
సాక్షి, హైదరాబాద్ : అట్టహాసంగా ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ వేడుకలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర విద్యాసాగర్ రావుతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు, తెలుగు సాహితీ వేత్తలు, పరిశోధకులు విద్యార్థులతో ఎల్బీ స్టేడియం నిండిపోయింది. కాకతీయ తోరణంతో రంగురంగుల విద్యుద్దీపాలతో వేదిక మొత్తం కళకళలాడుతోంది. పేరడీ నృత్యంతో మహాసభలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ వైభవాన్ని చాటేలా ఉత్సవాలు జరగనున్నాయి.