‘హెరిటేజ్ సిటీ’ హోదాకు దెబ్బ!
Published Mon, Jan 13 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి పురాతన కట్టడాలను కూల్చేస్తే, ప్రపంచ వారసత్వ నగరంగా పేరుగాంచి న ఢిల్లీ, తన ఉనికిని కోల్పోతుందేమోనని పలువురు సనాతన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లూటియెన్స్ జోన్‌లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి 500 బంగ్లాలను కూలగొట్టేయాలని నిర్ణయిం చిన విషయం తెలిసిందే. కాగా ప్రపంచ వారసత్వ హోదాకు నగరం పేరును ప్రతిపాదిస్తూ పంపిన వివరణ పత్రంలో లూటియెన్స్ బంగ్లా జోన్ పేరు ను పేర్కొన్నామే తప్ప బంగ్లాలను కాదనిది ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్ (ఇంటాక్) ఢిల్లీ కన్వీనర్ ఎ.జి.కె.మీనన్ తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం కోరిక మేరకు ఇంటాక్ అధికారులు ఢిల్లీకి హెరిటేజ్ హోదా కోసం కసరత్తు చేస్తున్నారు. మొఘల్ కాలం నాటి షహజాన్‌బాద్, లూటియెన్స్ జోన్‌లను కలిపి వివరణ పత్రం తయారుచేశారు.
కాగా, ‘లూటియెన్స్ బంగ్లాలను వివరణ పత్రంలో పేర్కొని ఉంటే వాటి కూల్చివేతతో ‘హెరిటేజ్ హోదా’కు ఆటంకం ఏర్పడుతుందనేది వాస్తవమే.. కాని మేం నగరం మొత్తం ప్లాన్‌ను వివరణ పత్రం లో పొందుపరిచాం. అలాగే లూటియెన్స్‌లో పాత కట్టడాలను కూల్చివేసి అదే రూపంలో కొత్తగా నిర్మిస్తున్నాం.. దానివల్ల హెరిటేజ్ హోదాకు ఇబ్బంది తలెత్తే ప్రశ్నేలేదు..’ అని మీనన్ తెలిపారు. లూటియెన్స్ జోన్‌లో సుమారు 90 ఏళ్ల కిందట నిర్మించిన 516 బంగ్లాలు ఉన్నాయి. వాటిని కూలగొట్టి భూకంపాలను తట్టుకునేవిధంగా కొత్త బంగ్లాలను నిర్మిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి రూ.3 వేల కోట్లు ఖర్చు కాగలవని ఢిల్లీ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. కొత్త భవనాలను దశల వారీగా 20 ఏళ్ల కాలవ్యవధిలో నిర్మించాలని ప్రతిపాదించింది. మొదటి దశలో 29 బంగ్లాల పను లు చేపడుతున్నారు. మిగిలిన వాటి పనులను త్వరలోనే చేపడతామని మీనన్ వివరించారు.
Advertisement