న్యూఢిల్లీ: డీటీసీకి చెందిన డ్రైవర్లకు మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్)ని శనివారం ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ రవాణా సంస్థ(డీటీసీ)కి చెందిన 600 మంది డ్రైవర్లకు క్యాట్ నాలుగోరౌండ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించింది. వారంతా వైద్యపరంగా విధులకు పనికిరారని,(వర్ణంధత్వం) ఉన్నదని ఇటీవల తేలింది. ఈ విషయమై జస్టిస్ ఆర్. రవీంద్ర భట్, విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం శనివారం క్యాట్ తీరును తప్పుపట్టింది. డ్రైవర్ల నాలుగో రౌండ్ వైద్యపరీక్షల్లో క్యాట్ ఎలాంటి ప్రమాణాలను, మార్గదర్శకాలను జారీ చేయలేదని, మూడోసారి నిర్వహించిన పరీక్షల ఆధారంగానే కొనసాగించారని పేర్కొంది. 600 మంది డ్రైవర్లు తిరిగి ఉద్యోగాలను పొందాలంటే వంధత్వ నిర్ధారణ వైద్యపరీక్షలను మరోసారి క్యాట్ జరిపించాలని ఆదేశించింది. 2013లో వంధత్వ బాధతో ఇబ్బందులు పడుతున్న 600 మంది డ్రైవర్లను డీటీసీ ఉద్యోగాలను తొలగించింది. డ్రైవర్లకు క్యాట్ నాలుగోరౌండ్ నిర్వహించిన వైద్యపరీక్షలు అసమంజమైనవిగాతేలిందని కోర్టు అభిప్రాయపడింది.
డీటీసీ డ్రైవర్లకు వైద్యపరీక్షలు చేపట్టాలి
Published Sun, Nov 2 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM
Advertisement