ఘనంగా కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ
ఘనంగా కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ
Published Sun, Mar 5 2017 9:12 PM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM
జి.మామిడాడ(పెదపూడి) : జిల్లాలోనే ఎత్తయిన విగ్రహంగా సుమారు 41 అడుగుల్లో నిర్మించిన మలేషియన్ మురుగున్ కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ, ఆవిష్కరణ గ్రామంలోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది. గ్రామ మాజీ సర్పంచి, దివంగత ద్వారంపూడి అమ్మిరెడ్డి(చింతపండు) జ్ఞాపకార్థం ఆయన సోదరుడు వైఎస్సార్‌సీపీ నేత ద్వారంపూడి వెంకటరెడ్డి(చింతపండు) ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. రాయవరం మండలం వెదురుపాక గ్రామంలోని శ్రీ విజయపీఠాధిపతులు వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం(గాడ్) భార్య సీతమ్మ ప్రతిష్ఠకు హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆదిలక్ష్మి దంపతులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యూత్ విభాగం కార్యదర్శి నల్లమిల్లి దుర్గా ప్రసాద్‌రెడ్డి(ఎన్‌డీఆర్), వైఎస్సార్ సీపీ మండపేట నియోజక వర్గ కో ఆర్డినేటర్ లీలాకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి అద్దంకి ముక్తేశ్వరరావు, రామచంద్రపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అ«ధ్యక్షుడు చంటి రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త కర్ణాటక త్రినాథ్‌రెడ్డి, కేపీఆర్ ఫెర్టిలైజర్స్ చైర్మన్ కొవ్వూరి పాపారెడ్డి, తదితరులు హాజరయ్యారు. డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ పూర్వం నుంచి ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి గాంచిన జి.మామిడాడ గ్రామంలో అయ్యప్పస్వామి ఆలయం వద్ద కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం నిర్మించడం గ్రామానికి ఎంతో మంచిదన్నారు. మంచి ఆలోచనతో ఈ విగ్రహం నిర్మించిన ద్వారంపూడి వెంకటరెడ్డి అభినందనీయుడన్నారు.
Advertisement