న్యూఢిల్లీ: ఢిల్లీలోని లూటెన్స్ ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి కొత్త కార్యాలయాన్ని కేటాయించినట్లు అధికారవర్గాలు గురువారం తెలిపాయి. పండిట్ రవి శంకర్ శుక్లా లేన్‌లోని ఒకటో నంబర్ బంగ్లాను ఆప్‌కు ఇచ్చినట్లు చెప్పాయి. గతంలో రౌజ్ అవెన్యూ ప్రాంతంలో ఆప్ కార్యాలయం ఉండేది.
జాతీయ గుర్తింపు కోల్పోవడంతో ఆ కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది జాతీయ పార్టీగా తిరిగి గుర్తింపు సాధించిన ఆప్‌కు హోదాకు తగ్గట్టుగా మరో చోట కార్యాలయం కేటాయించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. ఈ విషయాన్ని జూలై 25వ తేదీలోగా తేల్చాలంటూ ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment