Ayodhya: రామమందిర ప్రారంభంపై జేడీయూ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు | Jdu Mp Controvorsial Comments On Ram Temple Inaguration | Sakshi
Sakshi News home page

రామమందిర ప్రారంభంపై జేడీయూ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Published Sat, Jan 6 2024 1:50 PM | Last Updated on Sat, Jan 6 2024 2:26 PM

Jdu Mp Controvorsial Comments On Ram Temple Inaguration - Sakshi

పాట్నా: ఈ నెల 22న అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభ వేడుకపై జేడీయూ ఎంపీ కౌశలేంద్ర కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నలందలో ఆయన మీడియాతో మాట్లాడారు. అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభ వేడుక ఎవరి కొడుకుదైనా పెళ్లా లేదంటే ఎవరి తండ్రిదైనా తద్దినమా ఆహ్వానాలిచ్చి పిలవడానికి అని ప్రశ్నించారు.

అయోధ్యలో జరిగే వేడుకకు తనకు  ఆహ్వానం రాలేదని, అంత మాత్రాన తాను వెళ్లకూడదా చెప్పాలని కుమార్‌ డిమాండ్‌ చేశారు. అయోధ్య అందరిదన్నారు. రామమందిర ప్రారంభ వేడుకకు ఆహ్వానాలు పంపేవారు ఫూల్స్‌ అని విమర్శించారు.

‘అయోధ్యకు సతీసమేతంగా వెళ్లకపోతే ఆ ఫలం దక్కదు. ఎవరైతే భార్య లేకుండా 22న అక్కడికి వెళుతున్నారో వారికి ఈ ఏడాది లక్ష్యం నెరవేరదు’అని ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి కౌశలేంద్ర కుమార్‌ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

కౌశలేంద్ర కుమార్‌ వ్యాఖ్యలపై రామ జన్మభూమి గుడి ముఖ్య పురోహితుడు ఆచార్య సత్యేంద్రదాస్‌  తీవ్రంగా స్పందించారు. మూర్ఖులు మాత్రమే అలాంటి భాష ఉపయోగిస్తారని మండిపడ్డారు.

ఇదీచదవండి..ఢిల్లీ ఎయిర్‌పోర్టు వద్ద భారీ క్రేన్‌.. ప్రమాదంలో పడ్డ విమానాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement