
సాక్షి, గచ్చిబౌలి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. భూముల అమ్మకాల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విద్యార్థుల డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆందోళన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో, ఒక్కసారిగా పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
మరోవైపు.. హెచ్‌సీయూ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. యూనివర్సిటీ విద్యార్థులు నాలుగో రోజు ఆందోళనలు తెలుపుతున్నారు. అక్కడున్న 400 ఎకరాలను యూనివర్సిటీకి అప్పగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో యూనివర్సిటీ చుట్టూ అన్ని గేట్ల వద్ద పోలీసులు మోహరించారు.

LathiCharge on Students of University of Hyderabad who have protesting to stop cutting down the 400 acres Trees in the campus pic.twitter.com/1iQC52779t
— Dr.Krishank (@Krishank_BRS) April 2, 2025
అనంతరం, ఉద్యోగులను, విద్యార్థులను మాత్రమే యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. డ్రోన్లు ఎగురవేసి వీడియోలు తీసిన ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి యూనివర్సిటీకి బీజేపీ మహిళా మోర్చా నాయకులు వచ్చారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు.
#HCU విద్యార్థులపై రేవంత్ సర్కార్ దౌర్జన్యం
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను గొడ్లను కొట్టినట్టు కొడుతున్న పోలీసులు 😡#ShameOnRahulGandhi#SaveHCU#SaveHCUBioDiversity pic.twitter.com/SKlUxibKEq— BRS News (@BRSParty_News) April 2, 2025