మహిళపై కానిస్టేబుల్ దాడిని విచారణకు స్వీకరించిన హైకోర్టు
న్యూఢిల్లీ: లంచం ఇవ్వడానికి నిరాకరించిన కారణంతో మహిళపై హెడ్ కానిస్టేబుల్ దాడి చేసిన ఘటనను విచారణకు స్వీకరించాలని ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిర్ణయించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ ఆర్.ఎస్.ఎండ్లాతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ కేసును విచారించనుంది. ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటికి వెళ్తున్న రమణ్‌దీప్ కౌర్‌ను సిగ్నల్ జంప్ చేశారనే కారణంతో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ సతీశ్ చంద్ర రూ.200 లంచం అడిగారు. అమె తిరస్కరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కానిస్టేబుల్ ఆమెపై ఇటుకతో దాడి చేయగా, ఢిల్లీ పోలీసులు హెడ్ కానిస్టేబుల్‌ను డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే.