inaguration
-
ప్రమాణస్వీకారానికి ముందు ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్:ప్రమాణస్వీకారానికి కొన్ని గంటల ముందు అమెరికా(America)కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన ప్రకటన చేశారు. వాషింగ్టన్ డీసీలో ఆదివారం జరిగిన మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్(MAGA) ర్యాలీని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా అమెరికాలోకి వలసలపై ట్రంప్ దూకుడుగా మాట్లాడారు.‘నేను ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మన దేశంపై అక్రమ వలసదారుల దండయాత్ర ఆగిపోతుంది. సరిహద్దుల నుంచి అక్రమంగా ప్రవేశించడాన్ని ఆపేస్తాం. ఇక మన సంపదను మనమే అనుభవిస్తాం. అక్రమంగా వలస వచ్చిన వేలాది మందిని బలవంతంగా సాగనంపే కార్యక్రమం అమెరికా చరిత్రలోనే భారీగా మొదలుపెడతాం.ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. టిక్‌టాక్ యాప్‌ను మళ్లీ తీసుకొచ్చాం. మన ఉద్యోగాలు చైనాకు పోవడానికి వీల్లేదు. అందుకే టిక్‌టాక్ యాప్‌లో అమెరికా ప్రభుత్వం 50 శాతం భాగస్వామ్యం తీసుకుంటుంది. అధికారం చేపట్టకముందే ట్రంప్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే కొన్ని పనులు జరిగిపోతున్నాయి. ఇది నా ఎఫెక్ట్ కాదు. మీ అందరి ఎఫెక్ట్’అని ర్యాలీకి హాజరైన వారిని ట్రంప్ తన ప్రసంగంతో ఉత్తేజపరిచారు. కాగా, గతేడాది నంబర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రంప్ సోమవారం(జనవరి 20)న రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధికారం చేపట్టిన వెంటనే ట్రంప్ ఏ నిర్ణయాలు తీసుకుంటారన్నది ప్రపంచ దేశాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి.ఇదీ చదవండి: నేడే ట్రంప్ పట్టాభిషేకం -
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన పీఎం మోదీ
-
అయోధ్యలో మొబైల్ ఆస్పత్రులు ఏర్పాటు
-
బాలరాముడి ప్రాణప్రతిష్టకు సర్వం సిద్ధం
-
Ayodhya: రామమందిర ప్రారంభంపై జేడీయూ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
పాట్నా: ఈ నెల 22న అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభ వేడుకపై జేడీయూ ఎంపీ కౌశలేంద్ర కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నలందలో ఆయన మీడియాతో మాట్లాడారు. అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభ వేడుక ఎవరి కొడుకుదైనా పెళ్లా లేదంటే ఎవరి తండ్రిదైనా తద్దినమా ఆహ్వానాలిచ్చి పిలవడానికి అని ప్రశ్నించారు. అయోధ్యలో జరిగే వేడుకకు తనకు ఆహ్వానం రాలేదని, అంత మాత్రాన తాను వెళ్లకూడదా చెప్పాలని కుమార్ డిమాండ్ చేశారు. అయోధ్య అందరిదన్నారు. రామమందిర ప్రారంభ వేడుకకు ఆహ్వానాలు పంపేవారు ఫూల్స్ అని విమర్శించారు. ‘అయోధ్యకు సతీసమేతంగా వెళ్లకపోతే ఆ ఫలం దక్కదు. ఎవరైతే భార్య లేకుండా 22న అక్కడికి వెళుతున్నారో వారికి ఈ ఏడాది లక్ష్యం నెరవేరదు’అని ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి కౌశలేంద్ర కుమార్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కౌశలేంద్ర కుమార్ వ్యాఖ్యలపై రామ జన్మభూమి గుడి ముఖ్య పురోహితుడు ఆచార్య సత్యేంద్రదాస్ తీవ్రంగా స్పందించారు. మూర్ఖులు మాత్రమే అలాంటి భాష ఉపయోగిస్తారని మండిపడ్డారు. #WATCH | Nalanda, Bihar | On invitations being extended to attend the 'pranpratishtha' ceremony of Ram Temple on January 22 in Ayodhya, JD(U) MP Kaushalendra Kumar says, "Is it somebody's son's wedding that an invitation is being extended? If they won't invite me, will I not go… pic.twitter.com/UJ4JKSnahf — ANI (@ANI) January 6, 2024 ఇదీచదవండి..ఢిల్లీ ఎయిర్‌పోర్టు వద్ద భారీ క్రేన్.. ప్రమాదంలో పడ్డ విమానాలు -
భావోద్వేగాలతో నిండిన రోజు ఇది: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఇవాళ(బుధవారం) రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు తనను కలిసి ఆహ్వానం అందించారని సంతోషం వ్యక్తం చేశారాయన. ఈ మేరకు ఎక్స్‌లో భావోద్వేగంగా ఆయన ట్వీట్ చేశారు. సియా రామ్! ఈ రోజు భావోద్వేగాలతో నిండిన రోజు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు నన్ను కలవడానికి నా నివాసానికి వచ్చారు. శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అయోధ్యకు రావాల్సిందిగా ఆయన నన్ను ఆహ్వానించారు. నా జీవితకాలంలో ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూడటం నా అదృష్టం అని ఎక్స్‌లో పోస్ట్ చేశారాయన. जय सियाराम! आज का दिन बहुत भावनाओं से भरा हुआ है। अभी श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के पदाधिकारी मुझसे मेरे निवास स्थान पर मिलने आए थे। उन्होंने मुझे श्रीराम मंदिर में प्राण-प्रतिष्ठा के अवसर पर अयोध्या आने के लिए निमंत्रित किया है। मैं खुद को बहुत धन्य महसूस कर रहा… pic.twitter.com/rc801AraIn — Narendra Modi (@narendramodi) October 25, 2023 జనవరి 22వ తేదీన ఉత్తర ప్రదేశ్ అయోధ్య నగర రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపనతో ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న 136 సనాతన సంప్రదాయాలకు సంబంధించి పాతిక వేల మంది హిందూ సంఘాల నేతలకు, మరో పాతిక వేల మంది సన్యాసులకు, ఇంకో పదివేల మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానం అందించే యోచనలో ఉంది ట్రస్ట్. 2016లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. ఆ తర్వాతే కేంద్రం శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేయించి మందిర నిర్మాణం ప్రారంభించింది. -
రేపే సీఎం వైఎస్ జగన్ చేతులమీదుగా శ్రీనివాస సేతు ప్రారంభం
-
వరల్డ్ టూరిజంలో ఏపీకి ప్రత్యేక స్థానం రావాలి: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం విజయవాడలో పర్యటించారు. గుణదలలో నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. హయత్ ప్లేస్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంశాఖమంత్రి తానేటి వనిత, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, హోటల్ హయత్ ప్లేస్ ఛైర్మన్ ఆర్ వీరా స్వామి, ఉన్నతాధికారులు, పలువులు ఇతర ప్రజా ప్రతినిధులు.పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... ►హయత్ ఛైర్మన్ వీరస్వామి, హయత్ ఇంటర్నేషనల్ ఏరియా ప్రెసిడెంట్ శ్రీకాంత్, మేనేజింగ్ డైరెక్టర్ సాయికార్తీక్‌లతో పాటె ఈ ప్రాజెక్టులో మమేకమైన అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు సీఎం జగన్ ►విజయవాడలోనే కాకుండా ఆంధ్రరాష్ట్రమంతా ఇలాంటి ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్, ప్రముఖ హోటల్స్ వచ్చి... ఆంధ్రరాష్ట్రం కూడా గ్లోబల్ ఫ్లాట్‌ఫాంమీద, ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో ఒక ప్రత్యేకమైన స్ధానం పొందాలని... మంచి టూరిజం పాలసీని తీసుకువచ్చాం. మంచి టూరిజం పాలసీని తీసుకునిరావడమే కాకుండా.. మంచి చైన్ హోటల్స్‌ను కూడా ప్రోత్సహిస్తూ వచ్చాం. ►ఒబెరాయ్‌తో మొదలుకుని ఇవాళ ప్రారంభం చేసుకుంటున్న హయత్ వరకు దాదాపు 11 పెద్ద బ్రాండ్లకు సంబంధించిన సంస్ధలన్నింటినీ ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ►ఈ కార్యక్రమం ఇంకా మరో నలుగురికి స్ఫూర్తినివ్వాలని, మరో నలుగురు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. వారందరికీ ఇలాంటి ప్రోత్సహకాలిచ్చి ఏపీని వరల్డ్ టూరిజం మ్యాప్‌లో పెట్టేందుకు అవసరమైన సహాయసహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ►విజయవాడ నగరంలో మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ హోటల్స్ ఇంకా రావాలని, ఇవి రాష్ట్ర మంతటా విస్తరించాలని మనసారా కోరుకుంటున్నాను. -
నూతన పార్లమెంట్ భవనం శిలాఫలకం ఆవిష్కరించిన ప్రధాని
-
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం
-
గుడివాడ బస్టాండ్ డిపో గ్యారేజ్ ప్రారంభం
-
హైదరాబాద్ లో లక్ష బెడ్ రూం ఇళ్ల పంపిణీపై కేటీఆర్ తొలి సంతకం
-
కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
-
ఈనెల 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం
-
ఈ నెల 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం
-
హుస్సేన్ సాగర తీరాన అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ
-
‘దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్నది అంబేద్కర్ కోరిక’
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్నారు. అందరూ విద్యావంతులు అవ్వాలని ఆశించారు. సమాజ మార్పు కోసం ప్రయత్నించారన్నారు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్. శుక్రవారం హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన జరిగిన అంబేద్కర్ మహావిగ్రహావిష్కరణ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్ని ప్రసంగించారాయన. అంబేద్కర్ ఆశయాల్ని కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారు. అంబేద్కర్ ఆశయాలు కేవలం దళితులకు, ఆదివాసీలకే పరిమితం కాదు. దేశంలో మతమైనారిటీలే కాదు.. కులమైనారిటీలు కూడా ఉన్నారన్నారాయన. అలాగే.. పొట్టీ శ్రీరాములు ఆంధ్రపప్రదేశ్ కోసం ప్రాణ త్యాగం చేశారు. ఆయన ప్రాణ త్యాగం చేసే వరకు కూడా రాష్ట్రం ఇవ్వలేదు. చిన్న రాష్ట్రాలతోనే ఉత్తమ ఫలితాలు వస్తాయని అంబేద్కర్ భావించేవారు. మీ అందరి తరపున సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు ఆయన ప్రసంగించారాయన. దేశానికి రెండో రాజధాని అవసరమని రాజ్యాంగ చర్చల్లో అంబేద్కర్ కోరుకున్నారు. అదీ హైదరాబాదే కావాలని అంబేద్కర్ కోరుకున్నారని ప్రకాష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా దేశానికి రెండో రాజధాని అవసరమన్న విషయాన్ని అంబేద్కర్ లేవనెత్తారని, ఆ అవసరం ఇప్పుడు ఉందని ప్రకాష్ పేర్కొన్నారు. -
నిర్మాణ వ్యయం రూ.146.50 కోట్లు
-
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ కాలేజీ ప్రారంభించిన కేటీఆర్
-
ఏప్రిల్ 30న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం
-
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. అయితే, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా సచివాలయం ప్రారంభ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్బంగా షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 17వ తేదీన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఫిక్స్ చేశారు. ఇంతలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. -
తెలంగాణ సచివాలయానికి ముహూర్తం ఖరారు
-
సినీ ఇండస్ట్రీకి పెద్ద నేను కాదు: మెగాస్టార్ చిరంజీవి
-
గిరిజనులకు దేశవ్యాప్తంగా సమాన హోదా
సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు దేశవ్యాప్తంగా సమాన హోదా దక్కాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో గిరిజనులు ఎస్టీలుగా, బీసీలుగా, ఓసీలుగా ఉంటున్నారని.. అలా కాకుండా వారందరికీ సమాన హోదా దక్కే దిశగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్, కుమురంభీం ఆదివాసీ భవన్లను సీఎం శనివారం ప్రారంభించి మాట్లాడారు. ‘‘తెలంగాణ ఏర్పాటుకు ముందు అత్యంత ఖరీదైన ప్రాంతాలైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఎస్టీలకు గజంజాగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు గిరిజనులు, ఆదివాసీలు తలెత్తుకునేలా ఆధునిక హంగులతో రెండు భవనాలను నిర్మించాం. ఈ రెండు భవనాలు దేశంలోని గిరిజన సమాజానికి స్పూర్తిగా నిలవాలి. ఇక్కడ పెళ్లుళ్లు, పేరంటాలు వంటివి కాకుండా గిరిజనులను ఉన్నతీకరించే ఆలోచనలకు కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహించాలి’’ అని కేసీఆర్ సూచించారు. ఆదివాసీ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా కుమురం భీం విగ్రహానికి నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పోడు భూముల సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. పోడు సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని, అవన్నీ సమర్థంగా పనిచేసేలా గిరిజన ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సూచించారు. గిరిజన భవన్, ఆదివాసీ భవన్లను చక్కటి సమావేశాలు నిర్వహించుకునేందుకు వినియోగించుకోవాలన్నారు. ‘ఏ తండాలో ఏ సమస్యలున్నాయి? వాటిని ఎలా రూపుమాపాలి? ఏ విధంగా ప్రభుత్వ సేవలు అందిపుచ్చుకోవాలి? అనే కోణంలో సదస్సుల నిర్వహణకు ఈ భవనాలు వేదిక కావాలి. ఏ బంజారా బిడ్డకు అవస్థ వచ్చినా వెళ్లి రక్షణగా నిలవాలి. అప్పుడే ఈ భవనాలకు సార్థకత లభిస్తుంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు. గిరిజన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. కాగా సీఎం కార్యక్రమ సమయంలో.. ఎస్టీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం 12 శాతానికి పెంచాలంటూ బంజారా, ఆదివాసీ భవన్ల వద్ద కొందరు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదీ చదవండి: మతోన్మాద శక్తులు వస్తున్నాయి.. జాగ్రత్త! -
వకుళమాత ఆలయ ప్రారంభోత్సవానికి సీఎం జగన్
-
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం
ఉస్మానియా యూనివర్సిటీ: ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం మంగళవారం ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 7వ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1917 ఏప్రిల్ 26న ఉస్మానియా విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఫర్మాన్ (రాజాజ్ఞ) జారీ చేశారు. అడిక్‌మెట్ జాగీర్‌లో నిజాం 2వ నవాబు నుంచి మహ లకాభాయి చందా బహుమతిగా పొందిన భూమిని తిరిగి 7వ నవాబుకు కానుకగా ఇవ్వడంతో అదే స్థలంలో ఓయూ ఏర్పాటుకు పునాదులు పడ్డాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తొలిసారిగా ఓయూలో మంగళవారం ఫౌండేషన్ డే నిర్వహిస్తున్నారు. 105 వసంతాలు పూర్తి చేసుకున్న ఓయూలో కోటిమందికి పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేశారు. ఎందరో విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. తొలి రోజుల్లో ధనవంతుల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించగా నేడు ఓయూ నూరుశాతం మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తుంది. ఏటా నిర్వహిస్తాం.. దేశంలోనే 7వ యూనివర్సిటీగా ప్రసిద్ధిగాంచిన ఓయూ తొలిసారి ఫౌండేషన్ డేను నిర్వహించడం గర్వంగా ఉంది. ఇకపై ఏటా ఆవిర్భావ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించాం. తొలిసారి జరుగుతున్న 105వ ఫౌండేషన్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఇక్కడ చదివిన విద్యార్థులు అనేక రంగాల్లో స్థిరపడ్డారు. వందేమాతర ఉద్యమం మొదలు నిన్నటి తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో ఉద్యమాలు ఇక్కడే మొదలయ్యాయి. మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు వందలాది మంది నాయకులను తయరు చేసిన ఘనత ఓయూకు దక్కుతుంది. – వీసీ ప్రొ.రవీందర్ ఆర్ట్స్ కాలేజీ భవనం నిర్మాణం చరిత్రాత్మకం ఓయూ ఐకాన్‌గా నిలిచిన ఆర్ట్స్ కాలేజీ భవన నిర్మాణం చరిత్రాత్మకం. ఓయూ స్థాపనకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో నిజాం నవాబ్ 1934లో ప్రారంభించిన ఆర్ట్స్ కాలేజీ భవన నిర్మాణానికి అంతే ప్రాముఖ్యత ఉంది. డిగ్రీ కోర్సులతో ప్రారంభమైన ఓయూలో ప్రస్తుతం సుమారు 2.5 లక్షల విద్యార్థులు పీజీ, పీహెచ్డీ వరకు దూరవిద్య, రెగ్యులర్ కోర్సులు చదువుతున్నారు. 87 దేశాలకు చెందిన విదేశీ విద్యార్థులు ఓయూలో విద్యాభ్యాసం చేస్తున్నారు. – ప్రొ.అంజయ్య– చరిత్ర విభాగం 70 శాతం మహిళలు చదవడం ఓయూ ప్రత్యేకత ఓయూలో తొలిరోజుల్లో ధనవంతుల పిల్లలు చదువుకునేవారు. నేడు నూటి కి నూరుశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అందులో 70శాతం మహిళలు ఉండటం విశేషం. 105 ఏళ్ల చరిత్ర గల ఓయూకు పూర్వ వైభవం తెచ్చేందుకు వీసీ చేస్తున్న కృషి అభినందనీయం. – ప్రొ.సూర్య ధనుంజయ్– తెలుగుశాఖ. ఆనందంగా ఉంది అనేక మంది విద్యావంతులు, మేధావులు, సైంటిస్టులు, రాజకీయ నాయకులను, ఇతరులను అందించిన ఓయూలో చదవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఓయూ నేడు 105 ఫౌడేషన్ డే జరుపుకోవడం ఆనందంగా ఉంది. –సంజయ్–పీహెచ్డీ విద్యార్థి. ఓయూ ఫౌండేషన్ డే పై నేడు లెక్చర్ ఓయూ 105వ ఫౌండేషన్ డే సందర్భంగా లోక్‌పాల్ సెక్రెటరీ భరత్‌లాల్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ మంగళవారం లెక్చర్ ఇవ్వనున్నట్లు వీసీ ప్రొ.రవీందర్ తెలిపారు. సోమవారం ఫౌండేషన్ డేను విజయవంతం చేయాలని కోరుతూ వాక్ అండ్ రన్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఓయూ ఇంజినీరింగ్ ఎదుట వీసీ విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 10.30 నిమిషాలకు జరిగే ఫౌండేషన్ డే కార్యక్రమానికి విద్యార్థులు, సిబ్బంది అధిక సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి: సీఎం రాక నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు) -
అనంతలో తారల సందడి.. డీజే టిల్లుతో వయ్యారి భామలు
-
AP: నవ శకానికి నాంది
సాక్షి, అమరావతి : కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో పునర్వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చరిత్రలో నవశకానికి నాంది పలకనుంది. కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఉదయం 9.05 – 9.45 గంటల మధ్య లాంఛనంగా ప్రారంభించనున్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా పాలనను ప్రజల చెంతకు మరింత దగ్గరగా తీసుకువెళ్లనున్నారు. తద్వారా మేనిఫెస్టోలో ఇచ్చిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ వాగ్దానాన్ని నేడు కార్యరూపంలోకి తీసుకు వస్తున్నారు. నిన్న గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా పాలన వికేంద్రీకరణలో తొలి అడుగు వేశారు. నేడు కొత్త జిల్లాల ఆవిర్భావంతో ఈ దిశగా మరో అడుగు ముందుకు వేశారు. రేపు ఇదే స్ఫూర్తితో మూడు ప్రాంతాల సమానాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకుంటున్నారు. సత్వరాభివృద్ధి, సమగ్రాభివృద్ధి, సమానాభివృద్ధి, సర్వజనాభివృద్ధి, సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా పాలన వికేంద్రీకరణను చేపట్టారు. అభివృద్ధి ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదని, పాలన సామాన్య ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు చేరువగా ఉండాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ పారదర్శకంగా ఇంకా మెరుగ్గా అందాలన్న సమున్నత లక్ష్యంతో నవశకానికి నాంది పలుకుతున్నారు. జిల్లాల పెంపుతో ఎన్నో ఉపయోగాలు ► చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా జిల్లా కేంద్రం నుంచి మారుమూల సరిహద్దు గ్రామాలకు దూరభారం తగ్గనుంది. జిల్లా పరిపాలన యంత్రాంగం ప్రజలకు మరింత చేరువకానుంది. ప్రజల ఇంటి వద్దకు పాలన ద్వారా జవాబుదారీతనం ఇంకా పెరగనుంది. ► పాలనాపరంగా పర్యవేక్షణ పెరగనుంది. అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో మరింత వేగంగా మరింత పారదర్శకంగా అమలు చేసే అవకాశం ఉంటుంది. ► అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధికి బాటలు వేయొచ్చు. అభివృద్ధిలో ప్రాదేశిక సమానత్వం, సమ్మిళిత ఆర్థిక వృద్ధి, బడుగు, బలహీన వర్గాల వికాసంతో పాటు సుస్థిర ప్రగతికి బాటలు వేస్తుంది. ► వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి మైళ్ల కొద్దీ తిరిగే దుస్థితిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలు, వారి క్యాంపు కార్యాలయాలతో సహా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం కనీసం 15 ఎకరాల సువిశాల స్థలంలో మంచి డిజైన్లతో పది కాలాలపాటు గుర్తుండే విధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం సాగనుంది. జిల్లాల ఏర్పాటులో హేతుబద్ధత ► ప్రతి జిల్లా దాదాపు ఒక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో సగటున ఆరు, ఏడు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 18 నుంచి 23 లక్షల జనాభా ఉంటుంది. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం, దూరం దృష్ట్యా అరకు పార్లమెంట్ నియోజకవర్గం మాత్రం రెండు ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటైంది. ► ప్రజా సౌకర్యం, పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి జిల్లాలో కనీసం రెండు, మూడు, నాలుగు రెవెన్యూ డివిజన్లు ఉండేలా కొత్త డివిజన్లతో కలిపి మొత్తం 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 మినహా, ఒక అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఒకే జిల్లాలో ఉండేలా కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ► సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యంపై లోతైన అధ్యయనం, ప్రజల నుంచి వచ్చిన 17,500 పైగా విజ్ఞప్తుల పరిశీలన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నూతన జిల్లాలు ఏర్పాటయ్యాయి. -
సంతానం లేనివారు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగిచుకోవాలి
-
నదిలేని చోటుకు... ‘సాగరమే’ వచ్చింది!
సాక్షి, సిద్దిపేట: సాధారణంగా నదికి అనుసంధానంగా జలాశయాలు నిర్మిస్తారని, కానీ నది లేనిచోట దేశంలోనే అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్‌ను నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను బుధవారం సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ సందర్బంగా మంగళవారం ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మల్లన్నసాగర్ ద్వారా తెలంగాణలోని ఏ ప్రాంతానికైనా నీటిని తీసుకెళ్లవచ్చని, రానున్న 100 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని తానే ఇంజనీర్‌గా సీఎం ఈ రిజర్వాయర్ రూపకల్పన చేశారని చెప్పారు. తక్కువ ముంపుతో మల్లన్నసాగర్ జలాశయం నిర్మాణం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిర్వాసితులకు గజ్వేల్ పట్టణం సమీపంలో ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణం చేసి ఇళ్లను అందించామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని, కానీ బీజేపీ నేతలు మాత్రం మతాల మధ్య చిచ్చుపెట్టి రక్తాన్ని పారించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చేతనైతే తెలంగాణకు రావాల్సిన హక్కులపై ఢిల్లీలో బీజేపీ నాయకులు నిలదీయాలని హితవు పలికారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డిలకు దమ్ముంటే తెలంగాణలోని ప్రాజెక్టులకు జాతీయ హోదాను తీసుకురావాలని హరీశ్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అతిపెద్ద జలాశయం మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. బుధవారం సీఎం కేసీఆర్ తుక్కాపూర్ వేదికగా ప్రారంభించి దీనిని జాతికి అంకితం చేయనున్నారు. ఇప్పటికే నీటి నిల్వ సామర్థ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు సీఎం చేతుల మీదుగా నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన ఇలా.. ► హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ తుక్కాపూర్‌కు చేరుకుంటారు. ► సొరంగ మార్గం ద్వారా భూగర్భంలో ఏర్పాటు చేసిన పంప్‌హౌస్ వద్దకు వెళ్లి మోటార్లను ఆన్ చేస్తారు. ► అనంతరం జలాశయంలో గోదావరి జలాలకు శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు. ► తర్వాత జిల్లాకు చెందిన నాలుగు వేల మంది ప్రజా ప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశమవుతారు. -
వైఎస్సార్ జిల్లా వాసులకు శుభవార్త
-
గురువారం బెంజ్ సర్కిల్ పశ్చిమ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం
-
రేపు బెంజ్ సర్కిల్ వెస్ట్ సైడ్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్ నితిన్ గడ్కరి
-
11 రాష్ట్రాల సీఎంలు షాక్ అయ్యారు: కేసీఆర్
-
‘సీఎం జగన్ ఆలోచనల వల్లే కోవిడ్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నాం’
-
‘సీఎం జగన్ ఆలోచనల వల్లే కోవిడ్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నాం’
సాక్షి, అమరావతి: సీఎం జగన్ ఆలోచనల వల్లే కోవిడ్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నామని చిత్తూరు జిల్లాకు చెందిన పుంగనూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ తెలిపారు. సీఎం జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా రాష్ట్రంలోని 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించిన తర్వాత ఆ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం 27 పీహెచ్సీ ఆక్సిజన్ ప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కరోనా మొదటి, రెండవ వేవ్‌లో ఆక్సిజన్ లేకపోవడం వలన సుదూర ప్రాంతాలకు పంపేవాళ్లమని తెలిపారు. ప్రస్తుతం సీఎం అందించిన సదుపాయాలతో.. దేశంలో అత్యధికంగా కోవిడ్ నిర్ధారణ చేయగలిగామని తెలిపారు. అదే విధంగా.. కోవిడ్ పరీక్షలు, వ్యాక్సిన్లు అత్యధికంగా వేయగలిగామన్నారు. సీఎం జగన్ మంచి ఆలోచనల వల్ల కోవిడ్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నామని డాక్టర్ కిరణ్ తెలిపారు. 15 నుంచి 18 ఏళ్ల వయసు వారిలో వ్యాక్సిన్ వేయడంలోనూ దూసుకుపోతున్నామని తెలిపారు. అదేవిధంగా గుంటూరు జిల్లా జీజీహెచ్ నుంచి శైలజ అనే మహిళ మాట్లాడారు. కరోనా సెకండ్‌వేవ్‌లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయని తెలిపింది. గుంటూరు జీజీహెచ్‌లో అత్యవసర విభాగంలో చికిత్స తీసుకున్నానని తెలిపింది. డాక్డర్లు, ఆసుపత్రి సిబ్బంది చేసిన వైద్యంతోనే ఈ రోజు బ్రతికానని కన్నీటి పర్యంతమయ్యింది. అదే విధంగా మందులతో పాటు మధ్యాహ్నం పెట్టే పోషకాహరం తనప్రాణాలు నిలవడానికి ఎంతో ఉపయోగపడిందని తెలిపింది. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తమకు నిత్యవాసర సరుకులు ఇంటికి తీసుకొచ్చి అందించారని తెలిపింది. మూడోవేవ్‌లో ఆక్సిజన్ కొరత లేకుండా తీసుకుంటున్న చర్యలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా.. విశాఖపట్నం అనస్థిషియా టెక్నిషియన్ రవికుమార్ మాట్లాడారు. కోవిడ్ సెకండె వేవ్‌లో ఆక్సిజన్ కొరత వేధించిందని, విశాఖలో 15 ఆక్సిజన్ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. పీహెచ్సీ ఆక్సిజన్ ప్లాంట్ల వలన బాధితులకు 90 శాతం వరకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించబడుతుందని తెలిపారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్ల వల్ల కొండ ప్రాంతాలైన అరకు, పాడేరు ప్రాంతాలలో ఆక్సిజన్ సరఫరా సులభమవుతుందని తెలిపారు. పీహెచ్సీ ప్లాంట్ల వల్ల అగ్నిప్రమాదాలు కూడా తక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. వెయ్యి ఎల్పీఎం సామర్థ్యం ఉన్న పీహెచ్సీ ఆక్సిజన్ ప్లాంట్‌తో ఒక రోజులో 25 ఐసీయూ బెడ్లకు, 100 నాన్ ఐసీయూ బెడ్లకు ఆక్సిజన్ అందించే అవకాశం ఉంటుందని రవికుమార్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్ అందించిన సదుపాయాలతో కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నట్లు రవికుమార్ తెలిపారు. -
‘శత వసంతాల ఘంటసాల’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: మహాగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుపై సాంస్కృతికశాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు రూపొందించిన ‘శతవసంతాల ఘంటసాల’ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర, కుటుంబ సభ్యులు, వివిధ రంగాల్లో ప్రముఖులు రాసిన అభిప్రాయాలతో పాటు, ఘంటసాల చిత్రమాలికలతో కూడిన పుస్తకాన్ని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు రూపొందించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: సీఎం జగన్ కడప జిల్లా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే -
దేశంలోనే తొలి సెల్ఫ్ బ్లడ్ టెస్టింగ్ కిట్
సాక్షి, కొరుక్కుపేట(తమిళనాడు): దేశంలోనే తొలిసారిగా కాంటాక్ట్ లెస్ సెల్ఫ్ బ్లడ్ టెస్టింగ్ కిట్‌ను చెన్నైలో అందుబాటులోకి తెచ్చారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్, సినీ దర్శకురాలు కృతికా ఉదయనిధి అతిథులుగా పాల్గొని సెల్ఫ్ బ్లడ్ టెస్టింగ్ కిట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆప్టిమిస్ట్ సంస్థకు చెందిన వేల్ మురుగన్, సరస్వతి మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో భాగంగా రక్త పరీక్షల కోసం వినూత్నమైన, సులువైన విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్ మాట్లాడుతూ పేదలకు ఉపయోగకరంగా సెల్ఫ్ బ్లడ్ టెస్టింగ్ కిట్ ఎంతో దోహదపడుతుందని దీనిని రూపొందించిన నిర్వాహకులను అభినందించారు. చదవండి: Helicoter Crash: మృత్యువుతో పోరాడుతున్న వరుణ్ సింగ్.. వైరలవుతోన్న లేఖ -
రు. కోటి పెట్టి నిర్మించిన రోడ్డు.. కొబ్బరికాయ దెబ్బకు బీటలు
లక్నో: మన దగ్గర రోడ్లు, ప్రాజెక్ట్‌ల నిర్మాణం ఎంత అధ్వానంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయా నిర్మాణాల నాణ్యత సదరు కాంట్రాక్టర్ ఎంత నిజాయతీపరుడనే దాని మీద ఆధారపడి ఉంటుంది. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కోటి రూపాయలు పెట్టి నిర్మించిన రోడ్డు ఒపెనింగ్ రోజునే దాని నాణ్యత ఎలా ఉందో బట్టబయలు అయ్యింది. రోడ్డు ఒపెనింగ్‌లో భాగంగా కొబ్బరి కాయ కొట్టడానికి ప్రయత్నించగా.. అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. కొబ్బరి కాయ బదులు రోడ్డు బీటలు వారింది. ఈ సంఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ వివరాలు.. (చదవండి: చిలక కాదు.. మొలక: ఆసక్తిగా తిలకిస్తున్న జనం ) ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ బిజ్నోర్‌లో చోటు చేసుకుంది. ఇక్కడ ప్రభుత్వం 1.16 కోట్ల రూపాయల ఖర్చుతో 7 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మించింది. రహదారి ప్రారంభోత్సవానికి బిజ్నోర్, సదార్ నియోజకర్గ బీజేపీ ఎమ్మెల్యే సుచి మౌసం చౌదరీని ఆహ్వానించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పూజ చేసి.. కొబ్బరి కాయ కొట్టి.. రోడ్డును ప్రారంభిద్దామని భావించారు. అయితే కొబ్బరి కాయ పగలలేదు కానీ.. రోడ్డు మాత్రం బీటలు వారింది. (చదవండి: అద్భుతం.. ఇంటి మేడ మీద 4 వేల మొక్కలు) ఈ సంఘటనపై మౌసం చౌదరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అధికారులు వచ్చి.. నమూనాలు సేకరించాల్సిందిగా ఆదేశించారు. మూడు గంటలు నిరీక్షించిన తర్వాత అధికారులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఆమె తారు నమూనాను సేకరించడంలో అధికారులకు సహాయం చేయడానికి గాను ఆ ప్రదేశంలో తవ్విన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతున్నాయి. This 7 km road in west UP’s Bijnor took 1.16 crores to renovate but when @BJP4UP MLA Suchi Chaudhary tried a coconut cracking ritual to formally inaugurate it , its the road that cracked open, she says …. pic.twitter.com/fvtaEEsNWf — Alok Pandey (@alok_pandey) December 3, 2021 చదవండి: ‘ఛ ఛ.. నీవల్లే ఇన్ని నేర్చుకున్నాను’ -
నేడు ట్యాంక్‌బండ్‌పై ఎస్పీ ‘బాలు’ సంస్మరణ వేదిక
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): ప్రతి ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్న ట్యాంక్‌బండ్ ఈ ఆదివారం సాయంత్రం గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణకు వేదిక కానుంది. ఈ సందర్భంగా నిర్వహించనున్న ఆర్కెస్ట్రాలో పలువురు గాయనీ గాయకులు బాలు పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. రైల్వే రక్షక దళం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సైతం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించనున్నారు. ఆర్పీఎఫ్ బ్యాండ్‌మేళా, ప్రదర్శన సందర్శకులను కనువిందు చేయనుంది. ప్రతి ఆదివారం ఏర్పాటు చేసినట్లుగానే ఈ సారి కూడా ఒగ్గుడోలు, గుస్సాడి, బతుకమ్మ, బోనాలు వంటి సాంస్కృతిక, కళాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు హెచ్ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: Civils Ranker: ఈజీగా ఏదీ దక్కదు.. అలాగే సాధ్యం కానిదంటూ లేదు -
ప్రధాని మోదీకి చినజీయర్ స్వామి ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా.. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని ప్రధాని మోదీని త్రిదండి చినజీయర్ స్వామి ఆహ్వానించారు. శనివారం ఆయనతోపాటు మైహోం గ్రూపు చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నామని, అందులో పాల్గొని 216 అడుగుల భగవద్ రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించాలని కోరారు. భేటీ అనంతరం వివరాలతో ప్రకటన విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న రామానుజుల మహావిగ్రహాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారని అందులో తెలిపారు. ‘‘శ్రీరామానుజుల దివ్యత్వం ప్రధానికి తెలుసు. ఆయన 70వ స్వాతంత్య్ర వేడుకల్లో ఎర్రకోట బురుజు నుంచి రామానుజుల వైభవాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సంరంభానికి రావాలని, 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించాలని చినజీయర్ స్వామి ఆహ్వానించగా.. ప్రధాని మోదీ అంగీకరించారు. ప్రపంచానికి సమతా సందేశాన్ని అందించే లక్ష్యంతో రామానుజుల మహా విగ్రహాన్ని రూపొందించడం అభినందనీయమంటూ..చినజీయర్ స్వామి సంకల్పాన్ని కొనియాడారు’’ అని వెల్లడించారు. పెద్దలందరికీ ఆహ్వానం ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, కిషన్‌రెడ్డి, నితిన్ గడ్కరీ ఇతర కేంద్రమంత్రులు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌లను చినజీయర్ స్వామి స్వయంగా కలిసి మహోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. 1,035 హోమగుండాలతో ప్రత్యేక యాగం ముచ్చింతల్‌లోని దివ్య సాకేతంలో 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరగబోయే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం నిర్వహించనున్నారు. 1,035 హోమగుండాలతో ఈ యాగం చేస్తారు. 2 లక్షల కిలోల ఆవునెయ్యితోపాటు ఇతర హోమ ద్రవ్యాలను వినియోగించనున్నారు. చదవండి: 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు చూసి -
రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనానికి శంకు స్థాపన, భూమిపూజ సహా ఇతర కార్యక్రమాల్లో పాల్గొ నేందుకు సీఎం కేసీఆర్ బుధవారం మూడు రోజుల హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. బేగంపేట విమానా శ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు. ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణం కోసం కేంద్రం కేటాయించిన 1,100 చదరపు మీటర్ల స్థలంలో సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 12:30కు కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతోపాటు ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఢిల్లీలో సొంత కార్యాలయ భవనం నిర్మించుకుం టున్న అతికొన్ని ప్రాంతీయ పార్టీల జాబితాలో టీఆర్ఎస్ చేరుతోంది. వచ్చే ఏడాది దసరాలోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేసి పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల అధినేత లను ప్రారం భోత్సవానికి ఆహ్వానించాలనే యోచ నలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. షెఖావత్, అమిత్ షా, నిర్మలతో భేటీలు? ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముంది. అయితే ప్రధాని మోదీతో సీఎం భేటీకి సంబంధించి ఎలాంటి షెడ్యూల్ ఖరారు లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్ మంగళవారం ఖరారవుతుందని సమా చారం. రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుపై ప్రజాభి ప్రాయ సేకరణ జరిగిన నేపథ్యంలో కేంద్ర జలవన రుల శాఖ మంత్రి గజేంద్ర షెఖావత్‌తో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అలాగే రాష్ట్రా నికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సీఎం సమావేశం కావొచ్చని సమాచారం. కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రూ. 40 కోట్లతో నిర్మాణం... రూ.40 కోట్ల అంచనాతో నిర్మించే ఢిల్లీ టీఆర్ఎస్ భవన్లో సమావేశ మందిరం, రాష్ట్రం నుంచి వివిధ పనుల మీద వచ్చే వారికి బస తదితర సదుపాయాలు ఉండేలా డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ను పోలి ఉండేలా ఢిల్లీ టీఆర్ఎస్ భవన్ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే శంకుస్థాపన చేయాలని కేసీఆర్ భావించినా కరోనా రెండో దశ విజృంభణ, లాక్డౌన్ పరిస్థితుల్లో కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గతంలో పార్టీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి కార్యాలయ భవన డిజైన్లపై చర్చించారు. -
జర్మన్ హంగర్ టెక్నాలజీతో కేసీఆర్ సభ.. ఎందుకంటే?
సాక్షి, హుజూరాబాద్(కరీంనగర్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళితబంధు పథకం ప్రారంభోత్సవానికి హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి సభా ప్రాంగణం ముస్తాబైంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2018 మేలో ఇదే ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని సైతం ఇదే శాలపల్లి వేదికగా ప్రారంభించడం గమనార్హం. ఇప్పటివరకూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాల కంటే ఈ పథకం ఆది నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే.. సభను అనుకున్నదాని కంటే ఎక్కువరెట్లు విజయవంతం చేసేలా సర్వం సిద్ధం చేశారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శాలపల్లికి చేరుకుంటారు. అక్కడి నుంచి సభాస్థలికి వస్తారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే సభ మొదలవుతుంది. సభా ఏర్పాట్లను ఆదివారం మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సభకు నియోజకవర్గంతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు లక్షా ఇరవై వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకుగాను అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. జర్మన్ హంగర్ టెక్నాలజీతో సభ.. జర్మన్ హంగర్ టెక్నాలజీతో సభ ఏర్పాట్ల పూర్తి చేశారు. ఎంత భారీవర్షం పడినా, గాలులు వీచినా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండటం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినా ప్రమాదం జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. 15 మంది ఎంపిక ఇలా జరిగింది..! నియోజకవర్గం నుంచి ఎంపికైన 15 మంది దళిత కుటుంబాల ఎంపికపై సంఖ్యాపరమైన సమాచారాన్ని అధికారులు అందజేశారు. అందులో జమ్మికుంట మండలం గ్రామీణ ప్రాంతం నుంచి ఇద్దరు, టౌన్ నుంచి ఇద్దరు, హుజూరాబాద్ మండలం టౌన్ నుంచి ఇద్దరు, రూరల్ నుంచి ఇద్దరు, వీణవంక మండలం నుంచి ఇద్దరు, ఇల్లందకుంట నుంచి ఇద్దరు, కమలాపూర్ నుంచి ముగ్గురు లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరంతా కుటంబ సభ్యులతో కలిసి వస్తున్నారు. అధికారులు వీరి వివరాలు వెల్లడించకపోయినా.. ఈ కుటుంబాలను సభాస్థలికి రప్పించేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లు చేశారు. వీరికి సభాప్రాంగణంపై కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. 200 మంది కూర్చుండేలా పెద్ద డయాస్ ఈ సభలో 200 మంది కూర్చుండేలా పెద్ద డయాస్ ఏర్పాటు చేశారు. ప్రధాన డయాస్ పక్కనే మరో డయాస్ కళాకారుల కోసం ఏర్పాటు చేశారు. ప్రధాన డయాస్‌లో వెనుక కూర్చున్న వారు కనిపించేలా నిర్మాణం చేశారు. ఈ సభలో మొత్తంగా 10 బ్లాకులు ఏర్పాట్లు చేశారు. 5 బ్లాకుల్లో మహిళలు, మరో 5 బ్లాకుల్లో పురుషులు కూర్చుండేలా కుర్చీలను సమకూర్చారు. లక్షా 20 వేల మంది హాజరయ్యే అవకాశం.. దళితబంధు సభకు లక్షా 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకు గాను అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 825 బస్సుల్లో దళితబంధువులు హాజరవుతారని సమాచారం. బస్సులు సభా వేదికకు దాదాపు 500 మీటర్ల దూరంలో నిలుపుతారు. అక్కడ వారు దిగిన తర్వాత సభా వేదికకు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 25 ఎకరాల స్థలంలో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. గులాబీమయంగా హుజూరాబాద్ ప్రతిష్టాత్మకమైన దళితబంధు పథకం ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి శాలపల్లి వరకు టీఆర్ఎస్ శ్రేణులు గులాబీ తోరణాలను కట్టారు. వరంగల్–కరీంనగర్ రహదారి, జమ్మికుంట రోడ్ రహదారి గులాబీమయంగా మారింది. సభా వేదికకు సమీపంలో సీఎం కేసీఆర్ భారీ కటౌట్లను ఏర్పాటుచేశారు. 20 మంది ఐపీఎస్.. 4,600 మందికిపైగా పోలీసులు దళితబంధు సభా సజావుగా సాగేందుకు 4,600 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. దళితబంధు ఎంపికపై ఇప్పటికే పలుచోట్ల ప్రజలు, పార్టీలు వరుసగా నిరసనలు చేస్తుండటంతో ముందుజాగ్రత్తగా భారీ రక్షణ ఏర్పాట్లు చేశారు. ఆందోళనలు జరగవచ్చన్న నిఘావర్గాల సమాచారంతో డేగ కళ్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఒక అడిషనల్ డీజీ అధికారి హైదరాబాద్ నుంచి వస్తున్నారు. నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ సీపీ సత్యనారాయణ, రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి, ఖమ్మం సీపీ విష్ణువారియర్, వరంగల్ సీపీ తరుణ్‌జోషితోపాటు పలువురు ఎస్పీలు, ట్రైనీ ఐపీఎస్‌లతో కలిపి మొత్తం 20 మంది ఐపీఎస్ అధికారులు బందోబస్తులో పాల్గొంటున్నారు. దాదాపు 60 మంది డీఎస్పీలు, 200 సీఐలు బందోబస్తును దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. వీరికితోడు ఆర్మ్డ్ ఫోర్సెస్, ఫైర్‌సిబ్బంది అదనం. -
సోలార్ పవర్లో మనం సూపర్..
సాక్షి, తుక్కుగూడ (హైదరాబాద్): సోలార్ విద్యుదుత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని ఈ– సిటీలో ప్రీమియర్ ఎనర్జీస్ 750 మెగావాట్ల సోలార్ పీవీ సెల్స్, మాడ్యూల్స్ కంపెనీని గురువారం మంత్రి పి.సబితారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత ఏడాది ఒకే సంవత్సరంలో రాష్ట్రంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడులతో 17,000 పరిశ్రమలను తీసుకువచ్చినట్టు గుర్తు చేశారు. ఇందులో 80 శాతం కంటే ఎక్కువ ప్రస్తుతం పని చేస్తున్నాయన్నారు. కరోనా సమయంలో రూ.483 కోట్లతో ప్రీమియర్ కంపెనీని నిర్మించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారా 700 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. మరో రెండేళ్లలో 2,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కల్పన కోసం రూ.1,200 కోట్లను పెట్టుబడి పెడతామన్నారు. రంగారెడ్డి జిల్లాలో యువత నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఆగస్టు 5న ప్రారంభించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో మరిన్ని కంపెనీల ఏర్పాటును స్వాగతిస్తున్నామని చెప్పారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలో ఇంత పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పరిశ్రమల శాఖ కమిషనర్ జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ప్రీమియర్ ఎనర్జీస్ వ్యవస్థాపకుడు చిరంజీవ్ శాలుజా, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కలెక్టర్ అమయ్‌కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, మాజీ డీజీపీ తేజ్‌దీప్‌కౌర్, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ కారంపూడి విజయ్, మున్సిపల్ చైర్మన్ కాంటేకర్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవాని వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రుల కాన్వాయ్ అడ్డగింత.. తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని ఈ–సిటీలో ప్రీమియర్ ఎనర్జీస్ పరిశ్రమ ప్రారంభం కోసం వస్తున్న మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్‌ని బీజేపీ, బీజేవైఎం నాయకులు శ్రీశైలం జాతీయ రహదారిపై అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
హైదరాబాద్ లో గోల్డ్ మెన్ సాస్ గ్లోబల్ సెంటర్ ప్రారంభం
-
జూన్‌లో ‘సమ్మక్క సాగర్’ జాతికి అంకితం
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాల గరిష్ట వినియోగమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన సమ్మక్క బ్యారేజీ (తుపాకులగూడెం) సిద్ధమైంది. దేవాదుల ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యత పెంచే ఉద్ధేశంతో చేపట్టిన ఈ బ్యారేజీని జూన్‌లోనే పూర్తిగా నింపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది నాటికే ఈ పనులు పూర్తి చేయాలని భావించినా, వర దల కారణంగా పనుల్లో ఆటంకం ఏర్పడి ముందుకు సా గలేదు. ఇప్పుడు పనులు ముగియడంతో వచ్చే నెల చివరి వారంలో ఈ బ్యారేజీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వను న్నారు. జూన్ నుంచే నిల్వ చేసిన నీటిని దేవాదుల పంçపుల ద్వారా ఆయకట్టుకు అందించనున్నారు. 6.94 టీఎంసీల నిల్వకు రెడీ.. గోదావరిలో 100 టీఎంసీల మేర నీటి వాటా హక్కుగా ఉన్న కంతనపల్లి ప్రాజెక్టుతో వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో 7.5 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుతో 8 గ్రామాలు పూర్తిగా, మరో 12 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతుండటంతో ప్రాజెక్టు ప్రతిపాదనను తుపాకులగూడెం ప్రాంతానికి మార్చి రీడిజైన్ చేసి నాలుగేళ్ల కిందటే పనులు మొదలుపెట్టారు. 83 మీటర్ల ఎత్తులో 6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 1,132 మీటర్ల పొడవు, 59 గేట్లతో బ్యారేజీ పనులు చేపట్టారు. రూ.2,121 కోట్లతో పరిపాలనా అనుమతులివ్వగా, రూ.1,700 కోట్లతో ఏజెన్సీలతో ఒప్పందం కుదిరింది. గత ఏడాదే ఈ పనులు పూర్తి చేయాల్సి ఉన్నా బ్యారేజీ ప్రాంతం వద్ద 18 లక్షల నుంచి 21 లక్షల క్యూసెక్కుల మేర వరద రావడంతో కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయింది. దీంతో జూన్ నుంచి నవంబర్ వరకు ఆగిన పనులు తిరిగి డిసెంబర్లో ఆరంభమయ్యాయి. అనంతరం కాఫర్ డ్యామ్‌ను తిరిగి నిర్మించి, నీటిని, బురదను పూర్తిగా తొలగించి పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం 59 గేట్ల బిగింపు పూర్తయింది. మొత్తంగా ఇప్పటికే 98 శాతం పనులు పూర్తయ్యాయి. మట్టి, కాంక్రీట్ పనులు మొత్తం ముగిశాయి. జూన్‌లోనే పూర్తిస్థాయిలో నీటి నిల్వకు బ్యారేజీ సిద్ధమయింది. వచ్చింది వాడేద్దాం... ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇక్కడ నీటి నిల్వ చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఇంజనీర్లను ఆదేశించారు. ఆ సూచనల మేరకు వారం రోజుల కిందటే సీఎంఓ సెక్రటరీ స్మితా సబర్వాల్ బ్యారేజీ ప్రాంతంలో పర్యటించారు. మిగిలిన పనులను ఈ నెలాఖరుకు పూర్తి చేసి జూన్ మొదటి వారానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. నిజానికి బ్యారేజీ వద్ద జూన్ 15 తర్వాత ప్రవాహాలు మొదలవుతాయి. బ్యారేజీ ఎగువన కాళేశ్వరంలో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ గేట్లు ఎత్తిన పక్షంలో నీరు దిగువన ఉండే ఈ బ్యారేజీకి చేరుతుంది. బ్యారేజీ 83 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నా, 70 నుంచి 71 మీటర్ల లెవల్లోనే 2.90 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుంది. 71 మీటర్ల లెవల్ నుంచి దేవాదుల పంపుల ద్వారా నీటి ఎత్తిపోతలకు అవకాశం ఉంటుంది. ఈ నీటితో దేవాదుల పరిధిలోని 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించడం సులభతరం కానుంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా వినియోగిస్తే పూర్తి ఆయకట్టుకు నీరందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. -
ధోని ఫ్యాన్స్‌పై లాఠీచార్జ్..
జైపూర్: రాజస్థాన్‌లో క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫ్యాన్స్‌పై లాఠీచార్జీ జరిగింది. ధోనిని చూసేందుకు ఫ్యాన్స్ అధిక సంఖ్యలో రావడంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఫ్యాన్స్‌ను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలో టెంట్లు చిరిగిపోయి, కుర్చీలు విరిగిపోయాయి. ప్రశాంతంగా ఉండాలని పోలీసులు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని అభిమానులు.. బారికేడ్లు తోసుకుని ధోనితో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు లాఠీలకు పని చెప్పక తప్పలేదు. ఊహించని ఈ హఠాత్పరిణామానికి షాక్‌తిన్న ధోని.. హడావిడిగా రిబ్బన్ కట్ చేసి వెళ్లిపోయారు. కాగా, స్నేహితుల కోరిక మేరకు జాలోర్ జిల్లాలోని జాఖల్ గ్రామంలో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు ధోనీ అక్కడికి వెళ్లారు. -
‘మిమ్మల్ని చీరలో చూస్తే.. కన్నీళ్లు ఆగవు’
వాషింగ్టన్: కమలా హారిస్.. ప్రస్తుతం ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతుంది. అవును మరి అగ్రరాజ్యం అమెరికాకు తొలిసారి ఓ మహిళ.. అది కూడా ఆసియా ఖండానికి చెందిన నల్ల జాతి మహిళ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. దాంతో ఆమె విజయ ప్రస్థానం గురించి చర్చించుకుంటున్నారు జనాలు. మరో 24 గంటల్లో ఈ భారత సంతతి మహిళ అగ్రరాజ్యం అమెరికాకు వైస్ ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ డిబెట్ నడుస్తోంది. ప్రమాణస్వీకారోత్సవానికి కమలా హారిస్ తన భారతీయ మూలాలను ప్రతిబింబించేలా చీర కట్టుకుంటారా.. లేక సూట్ ధరిస్తారా అనే చర్చించుకుంటున్నారు నెటిజనులు. ఎక్కువ మంది కమలా హారిస్ చీర ధరిస్తే.. చాలా బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు. (చదవండి: కమలా హ్యారిస్ ముగ్గురమ్మల కూతురు) 2019నాటి కమలా హారిస్ వీడియో ఒకటి ప్రస్తుతం వైరలవుతుండటంతో ప్రమాణ స్వీకారం రోజున ఆమె ఏం ధరించబోతున్నారనే చర్చ మొదలయ్యింది. 2019 లో కమలా హారిస్ వన్ ఏపీఐఏ నెవాడా అనే ఆసియా అమెరికన్ గ్రూప్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ప్రేక్షకురాలు ‘‘ఒకవేళ మీరు గనక అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైతే.. ప్రమాణ స్వీకారం నాడు భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబిచే దుస్తులు ధరిస్తారా’’ అని ప్రశ్నించింది. ఇందుకు సమాధానంగా హారిస్.. ‘ముందైతే విజయం సాధించనివ్వండి’ అన్నారు. ఆనాటి మాటలు నేడు నిజం అయ్యాయి. మరో 24 గంటల్లో కమలా హారిస్ అమెరికా చరిత్రలో తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా ప్రమాణం చేయనున్నారు. దాంతో సోషల్ మీడియాలో ప్రమాణ స్వీకారోత్సం రోజున ఆమె ఏం ధరించబోతున్నారనే చర్చ తెగ నడుస్తోంది. (చదవండి: అమెరికాలోనే కాదు ఆరు దేశాల్లో మనవాళ్లే!) కొందరు ఓ అడుగు ముందుకు వేసి హారిస్ ఏం ధరిస్తే బాగుంటుందో సూచిస్తున్నారు. ఈ క్రమంలో న్యూయార్క్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ బిభుమోహపాత్ర ‘‘మీకు డ్రెస్ డిజైన్ చేసే అవకాశం లభిస్తే.. గౌరవంగా భావిస్తాను’’ అనగా.. తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి ‘‘బనారస్ పట్టు చీర ధరించి భారతీయతను గౌరవించండి’’ అని కోరారు. మరో వ్యక్తి ‘‘ప్రమాణ స్వీకారోత్సవం రోజున మిమ్మల్ని చీరలో చూస్తే.. నా కంట్లో నుంచి కారే ఆనందభాష్పాలను ఆపడం ఎవరి తరం కాదు’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
నోటీసులు లేకుండానే కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్ : వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో కొత్త జీహెచ్ఎంసీ చట్టం తీసుకొస్తున్నామని రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వరద వెళ్లేందుకు మార్గం లేక ఇటీవల కురిసిన వర్షాలతో నగరంలోని చాలా కాలనీలు జలమయమయ్యాయని అన్నారు. చెరువుల ఎఫ్టీఎల్, నాలాలు, బఫర్ జోన్లలోని నిర్మాణాలను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేసే అధికారం అధికారులకు కట్టబెడుతూ కొత్తగా తీసుకురానున్న జీహెచ్ఎంసీ చట్టంలో కఠినమైన నిబంధనలు పొందుపరచనున్నట్లు వెల్లడించారు. దీనికోసం అవసరమైతే న్యాయ నిపుణులు, న్యాయస్థానాలను సంప్రదిస్తామన్నారు. హైదరాబాద్ నగర ఉజ్వల భవిష్యత్ కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ అనుమతుల జారీకి కొత్తగా తీసుకొచ్చిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సిస్టం(టీఎస్–బీపాస్)ను సోమవారం ఆయన మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్–బీపాస్ విధానం దేశంలోనే అత్యుత్తమమైందని, ఒక రూపాయి లంచం ఇవ్వకుండానే ఇళ్ల నిర్మాణ అనుమతులు పొందేలా దీనికి రూపకల్పన చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇతర పాలసీల తరహాలో టీఎస్–బీపాస్ విధానం కూడా దేశానికి ఆదర్శంగా మారబోతుందన్నారు. బాధ్యతాయుతంగా మెలగాలి.. 75 చదరపు గజాల లోపు స్థలంలో నిర్మించే ఇళ్లకు అనుమతులు అవసరం లేదని, రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందన్నారు. 75 నుంచి 300 చదరపు గజాలలోపు స్థలంలో ఇళ్ల నిర్మాణం కోసం టీఎస్–బీపాస్ వెబ్సైట్లో స్వీయ ధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆటోమెటిక్‌గా అనుమతులు జారీ అవుతాయన్నారు. అయితే, తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతులు పొందినా, నిర్మాణంలో సెట్ బ్యాక్ రూల్స్‌ను ఉల్లంఘించినా, ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలను కబ్జా చేసి ఇళ్ల నిర్మాణ అనుమతులు పొందినట్లు తేలినా తక్షణమే నోటీసులు లేకుండా కూల్చివేస్తారన్నారు. ఈ విషయంలో పౌరులు బాధ్యతాయుతంగా మెలగాలని, ప్రజల మేలు కోరి తీసుకొచ్చిన ఈ విధానాన్ని దుర్వినియోగం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. 300 చదరపు గజాలకు పైబడిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి కేవలం 21 రోజుల్లోగా అన్ని రకాల అనుమతులను, ఎన్ఓసీలను జారీ చేస్తామన్నారు. దరఖాస్తుల్లో ఏవైనా లోపాలుంటే తొలి వారంలోనే దరఖాస్తుదారులకు తెలియజేసి వాటిని సరిదిద్దడానికి అవకాశం కల్పిస్తారన్నారు. ఒకవేళ గడువులోగా అనుమతులు రాకుంటే వచ్చినట్లు పరిగణించాలని చెప్పారు. అనుమతులకు చట్టబద్ధత.. టీఎస్–బీపాస్ ద్వారా జారీ చేసే తక్షణ ఇళ్ల అనుమతులకు చట్టబద్ధత ఉంటుందని, బ్యాంకుల నుంచి గృహ రుణాలు పొందడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవన్నారు. టీఎస్–బీపాస్ విధానాన్ని రెరా ఆథారిటీతో అనుసంధానం చేస్తామని, అనుమతులు పొందిన ప్రాజెక్టుల సమాచారం అటోమెటిక్‌గా రెరా ఆథారిటీకి వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలోనే అత్యున్నతమైన జీవన ప్రమాణాలు, అత్యధిక ఆఫీస్ స్పేస్ వినియోగం కలిగిన నగరంగా హైదరాబాద్‌కు పేరుందని, నగరంలో స్థిరాస్తి వ్యాపారం బాగా జరుగుతోందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ధరలకే ఇక్కడ ఇళ్లు లభిస్తాయని పేరుందని, డిమాండ్ ఉందని అడ్డగోలుగా ధరలు పెంచవద్దని స్థిరాస్తి వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. కొత్తగా అమలు చేస్తున్న టీఎస్–బీపాస్ విధానం అమలుపై కొంత కాలం పరిశీలన జరుపుతామని, ఆ తర్వాత అవసరమైన మార్పులు చేర్పులు తీసుకొస్తామని వెల్లడించారు. స్వీయ ధ్రువీకరణ ద్వారా ఇళ్లకు అనుమతి పొందిన పలువురు దరఖాస్తుదారులకు మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమంలో అనుమతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవందర్ రెడ్డి, డీటీసీపీ విద్యాధర్ రావు, క్రెడాయ్ రామకృష్ణా తదితరులు పాల్గొన్నారు. -
యాడ్ ఫ్రీ చానల్‌గా మారనున్న ఎస్వీబీసీ
సాక్షి, తిరుపతి : ఎస్వీబీసీ నూతన భవనాలకు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 2007 లో ఎస్వీబీసీ కి రూపకల్పన చేశారని, ఆయన అనుమతితోనే ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. 2008 ఏప్రిల్ 7 న టెస్ట్ సిగ్నల్ నిర్వహించగా, అదే ఏడాది జులైలో పూర్తి ప్రసారాలు ప్రారంభం అయ్యాయని గుర్తుచేశారు. తక్కువ కాలంలోనే ఎస్వీబీసీ భక్తుల మన్నన్నలు పొందిందని, తదనంతరం 2017లో తమిళ చానల్ కూడా ప్రారంభం అయినట్లు వెల్లడించారు. ఇక నూతన భవనాల్లో రెండు స్టూడియోలు , టేలి పోర్టులు ఉన్నాయని తెలిపారు. ఎస్వీబీసీని యాడ్ ఫ్రీ చానల్ గా ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం భక్తుల నుంచి విరాళాలు కోరామని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 4 కోట్ల రూపాయలు రాగా, భక్తుల కోరిక మేరకు త్వరలోనే కన్నడ, హిందీ భాషల్లో కూడా చానళ్లు పెడుతున్నట్లు వెల్లడించారు. ఎస్వీబీసీ ని పూర్తి హెచ్డి చానల్ గా మార్చుతున్నామని స్పష్టం చేశారు. (ఆమె జాతీయ నాయకురాలో లేక జాతి నాయకురాలో..) -
ఉదయానంద హాస్పిటల్‌ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : కర్నూలు జిల్లా నంద్యాలలో ఉదయానంద హాస్పిటల్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు. నూతన హాస్పిటల్ ద్వారా ఆ ప్రాంత ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు వైఎస్ జగన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి, డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హాస్పిటల్ డైరెక్టర్ స్వప్నారెడ్డి. తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులకు శ్రీకారం
-
మోడల్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన హోంమంత్రి
సాక్షి, ఆవనిగడ్డ(కృష్ణా) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం ఆవనిగడ్డలో మోడల్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు పేర్ని నాని, మోపిదేవి వెంకటరమణ, అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్, డిఐజి ఏఎస్ ఖాన్లు అతిథులుగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన హోంమంత్రి మేకతోటి సుచరితకు అధికారుల సమక్షంలో ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పోలీస్ సిబ్బందికి మౌలిక సదుపాయల కల్పన కోసమే మోడల్ పోలీస్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు సుచరిత పేర్కొన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మహిళల సమస్యలను పరిష్కరించడానికి ' మహిళా క్రాంతి' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో 'మహిళా మిత్ర' పేరిట ఒక మహిళా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేస్తే మహిళలు తమ సమస్యలను మరింత స్వేచ్ఛగా తెలపడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. మహిళా పోలీసులు బందోబస్తుకు వెళ్లినపుడు వారికి కనీస అవసరాలు తీర్చేందుకు మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అవినీతి రహితంగా ఉంటూ, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా లక్ష్యం పెట్టుకోవాలని సుచరిత పిలుపునిచ్చారు. -
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు
-
సత్సంబంధాలనే కోరుకుంటున్నాం
కర్తార్‌పూర్: సిక్కు యాత్రికుల సౌలభ్యం కోసం నిర్మిస్తున్న కర్తార్‌పూర్ కారిడార్‌కు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాక్‌లోని పంజాబ్ ప్రావిన్సులో బుధవారం శంకుస్థాసన చేశారు. పాక్ ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు, సైన్యం కూడా భారత్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవాలనే కోరుకుంటోందని చెప్పారు. కశ్మీర్ సహా అన్ని సమస్యలనూ ఇరు దేశాల నాయకత్వాలు బలం, కృషితో పరిష్కరించుకోవచ్చన్నారు. ‘దేవుడు తమకు ఇచ్చిన అవకాశాలను భారత్, పాక్‌లు అర్థం చేసుకోవడం లేదు. నేను ఎప్పుడైనా భారత్‌కు వెళ్తే.. పాక్‌లోని రాజకీయ నేతలు భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నా పాక్ సైన్యం మాత్రం అలా జరగనివ్వదని నాకు చెబుతుంటారు. కానీ సైన్యంతో సహా మేమంతా భారత్‌తో సుహృద్భావాన్నే కోరుకుంటున్నామని స్పష్టం చేస్తున్నా’ అని ఇమ్రాన్ అన్నారు. ఒకప్పుడు భీకర యుద్ధాలు చేసుకున్న ఫ్రాన్స్, జర్మనీలే ప్రస్తుతం శాంతియుత వాతావరణంలో సత్సంబంధాలను కలిగి ఉన్నాయనీ, భారత్–పాక్ మధ్య కూడా శాంతి, మంచి సంబంధాలు సాధ్యమేన న్నారు. పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఉన్న కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారను, భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారను కలుపుతూ నాలుగు కిలో మీటర్ల రహదారిని అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత్, పాక్‌లు కలిసి నిర్మిస్తుండటం తెలిసిందే. ఇందుకోసం భారత్‌లో సోమవారమే శంకుస్థాపన జరగ్గా, పాక్ ఆ పనిని బుధవారం ప్రారంభించింది. శంకుస్థాపన కార్యక్రమానికి భారత ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు హర్సిమ్రత్ కౌర్ బాదల్, హర్దీప్సింగ్ పురీ హాజరయ్యారు. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వద్దని సూచించినా వినకుండా ఆ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఈ కార్యక్రమానికి వెళ్లడం తెలిసిందే. ‘వీసా’పై నిర్ణయం తీసుకోవాలి: సుష్మ కర్తార్‌పూర్ కారిడార్‌లో ప్రయాణించే సిక్కు యత్రికులకు వీసా అవసరం ఉండదని వార్తలు వచ్చినప్పటికీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మాటలు అందుకు వ్యతిరేకంగా ఉన్నాయి. యాత్రికులకు వీసా అవసరమో కాదో ఇంకా నిర్ణయించాల్సి ఉంద న్నారు. హైదరాబాద్‌లో సుష్మ మాట్లాడుతూ ఈ కారిడార్‌కు, పాక్‌తో చర్చలకు సంబంధం లేదని పేర్కొన్నారు. కర్తార్‌పూర్ కారిడార్ శంకుస్థాపన సభలో ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ వివాదాన్ని ప్రస్తావించడాన్ని భారత్ తప్పుబట్టింది. దైవకార్యాన్ని ఇమ్రాన్ రాజకీయాలకు ఉపయోగించడం పట్ల విచారం వ్యక్తం చేసింది. కాగా, పలువురు ఖలిస్తాన్ విభజన వాద సిక్కులు కూడా శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ ఖలిస్తాన్ నేత గోపాల్ దాస్.. పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వాతో కరచాలనం కూడా చేశారు. అయితే గోపాల్ దాస్ పాకిస్తాన్‌లోని గురుద్వారల కమిటీలో సీనియర్ నేత అనీ, అన్ని సిక్కు మతపరమైన కార్యక్రమాలకూ ఆయనను ఆహ్వానిస్తారని ఓ అధికారి చెప్పారు. కార్యక్రమానికి వచ్చిన ముఖ్యులందరితోనూ ఆర్మీ చీఫ్ కరచానలం చేశారనీ, భారత మీడియా ఈ అంశాన్ని భూతద్దంలో చూస్తోందన్నారు. సిద్ధూ పాక్‌లోనూ గెలవగలడు ఇరు దేశాల మధ్య శాంతి కోసం ప్రయత్నిస్తున్న సిద్ధూపై భారత్‌లో ఎందుకు విమర్శలు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాక్‌లో కూడా సిద్ధూ ఎంతో ప్రాచుర్యం పొందాడనీ, ఆ దేశంలోని పంజాబ్‌లో ఎన్నికల్లో నిలబడినా అతను గెలుస్తాడని ఖాన్ పేర్కొన్నారు. భారత్–పాక్‌ల మధ్య శాంతి నెలకొనేందుకు సిద్ధూ భారత ప్రధాని అయ్యేంత వరకు ఎదురుచూడాల్సిన అవసరం రాదనే తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. కర్తార్‌పూర్ కారిడార్ కార్యరూపం దాల్చడానికి మీరే కారణమంటే మీరే కారణమంటూ ఇమ్రాన్ ఖాన్, సిద్ధూలు గతంలో ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవడం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి కూడా సిద్ధూ హాజరైనప్పుడు కర్తార్‌పూర్ కారిడార్ గురించి ఖాన్‌తో ఆయన మాట్లాడినట్లు కథనాలు వచ్చాయి. సీఎం సలహాను పెడచెవిన పెట్టి తన వ్యక్తిగత పర్యటన అంటూ పాక్‌కు వెళ్లిన సిద్ధూపై పంజాబ్‌లో ప్రతిపక్ష శిరోమణి అకాళీదళ్, బీజేపీ విమర్శలు గుప్పించాయి. ఇదీ కర్తార్‌పూర్ చరిత్ర 1522: సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ తొలి గురుద్వారాను కర్తార్‌పూర్‌లో ఏర్పాటుచేశారు. మరణించేంత వరకు, 18 ఏళ్లపాటు ఆయన అక్కడే బోధనలు చేస్తూ కాలం గడిపారు. 1999: ప్రధాని వాజ్‌పేయి శాంతి ప్రయత్నాల్లో భాగం గా పాక్‌కు బస్సులో వెళ్లినప్పుడు ఈ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదించారు. 2000: భారత్ వైపు నుంచి ఓ బ్రిడ్జిని నిర్మించడం ద్వారా భారత్‌లోని సిక్కులు వీసా, పాస్‌పోర్టు లేకుండానే కర్తార్‌పూర్ గురుద్వారాను సందర్శించేలా అనుమతించేందుకు పాక్ అంగీకారం. 2018 ఆగస్టు: ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన సిద్ధూ. గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరుస్తామని పాక్ ఆర్మీ చీఫ్ తనకు చెప్పినట్లు వెల్లడి. నవంబర్ 22: కర్తార్‌పూర్ కారిడార్‌లో భాగంగా డేరా బాబా నానక్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. నవంబర్ 26: భారత్‌వైపు కారిడార్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య శంకుస్థాపన. నవంబర్ 28: పాకిస్తాన్ వైపు నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్. -
స్టెంట్ కేరాఫ్ సిటీ
సాక్షి, హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ పరిశ్రమ హైదరాబాద్ నగరంలో ఏర్పాటు కానుంది. నగర శివార్లలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో రూ.250 కోట్ల భారీ పెట్టుబడితో స్టెంట్ల తయారీ పరిశ్రమను నెలకొల్పుతున్నట్లు సహజానంద మెడికల్ టెక్నాలజీస్ (ఎస్ఎంటీ) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రకటించింది. హృదయ సంబంధిత రోగాలకు జరిపే శస్త్రచికిత్సల్లో వినియోగించే పరికరాల (మినిమల్లీ ఇన్వేసివ్ లైఫ్ సేవింగ్ మెడికల్ డివైజెస్)ను తయారు చేసే పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ భార్గవ్ కటడియా మంగళవారం ఇక్కడ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్‌లతో సమావేశమై ఈ మేరకు ప్రతిపాదనలు చేశారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 2,200 మందికి, పరోక్షంగా వందల మందికి ఉపాధి లభించనుంది. మూడు దశల్లో పరిశ్రమ స్థాపనకు పెట్టుబడి పెట్టనుంది. ఏటా ఈ పరిశ్రమ నుంచి 12.5 లక్షల స్టెంట్లు, 20 లక్షల బెలూన్ కాథెటర్స్ ఉత్పత్తి కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, సత్వర అనుమతులు, నగరంలో మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు కంపెనీ ఎండీ భార్గవ్ కటడియా పేర్కొన్నారు. ప్రస్తుతం సూరత్ కేంద్రంగా తమ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వైద్య పరికరాల ఉత్పత్తి రంగంలో రానున్న రోజుల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పారు. పరిశ్రమలు, పెట్టుబడులను రాబట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అభినందించారు. భవిష్యత్‌లో వైద్య పరికరాల ఉత్పత్తిలోనూ అగ్రస్థానం: కేటీఆర్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైద్య పరికరాల ఉత్పత్తి రంగంలో భారీ పరిశ్రమ రాష్ట్రానికి రావడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఔషధ రంగంలో ఇప్పటికే హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని, భవిష్యత్‌లో వైద్య పరికరాల ఉత్పత్తిలో సైతం అగ్రగ్రామిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య పరికరాల తయారీ పరిశ్రమ రావడంతో భవిష్యత్‌లో ఈ రంగంలో పెట్టుబడులకు నగరం ఆకర్షణీయ కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
కాలుష్యరహితం మెట్రో ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న ఇంధన ధరలు.. కాలుష్యం నుంచి విముక్తి పొందేందుకు మెట్రో రైలులో ప్రయాణించాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నగరవాసులకు సూచించారు. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు అమీర్‌పేట్–ఎల్బీనగర్ మెట్రో మార్గాన్ని అమీర్‌పేట్ స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రులు కేటీఆర్, నాయిని, తలసాని, పద్మారావు, ఎంపీలు దత్తాత్రేయ, మల్లారెడ్డి తదితరులతో కలసి మెట్రో రైలులో ఎల్బీనగర్ వరకు ప్రయాణించారు. మధ్యలో ఎంజీబీఎస్ స్టేషన్లో దిగి అక్కడి వసతులను పరిశీలించారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వద్ద మీడియాతో గవర్నర్ మాట్లాడారు. అందరూ మెట్రో రైలులో ప్రయాణిస్తే రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఉండదని, అంబులెన్స్‌లు ఫ్రీగా వెళ్లే వీలుంటుందని తెలిపారు. వచ్చే డిసెంబర్ 15 నాటికి అమీర్‌పేట్–హైటెక్ సిటీ మెట్రో మార్గాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు. ప్రతి మెట్రో స్టేషన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని.. ప్రయాణం సౌకర్యవంతంగా ఉందన్నారు. మెట్రో, ఎంఎంటీఎస్, బస్సు ప్రయాణం సహా షాపింగ్‌కు వీలుగా బహుళ ప్రయోజన సింగిల్ కార్డును త్వరలో వినియోగంలోకి తీసుకురావాలని మెట్రో అధికారులకు సూచించారు. ఉరుకుల పరుగుల జీవితం గడిపే నగరవాసులకు మెట్రో ప్రయాణంతోపాటు నిత్యావసరాలు, ఆహార పదార్థాలను సైతం స్టేషన్లో కొనుగోలు చేసుకునేలా అవకాశం కల్పించడం విశేషమన్నారు. దేశంలోనే నంబర్ 2... దేశంలో రెండో అతిపెద్ద మెట్రో ప్రాజెక్టు మనదే అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు కూడా ఇదేనని తెలిపారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నగర మెట్రో ప్రాజెక్టు విశిష్టతలను తెలియజేశారు. ప్రపంచస్థాయిలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, సౌకర్యాలు కల్పించామన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రీకాస్ట్ సెగ్మెంట్లతో వయాడక్ట్, స్టేషన్లను నిర్మించామని తెలిపారు. మెట్రో ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సహా పలు అంతర్జాతీయ సంస్థల నుంచి అవార్డులు అందుకున్న విషయాన్ని గుర్తుచేశారు. లాస్ట్‌మైల్, ఫస్ట్‌మైల్ కనెక్టివిటీ కోసం అధునాతన సైకిళ్లు, స్మార్ట్‌బైక్‌లు, జూమ్కార్లు, ఎలక్ట్రిక్ బైక్‌లను పలు స్టేషన్ల వద్ద అందుబాటులో ఉంచామన్నారు. మియాపూర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామన్నారు. ఎల్బీనగర్–మియాపూర్ మార్గంలో నిత్యం లక్ష మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నామన్నారు. మెట్రో నిర్మాణం కోసం తొలగించిన చెట్లను ట్రాన్స్‌లొకేషన్ విధానంలో వేరొక చోట నాటామన్నారు. అనంతరం నగర మెట్రో ప్రాజెక్టును పీపీపీ విధానంలో చేపట్టేందుకు, ఎల్అండ్టీ సంస్థ అత్యధిక పెట్టుబడులు పెట్టేందుకు సహకరించిన ఆ సంస్థ ఆర్థిక సలహాదారు శంకరన్‌ను గవర్నర్ నరసింహన్ ఘనంగా సన్మానించారు. అనంతరం స్టేషన్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబాఫసీయుద్దీన్, ఎంపీలు బండారు దత్తాత్రేయ, మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కమి షనర్ దానకిశోర్, హెచ్ఎండీఏ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తదితరులు పాల్గొన్నారు. కాగా మెట్రో ప్రారంభోత్సవంలో ఎక్కడా ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడంతో అలకబూనిన దత్తాత్రేయ ఎంజీబీఎస్ స్టేషన్ వద్ద మెట్రో దిగి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్, కేటీఆర్ స్మార్ట్‌బైక్ రైడ్... మెట్రో ప్రయాణం అనంతరం ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్‌బైక్‌ను గవర్నర్ రైడ్ చేస్తూ రాజ్‌భవన్‌కు వెళ్లారు. మంత్రి కేటీఆర్, ఎస్.కె.జోషి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, దానకిశోర్‌లు ఆయ న వెంట స్మార్ట్‌బైక్‌లను తొక్కుకుంటూ వెళ్లారు. ఈ స్మార్ట్‌బైక్‌లు ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటాయని గవర్నర్ వివరించారు. స్మార్ట్ బైక్ సైకిల్‌పై రాజ్‌భవన్‌కు వెళుతున్న గవర్నర్ నరసింహన్, కేటీఆర్ -
ఎల్బీనగర్లో ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ చౌరస్తా వద్ద 49 కోట్లతో చేపట్టి నిర్మాణం పూర్తయిన ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్నం మహేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్, పార్లమెంట్ సభ్యులు చామకూర మల్లా రెడ్డి , ఎంఎల్ఏలు కృష్ణయ్య, తీగల కృష్ణారెడ్డి, కమీషనర్ జనార్థన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో అత్యంత వేగంగా ఎల్బీనగర్ విస్తరణతో పాటు అభివృద్ధి సాగుతోందని పేర్కొన్నారు. 2030 వరకు హైదరాబాద్ మెగాసిటీగా అవతరిస్తుందని, దేశంలో మూడో స్థానంలో హైదరాబాద్ ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌కు చాలా ఫ్లై ఓవర్లు అవసరం ఉందని, అందుకే 23వేల కోట్ల రూపాయలతో ప్రణాళికను సిద్ధం చేశామని తెలిపారు. జాతీయ రహదారులను కూడా అభివృద్ధి చేస్తున్నామని, ఎల్బీనగర్లో రూ.450కోట్లతో రోడ్లు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఎన్ని రహదారులు విస్తరించిన ప్రూవేట్ వాహనాల రద్దీ తగ్గితేనే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని తెలిపారు. అమీర్‌పేట్-ఎల్బీనగర్ మెట్రో లైన్‌ను ఆగస్టు 15న ప్రారంభించాలనుకున్నామని కానీ, కొన్ని అనుమతులు రానందుకే ఆలస్యమవుతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎల్బీనగర్లోని కామినేని ఫ్లై ఓవర్ ఎడమ వైపు ప్రారంభించిన కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మెట్రో సెఫ్టీ అథారిటీ పర్మిషన్ రానందుకే ఆలస్యమవుతోందని, సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభిస్తామని తెలిపారు. ‘హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లాలో రోడ్ల అభివృద్ధి 46 వేల కోట్లు తో సాగుతున్నాయి. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఇబ్బందులు కలగకుండ బ్రిడ్జీల నిర్మాణాలు. మహిళలకు మంచినీటి ఇబ్బందులు రాకుండా 1960 కోటలతో పనులు చేపట్టాం. రంగారెడ్డి జిల్లాలో లక్ష మంది పేదలకు ఇళ్ళ పట్టాలు, మరో లక్షమంది కి డబుల్ బెడ్ రూంలను నిర్మిస్తున్నాం. హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లా పరిసరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంన్నామ’ని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ‘కెటిఆర్ హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చి దిద్దుతున్నారు. వినూత్న ఆలోచనలు.. కొత్త దృక్పథంతో అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ది పధకాలకు మా మద్దతు ఉంటుంద’ని ఎల్ బి నగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అన్నారు. ‘కామినేని వద్ద 944 మీటర్ల ఫ్లై ఓవర్ ను నిర్మించాము. 16 నెలల్లో ఫ్లై ఓవర్ ను నిర్మించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నగరంలో ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నామ’ని కమిషనర్ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్బీ నగర్ సర్కిల్ కు మెట్రో స్టేషన్‌కు, లేదా కామినేని వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ కు అమరుడు శ్రీకాంతా చారి పేరు పెట్టాలని నిరసన కారులు ఆందోళన చేపట్టారు. -
రెండు నెలల్లో ఎల్బీనగర్ మెట్రోమార్గం రెడీ!
హైదరాబాద్: ఎల్బీనగర్ చింతలకుంట చెక్ పోస్ట్ వద్ద అండర్ పాస్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అండర్ పాస్‌ను సుమారు రూ.12.70 కోట్లతో నిర్మించారు. నేటి నుంచి అండర్ పాస్ అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎల్బీనగర్ మార్గంలో రెండు నెలల్లో మెట్రో రైలు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. నగరంలోని 52 రద్దీ ప్రాంతాలలో సిగ్నల్ ఫ్రీ జంక్షన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఎస్ఆర్డీపీతో పాటు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఆర్డీపీలో భాగంగా రూ.3 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. -
ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్ : ఔటర్ రింగు రోడ్డులో భాగంగా కండ్లకోయ వద్ద నిర్మించిన 1.10 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేను తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. సుమారు రూ.125 కోట్ల వ్యయంతో నిర్మించిన కండ్లకోయ ఎక్స్‌ప్రెస్‌వేతో 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం వినియోగంలోకి రానుంది. ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం రూ.6696 కోట్ల జైకా నిధులతో పూర్తి చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం 2005లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైంది. ఆయన హయాంలోనే దాదాపు 78 కిలోమీటర్ల ఔటర్ రింగు రోడ్డు వినియోగంలోకి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన గొడవలతో పనుల్లో వేగం మందగించింది. తెలంగాణ ఏర్పాటై టీఆర్ఎస్ పాలనలోకి వచ్చిన తర్వాత పనులు వేగిరం పుంజుకున్నాయి. టోల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్తోపాటు, టోలు వసూలు, టోలు కనోపీలను మంత్రి ప్రారంభించారు. కండ్లకోయ ఇంటర్చేంజ్ వద్ద 8 లేన్లతో నిర్మించిన రోడ్డులో రెండు ఎంట్రీ, రెండు ఎగ్జిట్ ర్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ..కోర్టులో ఎన్ని చిక్కులు ఎదురైనా ఈ రోజు ఔటర్ రింగు రోడ్డు ప్రారంభమైందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై చాలా మంది ప్రయాణం కొనసాగిస్తున్నారని, అలాగే హైదరాబాద్ మహానగరంలో ఎస్ఆర్డీపీ పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. 19 ఇంటర్ చేంజ్‌లలో 19 టోల్ మెనేజ్మెంట్ బిల్డింగ్‌లకు ఈరోజు శంకుస్థాపన చేశామని తెలిపారు. నగరాన్ని కూడా విస్తరిస్తున్నామని, 35 రేడియల్ రోడ్డులను కూడా పూర్తి చేస్తామని వివరించారు. భవిష్యత్తులో ఔటర్ రింగ్ రోడ్డులో టౌన్ షిప్‌లను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ముఖ్యమైన పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పారు. మిషన్ భగీరథ పేరుతో ఔటర్ రింగ్ రోడ్డులో మొత్తం వాటర్ సదుపాయం కల్పించామని అన్నారు. ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఇంటర్ గ్రిడ్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
12 ఏళ్ల తర్వాత నూతన భవనంలోకి..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఉనికిలోకి వచ్చిన 12 సంవత్సరాల తర్వాత మంగళవారం సొంత భవనంలోకి మారనుంది. అత్యాధునిక హంగులతో కూడిన సీఐఐ నూతన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభిస్తారు. ఇప్పటివరకూ ఆగస్ట్ క్రాంతిభవన్, పాత జేఎన్‌యూ బిల్డింగ్‌ల నుంచి సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి. సువిశాల ప్రాంగణంలో నూతన భవనాన్ని నిర్మించారు. త మ కేసుల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా పెద్దసంఖ్యలో పిటిషనర్లు తరలివస్తున్న క్రమంలో పాత కార్యాలయం రద్దీని అధిగమించకపోవడంతో నూతన భవనాన్ని నిర్మించారు. మునిర్కాలో కొలువుతీరిన సీఐసీ భవనంలో అత్యాధునిక సాంకేతక సదుపాయాలున్నాయని..దీని నిర్మాణాన్ని నేషనల్ బిల్డింగ్ కన్స్ర్టక్షన్ కార్పొరేషన్ రికార్డు సమయంలో పూర్తిచేసిందని సీఐసీ వర్గాలు పేర్కొన్నాయి. ఐదంతస్తులతో కూడిన ఈ భవనంలో ఐటీ, వీడియో కాన్ఫరెన్స్ వంటి సదుపాయాలున్న హియరింగ్ రూమ్‌లు అందుబాటులోకి రానున్నాయి. -
అట్టహాసంగా తెలుగు మహాసభలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : అట్టహాసంగా ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ వేడుకలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర విద్యాసాగర్ రావుతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు, తెలుగు సాహితీ వేత్తలు, పరిశోధకులు విద్యార్థులతో ఎల్బీ స్టేడియం నిండిపోయింది. కాకతీయ తోరణంతో రంగురంగుల విద్యుద్దీపాలతో వేదిక మొత్తం కళకళలాడుతోంది. పేరడీ నృత్యంతో మహాసభలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ వైభవాన్ని చాటేలా ఉత్సవాలు జరగనున్నాయి. -
సమగ్రాభివృద్ధే లక్ష్యం
వరంగల్ అర్బన్ జిల్లా ఆవిర్భవించిన ఏడాదిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో జిల్లా యంత్రాంగం ముందంజలో ఉంది. రానున్న మూడు నుంచి ఐదేళ్లలో నగరం రూపురేఖలు మారనున్నాయి. సుందర, పరిశుభ్రత, హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టే పథకాలపై పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేశాం. ఇప్పటికే అమలు చేస్తున్నాం. – అమ్రపాలికాట, కలెక్టర్ వరంగల్, హన్మకొండ: ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేసి జిల్లాను సమగ్రాభివృద్ధి చేయడమే లక్ష్యమని వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో బుధవారం నిర్వహించిన వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా ఆవిర్భావ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసుకుందామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం కంకణబద్ధుడై కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వంతో అన్ని వర్గాలకు మేలు చేకూరే పథకాలు అమలు చేస్తూ అవినీతి రహిత పాలన అందిస్తున్నారన్నారు. ప్రజలకు పరిపాలన పారదర్శకంగా ఉండేందుకు.. పరిపాలన సౌలభ్యానికే చిన్న జిల్లాలు ఏర్పాటు చేశారన్నారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో సామాన్య ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చి తమ పనులు తాము చేసుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. అధికారులకు సైతం పర్యవేక్షణ సులువుగా ఉందన్నారు. తద్వారా ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారానికి నోచుకుంటున్నాయని వివరించారు. అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు వరంగల్ నగరంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. ఈ క్రమంలో వరంగల్ నగరానికి రాష్ట్ర బడ్జెట్లో ఏడాదికి రూ.300 కోట్లు కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. అభివృద్ధికి బలమైన పునాదులు పడ్డాయని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి పటిష్టమైన ప్రణాళిక రూపొందించారన్నారు. వచ్చే ఎన్నికల నాటికి వరంగల్ నగరం అద్భుతమైన అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రూ.542 కోట్లతో మిషన్ భగీరథ పనులు నగరంలో ప్రారంభమయ్యాయన్నారు. వచ్చే ఏడాది నాటికి ఇంటింటికీ శుద్ధి చేసిన తాగు నీటిని అందించనున్నట్లు చెప్పారు. 58 వేల ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఆదా చేస్తున్నామన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన లేని నగరంగా చేశామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 38 నుంచి 28వ ర్యాంక్‌కు చేరుకున్నామన్నారు. టూరిజంలో స్వచ్ఛత అవార్డు, స్కోచ్ అవార్డులు అందుకున్నామన్నారు. నగరంలో పరిశుభ్రత, తాగునీరు అందించడంలో ఏడాది కాలంలో సఫలమయ్యాన్నారు. దీనికి సహకరించిన కలెక్టర్, ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పర్యాటకులను విశేషంగా అకట్టుకుంటామన్నారు. కాగా, స్త్రీనిధి కార్యక్రమం కింద మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.7.60 కోట్ల చెక్కులను అందించారు. కార్యక్రమంలో ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, జాయింట్ కలెక్టర్లు హరిత, దయానంద్. ఐసీడీఎస్ మహిళ ఆర్గనైజర్ కమరున్నీసా బేగం, ట్రైనీ కలెక్టర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
కృషి, పట్టుదలతో ఐఏఎస్ సాధ్యమే
దూరదర్శన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ పద్మనాభరావు తొర్రేడులో కృష్ణ ప్రదీప్స్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ప్రారంభం రాజమహేంద్రవరం రూరల్ : ఐఏఎస్ చదవాలంటే కేవలం ఐఏఎస్, ఐపీఎస్, ధనికుల పిల్లలకు మాత్రమేనని అపోహలలో ఉన్నారని, కాని కృషి, పట్టుదలతో చదివితే ఎవరైనా సివిల్స్‌లో ర్యాంకు సాధించవచ్చని దూరదర్శన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ పద్మనాభరావు పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌కు చెందిన కృష్ణ ప్రదీప్స్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ నాలుగో బ్రాంచిని తొర్రేడు గ్రామంలో ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్ట మొదటిసారిగా ఇంటర్, డిగ్రీ నుంచే సివిల్స్ శిక్షణ ప్రారంభించారు. అకాడమీ ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డాక్టర్ పద్మనాభరావు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపాలకృష్ణ సాధారణ కుటుంబం నుంచి వచ్చాడని, అతను సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించాడన్నారు. 2016 సివిల్స్‌కు 11 లక్షల మంది దరఖాస్తు చేస్తే 4.5 లక్షలు మంది పరీక్ష రాశారని, అందులో 15 వేల మంది మెయిన్స్‌కు అర్హత సాధించారన్నారు. ఇంటర్వ్యూలకు మూడు వేల మంది అర్హత సాధించగా, 1099 మంది సివిల్స్‌కు సెలక్ట్ అయ్యారని పద్మనాభం తెలిపారు. సివిల్స్‌లో ర్యాంకులు ఆధారంగా ఐఏస్తో పాటు, ఐపీఎస్, ఐఆర్ఎస్ తదితర 24 గ్రూపులలో ఉద్యోగాలు సాధించ వచ్చన్నారు. సివిల్స్‌లో శిక్షణ పొందిన వారు గ్రూప్–1, గ్రూప్–2, బ్యాంకు పరీక్షలలోను విజయం సాధించవచ్చన్నారు. కృష్ణప్రదీప్స్అకాడమిలో ఇంటర్, డిగ్రీ నుంచి సివిల్స్‌కు శిక్షణ పొందడం వల్ల 22 ఏళ్లకే మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంకు సాధించవచ్చన్నారు. ఆ వయస్సులో సివిల్స్ ఎంపిక కావడం వల్ల కేబినెట్ సెక్రటరీ హోదా వరకు పనిచేసే అవకాశం వస్తుందని పద్మనాభరావు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ రిటైర్డు డిప్యూటీ డైరెక్టరు ఏవీవీడీఎం ప్రసాద్ మాట్లాడుతూ సివిల్స్‌లో మూడవర్యాంకు సాధించిన గోపాలకృష్ణను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్ధులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎం.వరప్రసాద్ మాట్లాడుతూ సోషల్, సైన్స్ చదవడం ద్వారా సివిల్స్‌తో పాటు, అంతర్జాతీయ, నాన్ గవర్నమెంటు సర్వీసులలో ఉన్నతమైన ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రతి విద్యార్థి చదవుతోపాటు రైటింగ్ స్కిల్స్ మెరుగు పర్చుకోవాలని సూచించారు. ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమి డైరెక్టర్ కృష్ణప్రదీప్ మాట్లాడుతూ 2003 నుంచి హైదరాబాద్‌లో ఐఏఎస్ అకాడమీని స్థాపించామని, అప్పటి నుంచి ప్రతి ఏడాది సుమారు 50 మంది సివిల్స్‌లో ర్యాంకులు సాధిస్తున్నారన్నారు. మొదటి ప్రయత్నంలోనే విద్యార్థులు సివిల్స్‌లో ర్యాంకు సాధించాలన్న ఉద్ధేశ్యంతోనే ఇంటర్, డిగ్రీతో సివిల్స్ శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రిన్సిపాల్ ఆచారి, «సీఈవో ధరణి, అకడమిక్ డైరెక్టర్ ఎస్వీ నారాయణ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
మనసు నేపథ్యంగా ‘మనలో మనం’
ఆసక్తికరంగా రచించిన డాక్టర్ రామారెడ్డి ఆవిష్కరణసభలో ‘సైకాలజీ టుడే’ ఎడిటర్ సురేష్ సాక్షి, రాజమహేంద్రవరం : మానసిక ధోరణులు అంశంగా ఉండే కథలు పెద్దగా ఆసక్తిగా ఉండవని, కానీ డాక్టర్ కర్రి రామారెడ్డి వ్యక్తుల మనసుల నేపథ్యంలో రాసిన ‘మనలో మనం’ పుస్తకం మసాలాతో పాటు అద్భుతమైన శైలి ఆకట్టుకుంటోందని న్యూవిజన్ పబ్లిషర్, సైకాలజీ టుడే ఎడిటర్ డాక్టర్ ఎస్వీ సురేష్ అన్నారు. బీసీ రాయ్ అవార్డు గ్రహీత, ప్రముఖ మానసిక వైద్యనిపుణుడు డాక్టర్ రామారెడ్డి రచించిన ‘మనలో మనం’ పుస్తకావిష్కరణ ఆదివారం నగరంలోని మానస వైద్యశాలలో జరిగింది. ముఖ్యఅతిథిగా సురేష్ మాట్లాడుతూ రామారెడ్డి గతంలో రాసిన ‘మనలో ఒకరు’ పుస్తకాన్ని కూడా తామే ప్రచురించామని, ఆ పుస్తకం రెండో ముద్రణ వేసేలా విరివిగా అమ్ముడయిందని చెప్పారు. ‘మనలో మనం’ చదివేటప్పుడు మనం, మన చుట్టూ ఉన్న వ్యక్తులను చూస్తున్నట్లు ఉంటుందని విశ్లేషకులు ఫణి నాగేశ్వరరావు పేర్కొన్నారు. వైద్యునిగా సేవలందిసూ్తనే రామారెడ్డి ప్రసంగాలు చేయడం, వివిధ పత్రికలకు 3,500 వ్యాసాలు రాయడం గొప్పవిషయమన్నారు. డాక్టర్ రామారెడ్డి మాట్లాడుతూ ఇది తాను రాసిన మూడో పుస్తకమని, గతంలో ‘మనిషి మనసు’, ‘మనలో ఒకరు’ మాదిరిగానే ఈ పుస్తకాన్ని పాఠకులు ఆదరిస్తారన్న నమ్మకముందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి బీసీ రాయ్ అవార్డు అందుకున్న సైకియాట్రిస్ట్ తానే కావడం సంతోషంగా ఉందన్నారు. -
ఘనంగా కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ
జి.మామిడాడ(పెదపూడి) : జిల్లాలోనే ఎత్తయిన విగ్రహంగా సుమారు 41 అడుగుల్లో నిర్మించిన మలేషియన్ మురుగున్ కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ, ఆవిష్కరణ గ్రామంలోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది. గ్రామ మాజీ సర్పంచి, దివంగత ద్వారంపూడి అమ్మిరెడ్డి(చింతపండు) జ్ఞాపకార్థం ఆయన సోదరుడు వైఎస్సార్సీపీ నేత ద్వారంపూడి వెంకటరెడ్డి(చింతపండు) ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. రాయవరం మండలం వెదురుపాక గ్రామంలోని శ్రీ విజయపీఠాధిపతులు వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం(గాడ్) భార్య సీతమ్మ ప్రతిష్ఠకు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆదిలక్ష్మి దంపతులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ విభాగం కార్యదర్శి నల్లమిల్లి దుర్గా ప్రసాద్‌రెడ్డి(ఎన్డీఆర్), వైఎస్సార్ సీపీ మండపేట నియోజక వర్గ కో ఆర్డినేటర్ లీలాకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి అద్దంకి ముక్తేశ్వరరావు, రామచంద్రపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అ«ధ్యక్షుడు చంటి రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త కర్ణాటక త్రినాథ్‌రెడ్డి, కేపీఆర్ ఫెర్టిలైజర్స్ చైర్మన్ కొవ్వూరి పాపారెడ్డి, తదితరులు హాజరయ్యారు. డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ పూర్వం నుంచి ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి గాంచిన జి.మామిడాడ గ్రామంలో అయ్యప్పస్వామి ఆలయం వద్ద కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం నిర్మించడం గ్రామానికి ఎంతో మంచిదన్నారు. మంచి ఆలోచనతో ఈ విగ్రహం నిర్మించిన ద్వారంపూడి వెంకటరెడ్డి అభినందనీయుడన్నారు. -
రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమిస్తాం
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాధేయపాలెంలో రంగా విగ్రహావిష్కరణ రాజానగరం : కాపులకు బీసీ రిజర్వేషన్ సదుపాయం కల్పించే వరకు తాము చేపట్టిన ఉద్యమం ఆగదని, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ప్రాణం ఉన్నంతవరకు న్యాయపోరాటం చేస్తూనే ఉంటానని కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. కాపులంతా సమైక్యతతో ముందుకు వచ్చి ఉద్యమంలో పాలుపంచుకుంటేనే భావితరాల భవిషత్తు బాగుంటుందన్నారు. రాజానగరం మండలం రాధేయపాలెంలో రంగ మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్మించిన వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ముద్రగడ ఆదివారం విష్కరించారు. అనంతరం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మండారపు వీర్రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పాలకుల దగాకు గురై నిద్రపోతున్న కాపుజాతిని తాను అధికారంలోకి వస్తే బీసీల్లో చేరుస్తానంటూ మేలుకొలిపిన చంద్రబాబును తాను ఇచ్చిన మాటను నెరవేర్చమని కోరుతున్నామన్నారు. అంతేగానీ తాము నేరాలు, ఘోరాలు చేయడం లేదన్నారు. రిజర్వేషన్ల సాధనకు వెనుకడుగు వేసేది లేదని, మున్ముందు రోజుల్లో కూడా ఈ పోరాట పటిమను ఇలాగే కొనసాగిస్తూ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో మీకు నిరంతరం అండగా నిలుస్తున్న జక్కంపూడి కుటుంబానికి కూడా మీరెప్పుడూ అండగా ఉండాలని కోరుతున్నానన్నారు. కులమతాలకు అతీతంగా పేదలందరికీ అండగా నిలిచి వారి పాలిట పెన్నిధిగా నిలిచిన వంగవీటి మోహనరంగా అని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. రిజర్వేషన్లు సాధించే వరకు కాపు ఉద్యమం ఆగదని కాపు ఉద్యమ నాయకుడు ఆకుల రామకృష్ణ అన్నారు. ఇక్కడ జరుగుతున్న కాపు ఉద్యమ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో కూడా కనిపిస్తుందన్నారు. కాపుల ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచిన రంగా విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రంగా, జక్కంపూడి రామ్మోహనరావు వంటి వారు జనంలో ఏనాడూ చిరంజీవులుగానే ఉంటారన్నారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, కాపు ఉద్యమ నాయకులు ఏసుదాసు, కలవకొలను తాతాజీ, జక్కంపూడి గణేష్, అనదాసు సాయిరామ్, పేపకాయల విష్ణుమూర్తి, ద్వారంపూడి నాగమునేశ్వర్రావు, గండి నానిబాబు, ఉండమట్ల రాజబాబు, దేశాల శ్రీను, జక్కంపూడి జగపతిరావు, ప్రగడ చక్రి, అబ్బిరెడ్డి వెంకటేశ్వర్రావు, బీసీ సంఘాల నాయకులు వాసంశెట్టి పెద్దవెంకన్న, గోసాల చిన్న, రంగమిత్ర మండలి అధ్యక్షుడు సాపిరెడ్డి దుర్గారావు, సభ్యులు పాల్గొన్నారు. నేతల విగ్రహాల సంరక్షణ కూడా చూడాలి విగ్రహాలను ఏర్పాటుచేయడంతోనే పని అయిపోయిందనుకోవద్దని, వాటిని దుమ్ముధూళి, మలినాల నుంచి కాపాడుతుండాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. ఇందుకు తాము బాధ్యత తీసుకుంటామని కాపు నాయకులు ఆకుల వీర్రాజు, జక్కంపూడి గణేష్ మాట ఇచ్చిన తరువాతనే తాను ఈ కార్యక్రమానికి వచ్చానన్నారు. -
ఆయన రచనలు తెలుగు విజ్ఞాన భాండాగారం
అద్దంకి కేశవరావు విగ్రహావిష్కరణ సభలో ఎమ్మెల్సీ ఆర్ఎస్, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పొట్లూరి కొత్తపేట : సాహితీవేత్త, రచయిత, కవి దివంగత అద్దంకి కేశవరావు జీవితం, ఆయన రచనలు తెలుగు విజ్ఞాన భాండాగారమని ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం (ఆర్ఎస్), రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ అన్నారు. కేశవరావు 98వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహం, రచనల ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానికప్రియదర్శినీ బాలవిహార్ ప్రాంగణంలో ప్రియదర్శినీ కరస్పాండెంట్ అద్దంకి బుద్ధచంద్రదేవ్ ఆధ్వర్యంలో జరిగిన సభకు ప్రముఖ కవి, కళాసాహితి ప్రధాన కార్యదర్శి జి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ముందుగా గ్రామ సర్పంచ్ మిద్దే అనూరాధ, ఎంపీపీ రెడ్డి అనంతకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రముఖ శిల్పి డి రాజ్‌కుమార్‌వుడయార్ రూపొందించి, సమర్పించిన అద్దంకి కేశవరావు విగ్రహాన్ని ముఖ్యఅతిథి ఎమ్మెల్సీ ఆర్ఎస్ ఆవిష్కరించగా, కేశవరావు రచించిన బుద్ధ జయంతి పుస్తకాన్ని ఎంపీపీ రెడ్డి అనంతకుమారి ఆవిష్కరించారు. బౌద్ధ గ్రంథాలయం బ్లాకును మరో ముఖ్య అతిథి అధికార భాషా సంఘం అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ మాట్లాడుతూ తండ్రిగా, గురువుగా అద్దంకి కేశవరావు తన కుటుంబానికే కాక రాష్ట్ర వ్యాప్తంగా నాలాంటి వారి ఎందరికో ఉత్తమ విద్య, విజ్ఞానాన్ని అందించారన్నారు. తండ్రి రచనలు వెలుగులోకి తెచ్చి, ఆయన ఆశయాలను బతికిస్తున్న బుద్ధచంద్రదేవ్, ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. పొట్లూరి మాట్లాడుతూ అతికొద్ది మంది అపూర్వ కవులలో కేశవరావు ఒకరని అన్నారు. జాతికి అనేక గ్రంథాలు, కవితలు, నవలలు అందించిన కేశవరావు తెలుగుజాతి చరిత్ర పురుషుడని అన్నారు. విగ్రహ శిల్పి రాజ్కుమార్వుడయార్ను అతిథులు ఘనంగా సత్కరించారు. ప్రియదర్శినీ బాలల నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సభలో జెడ్పీటీసీ సభ్యుడు ధర్నాల రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ బండారు వెంకటసత్తిబాబు, స్థానిక ఏరియా ఆసుపత్రి కమిటీ చైర్మన్ సలాది రామకృష్ణ, ఎంఈఓ వై సత్తిరాజు, జంగారెడ్డిగూడెం బీపీఈటీ ప్రిన్సిపాల్ సీహెచ్ వెంకట్రావు, కళాసామితి అధ్యక్షుడు పెన్మెత్స హరిహరదేవళరాజు తదితరులు పాల్గొన్నారు.