Lutyens Zone
-
లూటెన్స్‌లో ఆప్ నూతన కార్యాలయం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని లూటెన్స్ ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి కొత్త కార్యాలయాన్ని కేటాయించినట్లు అధికారవర్గాలు గురువారం తెలిపాయి. పండిట్ రవి శంకర్ శుక్లా లేన్‌లోని ఒకటో నంబర్ బంగ్లాను ఆప్‌కు ఇచ్చినట్లు చెప్పాయి. గతంలో రౌజ్ అవెన్యూ ప్రాంతంలో ఆప్ కార్యాలయం ఉండేది. జాతీయ గుర్తింపు కోల్పోవడంతో ఆ కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది జాతీయ పార్టీగా తిరిగి గుర్తింపు సాధించిన ఆప్‌కు హోదాకు తగ్గట్టుగా మరో చోట కార్యాలయం కేటాయించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. ఈ విషయాన్ని జూలై 25వ తేదీలోగా తేల్చాలంటూ ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. -
పేటీఎం బాస్ ఖరీదైన ఇల్లు.. ధరెంతో తెలుసా?
బెంగళూరు : నోట్ల రద్దు అనంతరం పేటీఎంకు పెరిగిన ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ సంపద కూడా అంతే మొత్తంలో దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆయన దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ లో ఒకటైన న్యూఢిల్లీ గల్ఫ్ లింక్స్ లో ఓ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నారు. దీని విలువ దాదాపు రూ.82 కోట్లు. లుటియెన్స్ జోన్ లో కనీసం 6000 చదరపు అడుగుల ప్రాపర్టీపై ఎంఓయూ కుదుర్చుకున్నారని, ఇప్పటికే ఆయన కొంతమొత్తం చెల్లించినట్టు తెలుస్తోంది. అయితే ఇంకా ఈ లావాదేవీ రిజిస్ట్రర్ కాలేదు. ఫ్లిప్ కార్ట్ అనంతరం రెండో అత్యంత విలువైన ఎంటర్ ప్రైజ్ గా పేటీఎంకు పేరుంది. దీనికి వ్యవస్థాపకుడైన విజయ్ శేఖర్ శర్మకు కూడా మార్కెట్లో మంచి పేరును సంపాదించారు. ఫోర్బ్స్ జాబితాలో అతిపిన్న భారత బిలీనియర్ గా శర్మ చోటుదక్కించుకున్నారు. ఈయన నికర సంపద 1.3 బిలియన్ డాలర్లు. గతేడాది శర్మ సంపద 162 శాతం పెరిగింది. ఇటీవల కాలంలో ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకులు బిన్నీ, సచిన్ బన్సాల్ లు కూడా మల్టి-మిలియన్ డాలర్ రెసిడెన్షియల్ ఇన్వెస్ట్ మెంట్లు చేపట్టారు. శర్మ ఈ ఆస్తిని కొనుగోలు చేయడం కేవలం అతిపెద్ద విషయమే కాక, లుటియెన్స్ జోన్ లో అడుగుపెట్టిన ఇంటర్నెట్ బిలియనర్ గా కూడా విజయ్ శేఖర్ శర్మ మార్క్ కొట్టేయనున్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్పాయి. 1000 బంగ్లాలతో 3000 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో 70 ఎకరాలను మాత్రమే ప్రైవేట్ గా వాడతారు. -
లుట్యెన్స్ జోన్లో బంగ్లా కోసం కేజ్రీవాల్ అన్వేషణ
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్... లుట్యెన్స్ జోన్లో భారీ బంగ్లా కోసం అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం ఘాజియాబాద్‌లోని కౌశాంబీలో తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో నివసిస్తున్న కేజ్రీవాల్ నగరంలో అధికారిక నివాసానికి మకాం మార్చాలనుకుంటున్నారు. మహాదేవ్ రోడ్, బిషంభర్ దాస్మార్గ్, పండిట్ పంత్ మార్గ్లలోని పెద్ద పెద్ద బంగ్లాలను ముఖ్యమంత్రి కార్యాలయం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తనకు వ్యక్తిగతంగా చిన్న ఇల్లు సరిపోయినప్పటికీ ముఖ్యమంత్రిగా పనిచేయడానికి, ఇంటికి వచ్చే వారిని కలుసుకునేందుకు పెద్ద బంగ్లా అవసరమని కేజ్రీవాల్ తెలిపారు. అయితే విలాసవంతమైన బంగ్లాలో ఉండబోనని కూడా స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసం కోసం జరుపుతున్న అన్వేషణ ఓ కొలిక్కి వచ్చిందని తెలిసింది. ఆయన మధురా రోడ్‌లోని ఏడీ-17 బంగ్లాను ఎంచుకున్నారని, దానిని సిసోడియాకు కేటాయించాల్సిందిగా ఢిల్లీ సర్కారు... కేంద్ర పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖను కోరినట్లు చెబుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇందుకు ఆమోదం తెలిపితే ఈ బంగ్లా మనీష్ సిసోడియా అధికారిక నివాసం కానుంది. గత కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్న ఈ బంగ్లా... ప్రస్తుతం సెంట్రల్ పూల్ కింద ఉంది. ఈ బంగ్లాలో మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఒకప్పుడు నివసించారు. 1998లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన పుడు షీలాదీక్షిత్ ఈ ఇంటికి మకాం మార్చి ఆరేళ్లపాటు నివసించారు. ఆ తరువాత మోతీలాల్ మార్గ్‌కు మారారు. రెండు అంతస్తులున్న ఈ బంగ్లాలో రెండు లాన్లు, నాలుగు సర్వెంట్ క్వార్టర్లు ఉన్నాయి.మంత్రుల కోసం ఢిల్లీ సర్కారు ఆరు బంగ్లాలను నిర్మించింది. అయితే రాజ్‌నివాస్ వద్ద నివసించిన ఈ సువిశాలమైన బంగ్లాలో ఉండడానికి మంత్రులెవరూ ఆసక్తి చూపడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా మంత్రులు ఈ బంగ్లాల్లో ఉండ డానికి నిరాకరించారు. 49 రోజుల పాలన సమయంలో కూడా ఆప్ మంత్రులు కూడా వాటిలో ఉండడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు కూడా ఆప్ మంత్రులకు ఈ బంగ్లాల్లో ఉండాలనే ఆలోచనేదీ లేదని అంటున్నారు. -
ఆ అవసరం లేదు!
సాక్షి, ముంబై: వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం మార్చాల్సిన అవసరం లేదని మాజీ కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్ షిండే అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత షిండే మొదటిసారిగా షోలాపూర్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో నేతృత్వం మారిస్తే పార్టీకి మరింత నష్టం తప్పదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసిననంత మాత్రాన శాసనసభ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని భావించడం సరైన అభిప్రాయం కాదన్నారు. శాసనసభ ఎన్నికల్లో 1974 నుంచి శాసనసభ, రాజ్యసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేశానని, పోటీచేసిన ప్రతిసారీ తనను విజయం వరించిందన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభంజనం ఉన్నప్పటికీ షోలాపూర్ వాసులు తనకు భారీగా ఓట్లు వేశారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవం గురించి మాట్లాడుతూ... ఆ రోజు జరిగిన ఉత్సవానికి సార్క్ దేశాల ప్రముఖులను ఆహ్వానించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఇలా ఆహ్వానించడంవల్ల వివిధ దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయని, అంతర్జాతీయ స్థాయిలో మన భారత్ పేరు మార్మోగుతుందన్నారు. అలా ఆహ్వానించడం ఆయన గొప్పతనమని కొనియాడారు. మోడీ ప్రమాణస్వీకార ముహూర్తాన్ని ఆలస్యంగా వెల్లడించడంతోనే తాను కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని, అయితే మోడీని అభినందించి, శుభాకాంక్షలు తెలిపానన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తలెత్తిన పరిస్థితిపై మాట్లాడుతూ... ‘లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వర్గీయుల నుంచి ముప్పు పొంచి ఉందని నాకు ముందే సమాచారం అందింది. దీంతో అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశాను. చిన్న చిన్న సభలు, సమావేశాలు నిర్వహించాను. 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎన్నికల సమయంలో రెండు రోజులకు మించి ఎప్పుడూ బస చేయలేదు. కానీ మొదటిసారి 12 రోజులు షోలాపూర్ నియోజకవర్గంలోనే మకాం వేశాను. అయినప్పటికీ పార్టీ వర్గీయులు మోసం చేయడంవల్ల మొదటిసారి పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింద’ని షిండే ఆవేదన వ్యక్తం చేశారు. -
‘హెరిటేజ్ సిటీ’ హోదాకు దెబ్బ!
న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి పురాతన కట్టడాలను కూల్చేస్తే, ప్రపంచ వారసత్వ నగరంగా పేరుగాంచి న ఢిల్లీ, తన ఉనికిని కోల్పోతుందేమోనని పలువురు సనాతన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లూటియెన్స్ జోన్లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి 500 బంగ్లాలను కూలగొట్టేయాలని నిర్ణయిం చిన విషయం తెలిసిందే. కాగా ప్రపంచ వారసత్వ హోదాకు నగరం పేరును ప్రతిపాదిస్తూ పంపిన వివరణ పత్రంలో లూటియెన్స్ బంగ్లా జోన్ పేరు ను పేర్కొన్నామే తప్ప బంగ్లాలను కాదనిది ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్ (ఇంటాక్) ఢిల్లీ కన్వీనర్ ఎ.జి.కె.మీనన్ తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం కోరిక మేరకు ఇంటాక్ అధికారులు ఢిల్లీకి హెరిటేజ్ హోదా కోసం కసరత్తు చేస్తున్నారు. మొఘల్ కాలం నాటి షహజాన్‌బాద్, లూటియెన్స్ జోన్లను కలిపి వివరణ పత్రం తయారుచేశారు. కాగా, ‘లూటియెన్స్ బంగ్లాలను వివరణ పత్రంలో పేర్కొని ఉంటే వాటి కూల్చివేతతో ‘హెరిటేజ్ హోదా’కు ఆటంకం ఏర్పడుతుందనేది వాస్తవమే.. కాని మేం నగరం మొత్తం ప్లాన్‌ను వివరణ పత్రం లో పొందుపరిచాం. అలాగే లూటియెన్స్‌లో పాత కట్టడాలను కూల్చివేసి అదే రూపంలో కొత్తగా నిర్మిస్తున్నాం.. దానివల్ల హెరిటేజ్ హోదాకు ఇబ్బంది తలెత్తే ప్రశ్నేలేదు..’ అని మీనన్ తెలిపారు. లూటియెన్స్ జోన్లో సుమారు 90 ఏళ్ల కిందట నిర్మించిన 516 బంగ్లాలు ఉన్నాయి. వాటిని కూలగొట్టి భూకంపాలను తట్టుకునేవిధంగా కొత్త బంగ్లాలను నిర్మిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి రూ.3 వేల కోట్లు ఖర్చు కాగలవని ఢిల్లీ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. కొత్త భవనాలను దశల వారీగా 20 ఏళ్ల కాలవ్యవధిలో నిర్మించాలని ప్రతిపాదించింది. మొదటి దశలో 29 బంగ్లాల పను లు చేపడుతున్నారు. మిగిలిన వాటి పనులను త్వరలోనే చేపడతామని మీనన్ వివరించారు.