కారులో తరలిస్తున్న గంజాయి పట్టివేత
Published Thu, Sep 19 2013 3:26 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM
కామారెడ్డి/భిక్కనూరు, న్యూస్‌లైన్ :భిక్కనూరు మండలం పొందుర్తి చెక్‌పోస్టు వద్ద 44వ జాతీయ రహదారిపై బుధవా రం తెల్లవారుజామున గంజాయి తరలిస్తున్న కారును ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన కు సంబంధించి కా మారెడ్డి ఎంవీఐ పా పారావు తెలిపిన వి వరాల ప్రకారం... ఏఎంవీఐ రవీందర్ రోజులాగే చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా, హైదరాబాద్ వైపు నుంచి వచ్చిన (ఏపీ 21 ఏఎల్ 9579) నంబరు గల టాటా ఇండిగో కారులో ప్ర యాణిస్తున్నవారు రోడ్డుపై కారును వ దిలి పారిపోయారు.
అనుమానం వచ్చిన ఏఎంవీఐ, సిబ్బంది కారును తనిఖీ చే యగా డిక్కీలో గట్టాలుగా కట్టిన గంజా యి లభ్యమైంది. దీంతో కారును చెక్‌పోస్టు వద్దకు తీసుకెళ్లి పూర్తిగా పరిశీలించారు. అందులో 2 కిలోల బరువున్న 66 గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. గంజాయి వాసన బ యటకు రాకుండా ఉండేందుకు గాను అడోని ల్ కాయల్‌ను ఉంచారు. కాగా కారు నంబరు, అందులో ఉన్న ఆర్సీ ఆధారంగా విశాఖ జిల్లా గాజువాకలోని చిన్నగంట్యాలకు చెందిన జి.సత్యవతి పేరిట ఉన్నట్టు గుర్తించారు. కారు వివరాలను సేకరించిన ఆర్టీఏ అధికారులు భిక్కనూరు పోలీసులకు సమాచారం అందించగా సీఐ సర్దార్‌సింగ్, ఎస్సై గంగాధర్‌రావ్‌లు అక్కడికి చేరుకుని గంజాయితో ఉన్న కారును స్వాధీనం చేసుకున్నారు.
సిబ్బందిని అభినందించిన డీటీసీ...
కారులో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్న ఏఎంవీఐ రవీందర్, సిబ్బందిని జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ రాజారత్నం అభినందించారు. బుధవారం ఉదయం ఆయన పొందుర్తి చెక్‌పోస్టు వద్దకు వచ్చి కారును, గంజాయిని పరిశీలించారు.
చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నాం
- డిప్యూటీ ట్రాఫిక్ కమిషనర్ రాజారత్నం
కామారెడ్డి, న్యూస్‌లైన్ : జిల్లాలో రవాణాశాఖ చెక్‌పోస్టుల వద్ద ఎప్పటికప్పుడు వాహనాలను తనిఖీ చేస్తున్నట్టు రవాణా శాఖ జిల్లా డిప్యూటీ ట్రాఫిక్ కమిషనర్ రాజారత్నం తెలిపారు. బుధవారం పొందుర్తి ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద గంజాయితో వెళ్తున్న కారును సిబ్బంది పట్టుకున్న విషయం తెలియడంతో ఆయన చెక్‌పోస్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయ న విలేకరులతో మాట్లాడుతూ... తమ సిబ్బం ది అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే గంజాయితో వెళుతున్న కారు చిక్కిందని అన్నారు.
గంజాయితో వెళ్తున్న కారును పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు. పట్టుకున్న కారు విశాఖ జిల్లా గాజువాక పరిధిలోని చిన్నగంట్యాలకు చెందిన సత్యవతి పేరుతో రిజిస్టరై ఉందన్నారు. కారును తనిఖీ చేయగా అందులో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తిం చి తమకు సమాచారం అందించారని తెలి పారు. 2 కిలోలు, ఆపైన బరువున్న ఎండు గం జాయి ప్యాకెట్లు 66 ఉన్నాయని, వాటి బరువు సుమారు 132 కిలోలు ఉండి ఉంటుందని అంచనా వేసినట్టు చెప్పారు. దాని విలువ రూ. 8 లక్షల వరకు ఉండవచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారని చెప్పారు. ఆయన వెంట ఎంవీఐ పాపారావ్, ఏఎంవీఐ రవీందర్, సిబ్బంది ఉన్నారు.
Advertisement
Advertisement