
జైపూర్: రాజస్థాన్‌లో క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫ్యాన్స్‌పై లాఠీచార్జీ జరిగింది. ధోనిని చూసేందుకు ఫ్యాన్స్ అధిక సంఖ్యలో రావడంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఫ్యాన్స్‌ను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలో టెంట్లు చిరిగిపోయి, కుర్చీలు విరిగిపోయాయి. ప్రశాంతంగా ఉండాలని పోలీసులు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని అభిమానులు.. బారికేడ్లు తోసుకుని ధోనితో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు లాఠీలకు పని చెప్పక తప్పలేదు. ఊహించని ఈ హఠాత్పరిణామానికి షాక్‌తిన్న ధోని.. హడావిడిగా రిబ్బన్ కట్ చేసి వెళ్లిపోయారు. కాగా, స్నేహితుల కోరిక మేరకు జాలోర్ జిల్లాలోని జాఖల్ గ్రామంలో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు ధోనీ అక్కడికి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment