పువ్వులా.. నవ్వులా! | Dressed In An Indo Western Style For A Photo Shoot | Sakshi
Sakshi News home page

పువ్వులా.. నవ్వులా!

Published Sat, Nov 30 2019 4:19 AM | Last Updated on Sat, Nov 30 2019 4:19 AM

Dressed In An Indo Western Style For A Photo Shoot - Sakshi

ప్రీ వెడ్డింగ్‌ షో అని పెళ్లికి ముందు వధూవరులు వీడియో, ఫొటో షూట్‌లలో పాల్గొనడం, ఆ మధుర జ్ఞాపకాలను పదిల పరుచుకోవడం తెలిసిందే. ఈ ఫొటో షూట్‌కి పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఇండోవెస్ట్రన్‌ స్టైల్‌లో దుస్తులు ధరిస్తుంటారు. అందులో ముఖ్యంగా పెళ్లి కూతురు దుస్తులు చూస్తే గౌన్లు ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. పచ్చని ప్రకృతిలో పువ్వులాంటి గౌన్‌ ధరించిన అమ్మాయి మరింత అందంగా ఆకట్టుకుంటుంది. పెళ్లికూతురు గెటప్‌ కోసమే కాదు, కాక్‌టెయిల్‌ పార్టీలకు, బర్త్‌ డే పార్టీలకు గౌన్‌స్టైల్‌ యువతులకు బాగా నప్పుతుంది. ప్రకృతి నుంచి స్ఫూర్తి పొంది డిజైన్‌ చేసిన గౌన్లు ఇవి. 

►పొరలుపొరలుగా ఉండే పూల రేకలను పోలిన థీమ్‌ ఈ గౌన్ల సొంతం.
►రంగు రంగుల పూల రేకలు, పచ్చని ఆకులు..  ప్రకృతికి ప్రతిబింబం. అదే థీమ్‌తోడిజైన్‌ చేసిన  గౌన్లు ఇవి.  

లైట్‌ మేకప్‌ బెస్ట్‌
►గౌన్లు హైనెక్‌తో ఉంటే చెవులకు చిన్న స్టడ్స్‌ పెట్టుకుంటే సరిపోతుంది
►డీప్‌ నెక్‌ ఉంటే పెద్ద పెద్ద ఇయర్‌ రింగ్స్, చోకర్‌ నెక్లెస్‌ పెట్టుకోవచ్చు
►జుట్టుకు ఒక ఫ్లోరల్‌ హెడ్‌ బ్యాండ్‌ పెట్టుకున్నా చాలు. లేదంటే పెళ్లి వంటి ఫంక్షన్స్‌ అయితే హైబన్‌–లోబన్‌.. వంటివి ట్రై చేయవచ్చు
►మేకప్‌ గాడీగా కాకుండా ధరించిన డ్రెస్‌ను బట్టి ఎంపిక చేసుకోవాలి. గౌన్‌ ముదురు రంగులో ఉంటే మేకప్‌ లైట్‌గా న్యూడ్‌ షేడ్స్‌ వేసుకుంటే బాగుంటుంది
►గౌన్‌ లేత రంగులో ఉంటే బ్రైట్‌ మేకప్‌ను వేసుకోవచ్చు
►ఈ గౌన్లకు యాక్ససరీస్‌ ఎంత తక్కువ ధరిస్తే అంత బాగుంటుంది.

– సాగరికారెడ్డి, అభిజ్ఞారెడ్డి ఫ్యాషన్‌ డిజైనర్స్‌ అండ్‌ స్టైలిస్ట్,
హైదరాబాద్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌: abhignasagarikaofficial

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement