గోపాల్‌పేటకు ముప్పు తప్పించిన ముందుచూపు
40 ఏళ్ల క్రితమే రోడ్డుకు 50 అడుగుల అవతల ఇళ్ల నిర్మాణం
నేడు జాతీయ రహదారిగామారినా భద్రంగా ఆస్తులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రోడ్డు విస్తరణ అంటేనే జనం గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. ముఖ్యంగా ప్రధాన రోడ్ల వెంట ఇళ్లు ఉన్నవారైతే తమ నివాసాలకు ఎక్కడ ఎ సరు వస్తుందోనని ఆందోళన చెందుతుంటారు. కానీ, ఒక ఊళ్లో మాత్రం జాతీయ రహదారి విస్తరణ చేపట్టినా ఇళ్ల కూల్చివేసే అవసరం ఏర్పడలేదు. 40 ఏళ్ల క్రితం స్థానిక ప్రజాప్రతినిధులు ముందుచూపుతో తీసుకున్న నిర్ణయమే నేడు వారిని కాపాడింది.
ఆ గ్రామమే కామారెడ్డి జిల్లా నాగి రెడ్డిపేట మండల కేంద్రమైన గోపాల్‌పేట. హైదరాబాద్ నుంచి మెదక్, ఎల్లారెడ్డి మీదుగా బాన్సువాడ, రుద్రూర్, బోధన్ వరకు రహదారిని ఎన్‌హెచ్–765 డీగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ రహదారి గోపాల్‌పేట మీదుగా వెళ్తోంది. విస్తరణలో కొన్ని షెడ్లు, కోకాలు మాత్రమే తొలగించారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఇళ్లేవీ పోవడం లేదు.
నాటి సర్పంచ్ ముందుచూపుతోనే..
నాగిరెడ్డిపేట గ్రామ పంచాయతీలో నాగిరెడ్డిపేట, గోపాల్ పేట, బంజెర గ్రామాలు ఉండేవి. పంచాయతీ నాగిరెడ్డి పే టలో ఉండగా, మండల కార్యాలయాలన్నీ ప్రధాన రహ దారిపై ఉన్న గోపాల్‌పేటలో ఉంటాయి. అందుకే నాగి రెడ్డిపేట మండల కేంద్రంగా గోపాల్ పేటను వ్యవహరి స్తారు. ఈ మధ్యే గోపాల్‌పేట, బంజెర గ్రామాలు పంచా యతీలుగా ఏర్పడ్డాయి.
1981లో ఇక్కడ సర్పంచ్‌గా గెలు పొందిన వి.కిషన్‌రెడ్డి 1992 వరకూ పదవిలో కొనసాగా రు. ఆ సమయంలోనే ఈ రోడ్డు ఎప్పటికైనా కీలకంగా మా రుతుందని ఆలోచించిన కిషన్‌రెడ్డి.. గ్రామస్తులతో చర్చించి రోడ్డు మధ్య నుంచి ఇరువైపులా 50 ఫీట్లు వదలి తేనే అనుమతులు ఇచ్చే పద్ధతి మొదలుపెట్టారు. దీంతో గ్రామ స్తులు రోడ్డుకు ఇరువైపులా 50 ఫీట్ల అవతలే ఇళ్లు నిర్మించుకున్నారు.
అంటే రోడ్డు వెడల్పు వంద ఫీట్లు ఉందన్న మాట. ఇప్పుడు రెండు వరుసల జాతీయ రహదారి, ఇరు వైపులా డ్రైనేజీ, సర్వీసు రోడ్లు నిర్మిస్తున్నారు. అయి నా ఇళ్లు కూల్చే అవసరం ఏర్పడలేదు. అక్కడక్కడా చిన్న చిన్న అరుగులు, మెట్లు కొంత భాగం మాత్రమే పోతున్నాయి.
వేగంగా రోడ్డు నిర్మాణ పనులు
మెదక్ నుంచి ఎల్లారెడ్డి వరకు 43 కిలోమీటర్ల రోడ్డుకు రూ.399.01 కోట్లు, దీనికి కొనసాగింపుగా ఎల్లారెడ్డి నుంచి బాన్సువాడ మీదుగా రుద్రూర్ వరకు 51 కిలోమీటర్ల రోడ్డుకు రూ.499.88 కోట్ల వ్యయంతో విస్తరణ పనులు మొ దలయ్యాయి. రోడ్డు నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment