగం టర్నోవర్ రూ.12,000–15,000 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో, తన సిబ్బందిని, మార్కెట్ వాటాను పెంచుకోనున్నట్టు ప్రకటించింది.
విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో 9,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించింది. తన డీలర్ల నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్టు, 2024 మార్చి నాటికి డీలర్ల సంఖ్యను 100కు పెంచుకోవాలని, 2028 నాటికి 500కు పెంచుకోనున్నట్టు ప్రకటించింది. కస్టమర్లకు అత్యుత్తమ సేవలు, సహకారం అందించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో సరీ్వస్ సెంటర్లను ఏర్పా టు చేస్తున్నట్టు తెలిపింది. ఐదేళ్లలో 30,000 డ్రోన్ల విక్రయాల లక్ష్యాన్ని చేరుకోనున్నట్టు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment